Karthika Deepam 13 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 1377 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటి జ్వాల చెప్పు అని అడుగుతాడు నిరుపమ్. దీంతో ఎప్పటి నుంచో నా మనసులో మాట చెప్పాలని అనుకున్నాను కానీ.. తింగరి ఆపింది అంటుంది. దీంతో తను ఆపడం ఏంటి.. ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అని అడుగుతాడు. దీంతో మీ కళ్లలోకి చూడటానికే సిగ్గేస్తుంది అంటుంది జ్వాల. చివరకు డాక్టర్ సాబ్ ఐలవ్యూ అంటుంది జ్వాల. దీంతో నిరుపమ్ షాక్ అవుతాడు. డాక్టర్ సాబ్.. మాట్లాడరేంటి అని అడుగుతుంది. దీంతోనా గురించి అసలు ఏమనుకుంటన్నావు జ్వాల అంటాడు నిరుపమ్. తర్వాత నవ్వుతూ ఇంత లేట్ గానా చెప్పడం అని అంటాడు నిరుపమ్. దీంతో జ్వాల కూడా సంతోషిస్తుంది.. కానీ.. ఇదంతా కల. తను డ్రీమ్స్ లో డాక్టర్ సాబ్ కు ఐలవ్యూ చెప్పినట్టు కలగంటుంది.
డాక్టర్ సాబ్ ఏడి అని అడుగుతుంది. దీంతో బావ ఇంకా ఇక్కడికి రాలేదు కదా అంటుంది. నువ్వు అలా చెప్పగానే.. నేను కలలోకి వెళ్లిపోయాను తెలుసా అంటుంది జ్వాల. అదేంటో తింగరి.. డాక్టర్ సాబ్ వచ్చాడట. నేను నా మనసులోని మాట ఫటాఫటా చెప్పేశానట. ఇంత లేట్ గానా చెప్పడం అని డాక్టర్ సాబ్ అన్నాడట. డాక్టర్ సాబ్ పేరు వింటే చాలు.. నా మనసు గాల్లో తేలిపోతుంది. అందులోనూ నువ్వు ఐలవ్యూ చెప్పేయమన్నావు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశావు. ఇక ఆగుతానా చెప్పు. అందుకే ఏదేదో ఊహించుకుంటున్నాను. తింగరి.. నాకు ఇంత హెల్ప్ చేస్తున్నావు కదా. నేను నీకు ఏం చేయాలో చెప్పు అని అడుగుతుంది. దీంతో నాకేమీ వద్దు అని అంటుంది తింగరి. నాకేం కష్టాలు లేవు అంటుంది తింగరి. పోనీ.. నువ్వు ఎవరినైనా ప్రేమించావా చెప్పు. నేను మీ ఇద్దరినీ కలుపుతాను అని అంటుంది జ్వాల. దీంతో నాకు, ప్రేమకు చాలా దూరం అంటుంది. మీ అమ్మానాన్నలు ఎవరు.. అసలు నీ పేరేంటి అని అడుగుతుంది జ్వాల. దీంతో తింగరి షాక్ అవుతుంది.
ఏంటి జ్వాల ఈరోజు ఇలా అడుగుతున్నావు అని అంటుంది. దీంతో చెప్పు తింగరి అంటుంది. నువ్వు నాకోసం ఇంత చేశావు.. నేను నీకోసం ఏదో ఒకటి చేయాలి కదా అంటుంది జ్వాల. దీంతో నువ్వు సంతోషంగా ఉంటే చాలు అంటుంది హిమ. దీంతో అలా ఎలా కుదురుతుంది. నీ పేరేంటో చెప్పు అంటుంది జ్వాల. దీంతో నువ్వు వచ్చాక నా లైఫే మారిపోయింది అంటుంది హిమ.
నువ్వు చెప్పకపోతే ఏంటి.. డాక్టర్ సాబ్ నే అడుగుతా అని నిరుపమ్ కు ఫోన్ చేయబోతుంది. ఇంతలో ఫోన్ లాక్కొని వద్దు అని బతిమిలాడుతుంది. దీంతో సరే అంటుంది జ్వాల. మరోవైపు నిరుపమ్ హిమ దగ్గరికి వస్తాడు. నా గురించి ఏమనుకుంటోంది హిమ. మనసు అంటే ఏంటి అని అనుకుంటాడు. జ్వాలను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనుకుంటాడు.
మరోవైపు రెడీ అయి జ్వాల డాక్టర్ సాబ్ ను కలవడానికి ఆటోలో వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్తుంది. హిమ కూడా అక్కడికి వస్తుంది. ఏంటి తింగరి.. ఈ దాగుడు మూతలు ఏంటి ఈ చీకట్లో అంటుంది. దీంతో వెలుగు చీకటి మనిషి కంటికే.. మనసుకు కాదు అంటుంది.
అది సరే కానీ.. డాక్టర్ సాబ్ ఎక్కడున్నారు అని అడుగుతుంది జ్వాల. దీంతో చీకట్లో ఒక లైట్ వేసి అదిగో అక్కడ ఉన్నాడు అని చెబుతుంది. హలో డాక్టర్ సాబ్ అంటుంది. ఏంటి తింగరి ఇవన్నీ అంటుంది. దీంతో ఆగు జ్వాల. అక్కడే ఆగు అంటుంది హిమ.
మా జ్వాల.. డాక్టర్ సాబ్ కు తన ప్రేమను చెప్పే క్షణాలు అపురూపమైనవే కదా. ఇదొక అందమైన మెమోరీగా మిగిలిపోవాలని నా కోరిక, నా ఆశ. అందుకే ఏర్పాట్లన్నీ నేనే చేశాను. మీ డాక్టర్ సాబ్ తో కలిసి ఏడు అడుగులు వేయడానికి.. నా ప్రేమను తెలపడానికి నీకు, నీ డాక్టర్ సాబ్ కు సరిగ్గా 7 అడుగుల దూరంలోనే ఉన్నావు అని చెబుతుంది హిమ.
దీంతో ఒక్కో అడుగు వేసుకుంటూ నిరుపమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది జ్వాల. నిరుపమ్ తో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటుంది. ఏడో అడుగు వేసేలోపు తనకు ఫోన్ వస్తుంది. దీంతో ఏడో అడుగు వేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో…
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎవరు లాభపడ్డారో తెలియదు కాని…
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
This website uses cookies.