
Karthika Deepam 13 Sep Today Full Episode
Karthika Deepam 13 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1456 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత ఇంట్లో పూజ కంప్లీట్ అందరూ వెళ్ళిపోతారు. మోనిత నువ్వు దాని ఇంటికి ఎప్పుడు వెళ్లావు కార్తీక్ అని అడగగానే రాత్రి వెళ్ళాను తన దగ్గరికి వెళ్ళగానే నాకు ఏదో గుర్తునిచ్చినట్లుగా అనిపించింది. తర్వాత నువ్వు ఇక్కడ పూజ చేసుకుంటున్నావు కదా.. మీరు కూడా అక్కడికి రండి అని చెప్పాను. అప్పుడు దీప నేను రావాలంటే మీరు నేను చెప్పిన విధంగా చేయాలి అని నన్ను ఒక్కడినే కూర్చొని పూజ చేయమని చెప్పింది. అప్పుడు నేను మర్చిపోతానని ఒక పేపర్ మీద రాసుకున్నాను ఇక వచ్చేసాను. అంతే మౌనిత జరిగింది అని చెప్తాడు. అప్పుడు మౌనిత నువ్వు అది లేకుండా పూజ చేయలేవు అని మండిపడుతూ నా మీద ప్రేమ లేదు కార్తీక్ అని అంటుండగా.. ఎప్పుడు నీ మీద ప్రేమ లేదు అని ఇలాగే కోప్పడుతూ ఉంటావు ఎదుటివారి మీద కూడా ఇలానే కోప్పడతావు ఎందుకు అని అక్కడున్న పూల ప్లేటుని ఒక్కసారిగా ఎత్తేసి మోనితపై మండిపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
అప్పుడు మౌనిత ఏంటి ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటుంది. కట్ చేసే సౌందర్య వాళ్ళ ఇంట్లో వినాయకుడి పూజ చేస్తూ సౌర్య గురించి మాట్లాడుతూ ఉంటారు. కట్ చేస్తే దీప డాక్టర్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు నీకు ఇక సంతోషమే కదా నీ డాక్టర్ బాబుని నాకు ఎప్పుడు చూపిస్తున్నావు అని అంటాడు అప్పుడు అయ్యో ఎందుకు చూపించిన అన్నయ్య తప్పకుండా చూపిస్తాను అని అంటుంది దీప అప్పుడు మౌనిత అని కూడా ఒకసారి చూడాలమ్మ అని అంటాడు. అప్పుడు దీప ఎందుకు అన్నయ్య వినాయక చవితి రోజు చంద్రుని చూసినట్టుగా దాని ముఖం చూడడం అని అంటుంది. అప్పుడు డాక్టరు ఏం కాదులే అమ్మ మనం పూజ చేసుకొని అక్షతలు వేసుకున్నాం కదా అని నవ్వుతారు. కట్ చేస్తే మౌనిత ఎలాగైనా కార్తీక్ ని దగ్గర చేసుకోవాలని ఆరోగ్యం బాగా లేనట్టుగా డ్రామాలు ఆడాలని ప్లాన్లు వేస్తుంది. అప్పుడు వెళ్లి జ్వరం వచ్చినట్లుగా వెళ్లి పడుకుంటుంది. అంతలో కార్తీక్ వస్తాడు ఏమైంది మోనిత అని అడుగుతాడు. అప్పుడు డ్రామా మొదలు పెడుతుంది. అప్పుడు కార్తీక్ ఎందుకు సడన్గా నీకు జ్వరం వచ్చింది. నేను నిన్న తిట్టాను కదా అందుకేనా మరి నువ్వు కూడా నాకెందుకు చిరాకు తెప్పిస్తావు..
Karthika Deepam 13 Sep Today Full Episode
మౌనిత అంటూ డాక్టర్ని తీసుకొస్తా అని వెళుతూ ఉండగా. ఆగు కార్తిక్ అని బాధపడినట్లుగా ఏడుస్తూ కార్తీక్ నుతన మాయలో పడేయాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ తన మీద ప్రేమతో నీ మీద కోప్పడినంత మాత్రాన ప్రేమ లేదు అనుకోవద్దు మౌనిత. నేను వెళ్లి డాక్టర్ని తీసుకొస్తాను. అని వెళ్లి బయట శివా కోసం వెతుకుతూ ఉండగా.. దీప డాక్టర్ ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. అప్పుడు కార్తీక్ ని చూసి ఎక్కడికి వెళ్తున్నారు డాక్టర్ బాబు అని దీప ఆడుగుతుంది. మౌనితకి కొంచెం జ్వరంగా ఉంది డాక్టర్ని తీసుకోవడానికి వెళ్తున్నాను అని అనగానే దీప ఇదిగో మా అన్నయ్య డాక్టరే తనను తీసుకెళ్లండి అని చెప్తుంది. అప్పుడు మీరు డాక్టరా రండి అని తనని తీసుకొని వెళ్తాడు. మౌనిత బెడ్ పైన పడుకొని డాక్టర్ వస్తే ఎలా అని భయపడిపోతూ…
శివకు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతుంది. నేను బయట ఉన్న మేడంని శివ అంటాడు. అప్పుడు మౌనిత కార్తీక్ ఇక్కడే కెళ్ళాడు డాక్టర్ తీసుకొస్తే ఎలా అని భయపడుతూ ఉండగా.. కార్తీక్ డాక్టర్ని తీసుకొని వస్తాడు. అప్పుడు మౌనిత ఎందుకు కార్తీక్ తగ్గిపోతుందిలే అని అంటూ ఉండగా.. కార్తీక్ నువ్వు అంత బాధ పడుతుంటే నేను ఎలా చూస్తాను.. చూడండి డాక్టర్ అని చెప్పగానే డాక్టర్ మీరు కూడా డాక్టరే కదా అని కార్తీక్ ని అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో డాక్టర్ చెక్ చేసి మందులు రాసి మోనితాకి చిట్టి ఇస్తాడు. అప్పుడు అది చూసి డాక్టర్ గల్లా పట్టుకుని ఎవడ్రా నువ్వు నిన్ను ఆ వంటలక్కనే పంపించిందా.. అని అంటుండగా దీప కనపడుతుంది. అప్పుడు దీప ని చూస్తూ మౌనిత భయపడుతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లు చూడాల్సిందే..
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.