Karthika Deepam 14 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. కార్తీక దీపం సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది. అంటే తిరిగి సోమవారం, 15 నవంబర్ 2021న ప్రసారం అవుతుంది. ఆరోజు ప్రసారం అయ్యే1197 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత ఇంటికి వెళ్లి దీప బెదిరించిన విషయం తెలిసిందే. దీపకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని మోనిత షాక్ అవుతుంది. కృష్ణా రామా అంటూ ఏడుస్తూ కూర్చుంటుంది అని అనుకున్నా కానీ.. ఇంతలా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటుంది మోనిత.
మరోవైపు దీప కోసం ఊరంతా వెతుకుతాడు కార్తీక్. బస్తీకి కూడా వెళ్తాడు. కానీ.. దీప ఎక్కడా కనిపించదు. ఎక్కడికి వెళ్లావు దీప. ఎక్కడ ఉన్నావు అంటూ తెగ టెన్షన్ పడుతాడు కార్తీక్. ఇంతలో కార్తీక్ కు మోనిత ఫోన్ చేస్తుంది. వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తుంది. డాక్టర్ బాబు అంటూ దీపలా మాట్లాడుతుంది. దీప అనుకుంటాడు. తర్వాత కార్తీక్.. నేను మోనితను అంటుంది. దీంతో కార్తీక్ కు చిరాకు వచ్చి.. ఇంకోసారి ఫోన్ చేస్తే బాగుండదు అని చెప్పి కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు.
కట్ చేస్తే దీప కూరగాయలు, ఇతర సామాన్లు తీసుకొని ఇంటికి ఆటోలో వస్తుంది. అప్పుడే కార్తీక్ కూడా ఇంటికి వస్తాడు. పిల్లలు చూసి.. అమ్మ నువ్వు నాన్న కారులో రావచ్చు కదా అమ్మ అంటారు. దీపను చూసిన కార్తీక్.. తన మనసులో ఏమనుకుంటోంది అని అనుకుంటాడు. మా దారులు వేరమ్మా అంటూ శౌర్యతో అంటుంది. ఇద్దరం ఒకే కారులో ప్రయాణించలేం అమ్మా అంటుంది.
అవన్నీ ఏంటమ్మా అని హిమ అడుగుతుంది. మార్కెట్ కు వెళ్లి చాలా రోజులు అయింది కదా అమ్మా. అందుకే ఈరోజు చేశాను అంటుంది. ఇంత షాపింగ్ ఎప్పుడూ చేయలేదు కదమ్మ అంటుంది శౌర్య. అవును శౌర్య.. బస్తీలో ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఉండేవాళ్లం. అదే కరెక్ట్ అనిపిస్తోంది. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కదా అందుకే ఈరోజు వెళ్లాల్సి వచ్చింది అని చెబుతుంది దీప.
కట్ చేస్తే వదినా.. నేను రాగానే పిల్లలు టెన్షన్ పడ్డారు తెలుసా.. నేను రాలేదని అంటాడు ఆదిత్య. దీంతో నేను ఎటు వెళ్తానురా. ఒకవేళ నాకు ఏదైనా జరిగినా.. మీకు వీళ్లంతా ఉన్నారుగా అంటుంది దీప. దీంతో అందరూ షాక్ అవుతారు. డాక్టర్ బాబు.. గుత్తి వంకాయ, దోసకాయ పచ్చడి మీకోసమే చేశాను. వదలకుండా తినేయాలి. మళ్లీ ఎప్పుడు తింటారో ఏమో అంటుంది.
డాక్టర్ బాబు.. నేను వండిన వంటలకు ఎన్ని మార్కులు వేస్తారు అని అడుగుతుంది దీప. 10కి 10 మార్కులు అంటాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.