Karthika Deepam 14 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 మే 2022, శనివారం 1352 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకు ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది అని హిమతో అంటాడు నిరుపమ్. మరోవైపు ఈ నిశ్చితార్థం జరగనివ్వను అని సత్యంతో చెబుతుంది స్వప్న. దీంతో సత్యం షాక్ అవుతాడు. అసలు.. ఆ ఉంగరాలు ఎక్కడ పోయాయి అని అడుగుతాడు. దీంతో నేనే తీశాను అంటుంది స్వప్న. మరోవైపు జ్వాల అదే గుడిలో పూజ చేస్తూ ఉంటుంది. ఈ నిశ్చితార్థం ఎలాగైనా ఆగిపోతుందని సంతోషంలో ఉంటుంది స్వప్న. హిమ కూడా ఏదో టెన్షన్ లో ఉంటుంది. బాధ పడుతూ ఉంటుంది. ఇంతలో గుడిలో దేవుడికి మొక్కుతున్న జ్వాల తనకు కనిపిస్తుంది. జ్వాలను చూసి షాక్ అవుతుంది హిమ. దేవుడా ఏంటిది.. శౌర్య ఇక్కడికి వచ్చింది అని అనుకుంటుంది హిమ.
ఏం చేయాలో హిమకు అర్థం కాదు. శౌర్య ఇలాంటి పరిస్థితుల్లో నన్ను, నానమ్మను చూస్తే ఏంటి పరిస్థితి అని అనుకుంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత జ్వాల అక్కడి నుంచి వెళ్లిపోవడంతో హిమ ఊపిరి పీల్చుకుంటుంది. తాంబూలాలు మార్చుకొని.. ఆ తర్వాత ఉంగరాలు మార్చుకుంటే నిశ్చితార్థం సంపూర్ణం అయినట్టే అని అంటాడు పంతులు. ఇంతలో హిమకు టెన్షన్ ఎక్కువైపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడే ఈ స్వప్న అంటే ఏంటో చూపిస్తాను. ఈ పెళ్లి జరగదు.. జరగనివ్వను అని మనసులో అనుకుంటుంది స్వప్న.
ఇంతలో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది హిమ. దీంతో అందరూ షాక్ అవుతారు. స్వప్న కూడా షాక్ అవుతుంది. అదేంటి.. హిమ అలా అంటుంది అని అందరూ షాక్ అవుతారు. ఏమంటున్నావు అని అడుగుతుంది సౌందర్య. దీంతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నానమ్మ అంటుంది.
హిమ.. ఏమైంది అని అడుగుతాడు నిరుపమ్. సారీ బావ అంటుంది హిమ. అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది హిమ. దీంతో సౌందర్యకు ఏం చేయాలో అర్థం కాదు. హిమ ఇలా చేసిందేంటి.. తన మనసులో ఏముంది. నేనున్నానా.. అని అనుకుంటాడు ప్రేమ్.
మరోవైపు ఆటో దగ్గరికి ఆ మహిళ వచ్చేసి.. ఇదేం కలికాలమో.. పెళ్లి వద్దని చివరి నిమిషంలో చెప్పడం ఏంటి అంటూ జ్వాలతో అంటుంది. ఎవరి మనసులో ఏముందో అని అంటుంది జ్వాల. తర్వాత ఆటోలో కూర్చుంటారు వాళ్లు. పాపం.. ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటో అని అనుకుంటుంది జ్వాల.
మరోవైపు ఏంటి మమ్మీ.. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా? నలుగురిలో అవమానించడానికే ప్లాన్ చేశారు కదా. నువ్వు, నీ మనవరాలు అని సౌందర్యను అంటుంది స్వప్న. దీంతో సౌందర్య ఏం మాట్లాడదు. మౌనంగా ఉంటుంది. నాకు ఇంత తెలివి ఉంది అని అనుకుంటే సరిపోదు అంటుంది స్వప్న.
కట్ చేస్తే.. తన తల్లిదండ్రుల ఫోటోను చూస్తూ ఏడుస్తూ నేను తప్పు చేశానని అంటున్నారు కానీ.. నేను చేసింది కరెక్ట్ అని మీకు తెలుసు.. నాకు తెలుసు అంటుంది హిమ. శౌర్యను జాగ్రత్తగా చూసుకోమని మీరు చెప్పారు. చివరి నిమిషంలో కూడా శౌర్యను నాకు అప్పగించినట్టే మాట్లాడారు.
ఆ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి నాన్న. శౌర్య నన్ను అసహ్యించుకొని చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. శౌర్య కోపంలో అర్థం ఉండొచ్చు కానీ.. శౌర్య మీద నాకు ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు నాన్న. శౌర్య కలిసినప్పుడు నేను చాలా సంతోషించాను. కానీ.. నేను హిమను అని శౌర్యకు చెప్పే అవకాశం లేకుండా పోయింది.
దానికి కారణం.. శౌర్యకు నా మీద ఉన్న కోపం. తను నన్ను ఎంత ద్వేషిస్తుందో అర్థం అయ్యాక.. అప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు అనుకున్నాను. అందుకే చెప్పలేదు నాన్న. ఈరోజు నాకు తృప్తిగా ఉంది నాన్న. చాలా సంతోషంగా ఉంది అమ్మ.
మీకిచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నాను. శౌర్య కోసం నా ప్రాణం అడ్డు వేద్దామనుకున్నాను. కానీ.. ఈరోజు నా ప్రేమను అడ్డు వేశాను. శౌర్య కోసం బావ మీద ఉన్న ప్రేమను త్యాగం చేశాను. శౌర్య మనసులో ఏముందో.. నాకు ఆరోజే తెలిసింది.
ఆరోజు జ్వాల, హిమ.. ఇద్దరూ ఐస్ క్రీమ్ తింటుండగా.. జ్వాల మీద ఐస్ క్రీమ్ పడటంతో.. తను కడుక్కోవడానికి వెళ్తుంది. అదే సమయంలో నిరుపమ్ నుంచి జ్వాలకు ఫోన్ వస్తుంది. తన ఫోన్ లో నా మొగుడు అని నిరుపమ్ నెంబర్ ను సేవ్ చేసుకుంటుంది జ్వాల.
దీంతో హిమకు మొత్తం అర్థం అవుతుంది. అంటే.. నిరుపమ్ ను శౌర్య ప్రేమిస్తోందా అని అనుకొని షాక్ అవుతుంది హిమ. దేవుడా.. ఏంటిది అని అనుకుంటుంది. ఫోన్ లో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా చూస్తుంది హిమ. ఇప్పుడెలా అని అనుకుంటుంది.
వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది హిమ. ఆ విషయాలను గుర్తు తెచ్చుకుంటుంది హిమ. ఆ రోజే శౌర్య నిరుపమ్ బావను ప్రేమిస్తోందని తెలిసింది. నేను కూడా నిరుపమ్ బావను కావాలని కోరుకున్నాను. కానీ.. శౌర్య ఆనందమే నా ఆనందం. శౌర్య సంతోషమే.. నా సంతోషం. శౌర్య బాగుంటే చాలు.. తనే నా లోకం.. తనే నా ఫ్రాణం.
నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానమ్మ. నేను ఏసీ కారులో తిరుగుతున్నాను. కానీ.. తను ఆటోలో తిరుగుతోంది. నేను డాక్టర్ ను అయ్యాను. తను ఆటో డ్రైవర్ గా కష్టపడుతోంది అమ్మ. శౌర్యకు నేనేమైనా చేయగలనా అని అనుకున్నాను. ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది నాన్న.
నా ప్రేమను త్యాగం చేసి.. ఎలాగైనా నిరుపమ్ బావతో శౌర్యకు పెళ్లి చేస్తాను.. అని అనుకుంటుంది హిమ. ఇంతకంటే శౌర్యకు నేనిచ్చే గిఫ్ట్ ఏముంటుంది. మీకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. ఆ తృప్తి నాకు ఉంటుంది కదా. ఇన్నాళ్లు శౌర్య మనసును మార్చాలనుకున్నాను. తన కోపాన్ని పోగొట్టాలనుకున్నాను కానీ.. ఇప్పుడు శౌర్యకు, నిరుపమ్ బావకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను.
శౌర్య వస్తే కానీ.. పెళ్లి చేసుకోవద్దనుకున్నాను. కానీ.. ఇప్పుడు శౌర్య పెళ్లే ఇప్పుడు నాకు ముఖ్యం. నిరుపమ్ బావతో శౌర్య పెళ్లి చేయడమే నా జీవిత లక్ష్యం. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్లిద్దరికీ పెళ్లి చేసి తీరుతాను. ఇదే శౌర్య మీద నాకున్న ప్రేమ.. అని అనుకుంటుంది హిమ.
మరోవైపు సౌందర్య.. హిమను చూసి కోపంగా ఉంటుంది. ఏమైంది అని అడుగుతుంది. చివరి నిమిషంలో నచ్చలేదు అన్నావేంటి. స్వప్నను ఒప్పించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నిరుపమ్ ఎంత బాధపడి ఉంటాడో తెలుసా అంటుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.