Karthika Deepam 14 March Today Episode : కార్తీక్, దీప, హిమకు పిండప్రదానం చేసిన సౌందర్య.. హిమను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు మరోసారి ఇంద్రుడు దొంగతనం

Karthika Deepam 14 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 మార్చి 2022, సోమవారం ఎపిసోడ్ 1299 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన అమ్మానాన్న చనిపోయిన విషయాన్ని ఇంద్రుడు, చంద్రమ్మకు చెబుతుంది హిమ. దీంతో ఇంద్రుడు, చంద్రమ్మ కూడా బాధపడతారు. ఆ తర్వాత తనకు అన్నం తినిపించబోతుంది చంద్రమ్మ కానీ.. హిమ వద్దు అంటుంది. నేను వెంటనే మా నానమ్మ ఇంటికి వెళ్లాలి అంటుంది. దీంతో సరే వెళ్దాం కానీ.. ముందు రెండు ముద్దలు తినమ్మ అంటారు. దీంతో మీకు దండం పెడతాను. నన్ను హైదరాబాద్ తీసుకెళ్లండి.. మా నానమ్మ దగ్గరికి తీసుకెళ్లండి అంటుంది హిమ. దీంతో మీ ఊరు హైదరాబాదా అని అడుగుతుంది చంద్రమ్మ. దీంతో హిమ అవును అని అంటుంది.

karthika deepam 14 march 2022 full episode

దీంతో ఇంద్రుడిని పక్కకు తీసుకెళ్లి.. చిక్ మగళూర్ నుంచి హైదరాబాద్ వెళ్లడం అంటే మాటలా. హైదరాబాద్ ఏమన్నా పక్కనే ఉందా. కనీసం 4000 అయినా అవుతాయి. ఎలా పాపను తీసుకెళ్తావు అని అడుగుతుంది. దీంతో ఏదో ఒకటి చేసి అయినా పాపను హైదరాబాద్ తీసుకెళ్లాలి అంటాడు ఇంద్రుడు. మరోవైపు హిమ పచ్చబోట్టు రాయించుకున్న శౌర్య.. తన చేతి మీద ఉన్న ఆ టాటూనను చెడిపోసుకోవడం కోసం తెగ ప్రయత్నిస్తుంది. సబ్బుతో రాసి రాసి దాన్ని చెడిపేస్తుంది. సౌందర్య వచ్చి చూసి.. ఏం చేస్తున్నావు అంటుంది. పచ్చబొట్టును చెడిపేసినంత మాత్రాన బంధాలు దూరం కావు అంటుంది సౌందర్య.

అసలు ఆనందమే లేకుండా చేసింది హిమ. దాన్ని మాత్రం నేను క్షమించను నానమ్మ అంటుంది శౌర్య. వద్దు శౌర్య అన్నా కూడా వినదు. కానీ.. తన చేతి మీద ఉన్న హెచ్ అనే అక్షరం మాత్రం చెడిపోదు. దీంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది శౌర్య.

లేని వాళ్ల గురించి బాధపడాలో.. బిడ్డల మెమోరీగా మిగిలిన శౌర్యను చూసి బాధపడాలో అర్థం కావడం లేదు. భగవంతుడా ఎందుకయ్యా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు అని అనుకుంటుంది సౌందర్య. వాళ్ల ఫోటోల దగ్గరికి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది సౌందర్య.

ఇంతలో ఆనంద రావు వచ్చి సౌందర్య అంటాడు. ఇప్పుడు ఎవ్వరూ ఎవ్వరినీ ఓదార్చలేని స్థితిలో ఉన్నారు. మన మధ్య తిరిగే ఒక్క మనిషి లేడంటేనే తట్టుకోలేం. అలాంటిది.. ముగ్గురి ప్రాణాలు ఒకేసారి గాల్లో కలిసిపోయాయి.. అంటాడు ఆనంద రావు.

Karthika Deepam 14 March Today Episode : వారణాసిపై కూడా సీరియస్ అయిన శౌర్య

పెద్ద వాడి సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరుకుతుందో అనుకున్నా కానీ.. ఇలాంటి పరిష్కారం దొరుకుతుందని కలలో కూడా అనుకోలేదండి అంటుంది సౌందర్య. చస్తే తలకొరివి పెట్టాల్సిన బిడ్డ ఇలా దూరం అయ్యాడు అంటే ఏం చేయాలిరా.. ఎలా మనసుకు సర్దిచెప్పుకోవాలి అంటుంది సౌందర్య.

మరోవైపు శౌర్య దగ్గరికి వారణాసి వస్తాడు. బస్తీ వాళ్లు వస్తారు. ఎంత ఘోరం జరిగిపోయింది. పసిబిడ్డ హిమను కూడా ఆ దేవుడు దూరం చేశాడు.. అంటాడు వారణాసి. ఇద్దరూ ఎంత చక్కగా ఉండేవారమ్మా అంటాడు వారణాసి. దీంతో ఆపు వారణాసి అంటుంది శౌర్య.

ఏమైంది అంటాడు. మా అమ్మనాన్నను చంపేసింది ఆ హిమనే. దాని వల్లే అమ్మానాన్న చనిపోయారు. ఎవ్వరూ హిమ పేరు ఎత్తకండి అంటుంది శౌర్య. మేడమ్.. ఏంటి మేడమ్ ఈ అన్యాయం. మాకు ఉన్న దిక్కును ఆ దేవుడు ఇలా తీసుకెళ్లిపోయాడేంటమ్మా. బస్తీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా దీపక్క వచ్చి అండగా నిలబడేది అంటాడు వారణాసి.

మాకు అండగా ఉన్న దేవత ఇక లేరు అంటే మాకు దిక్కెవరు తల్లి అంటాడు వారణాసి. ఇక మాకు ఏ కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోవాలి. ఎవరు వచ్చి మేమున్నాం అని అంటాడు వారణాసి. దీంతో ఆదిత్య.. మేమున్నాం అంటాడు. ఈ ఇంటి తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయి అంటాడు.

వాళ్లు వెళ్లిపోయాక.. ఆ చనిపోయిన హిమను ఎందుకు ఇలా అంటున్నావు అంటుంది సౌందర్య. దీంతో అది చనిపోలేదు నానమ్మ. చనిపోదు కూడా అంటుంది శౌర్య. అలా అయితే మాత్రం అందరి ముందు అలా మాట్లాడకు. నీకు పుణ్యం ఉంటుంది అంటుంది సౌందర్య. దీంతో అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది శౌర్య.

మరోవైపు హిమను హైదరాబాద్ కు ఎలా పంపించాలో ఆలోచిస్తుంటారు ఇంద్రుడు, చంద్రమ్మ. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. ఎవరో ఒక మహానుభావుడు దొరక్కపోడా.. అని అనుకుంటుండగానే.. నారాయణ బ్యాగు పట్టుకొని వెళ్తుంటాడు.

నీకు 20 వేలు ఇస్తా అని ఫోన్ లో మాట్లాడటం చూస్తారు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం చూస్తాడు ఇంద్రుడు. దీంతో వెంటనే ప్లాన్ అమలు చేస్తారు. చంద్రమ్మ వెళ్లి రంగారావు డబ్బులు ఇవ్వమన్నాడు అని చెప్పి ఫోన్ చేశాడు అని చెప్పి అడుగుతుంది. ఫోన్ లో మాట్లాడండి అంటుంది. అలా నారాయణకు మస్కా కొట్టి బ్యాగులోని డబ్బును ఇంద్రుడు దొబ్బేస్తాడు.

మరోవైపు కార్తీక్, దీప, హిమకు సౌందర్య పిండప్రదానం చేయిస్తుంది. కొట్టేసిన డబ్బులతో హిమను హైదరాబాద్ కు తీసుకొస్తాడు ఇంద్రుడు. హిమ ఇంట్లోకి వచ్చే సమయానికే హిమ ఫోటోను విసిరేస్తుంది శౌర్య. హిమ అన్న మాటలు విని సౌందర్యను కలవకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే

Recent Posts

Pragya Jaiswal : బాబోయ్.. సెగ‌లు రేపుతున్న ప్ర‌గ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!

Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ‌.. ప్ర‌గ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…

5 hours ago

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

6 hours ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

7 hours ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

9 hours ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

9 hours ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

10 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

11 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

12 hours ago