Home » Entertainment » Karthika Deepam 15 April 2022 Full Episode
Entertainment

Karthika Deepam 15 April Today Episode : సత్యం, స్వప్నను కలపడం కోసం జ్వాల ప్రయత్నాలు.. మరోవైపు జ్వాలే.. శౌర్య అని స్వప్నకు తెలుస్తుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: April 15, 2022, 11:30 am
Advertisement

Karthika Deepam 15 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 1327 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రవ్వ ఇడ్లీ.. జ్వాల ఫోన్ తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్తాడు. లోపలికి వెళ్లి ఫోన్ కోసం వెతుకుతుంటాడు. ఇంతలో ఫోన్ నాదగ్గరే ఉంది వచ్చేయ్ అని అంటుంది జ్వాల. దీంతో అక్కడ కార్తీక్ ఫోటోను చూడకుండానే వెనుదిరిగి వచ్చేస్తాడు. మరోవైపు నిరుపమ్ ఫోటో ఎగ్జిబిషన్ గురించి ఆలోచిస్తుంటాడు. డాడీని తీసుకెళ్తే మమ్మీ రాదని ఏం చేయాలనుకొని ప్రేమ్ కు ఫోన్ చేస్తాడు నిరుపమ్. నేను, మమ్మీ ఫోటో ఎగ్జిబిషన్ కు బయలుదేరి వస్తున్నాం. డాడీని కూడా తీసుకొనిరా అంటాడు. మమ్మీ గురించి ఆలోచించి డాడీ రానంటున్నారు అని చెబుతాడు ప్రేమ్.

Advertisement

karthika deepam 15 april 2022 full episode

దీంతో ఏం చేయాలో నిరుపమ్ కు అర్థం కాదు. మరోవైపు ఆటో డ్రైవ్ చేస్తా అని రవ్వ ఇడ్లీ అంటే.. చిన్నపిల్లలు డ్రైవింగ్ చేయకూడదు అంటాడు. ఆ హిమ చేసిన పని వల్లనే అమ్మానాన్నలు అర్ధాంతరంగా పోయారు అని అనుకుంటుంది జ్వాల. ఇంతలో హిమ.. జ్వాలకు ఫోన్ చేస్తుంది. నువ్వు ఎక్కడున్నావు అని అంటుంది. నువ్వు తింగరి అంటే కొత్తలో ఎలాగో అనిపించేది కానీ.. ఇప్పుడు బాగుంటుంది అంటుంది. ఇప్పటిదాకా రవ్వ ఇడ్లీ గాడి మీద అరిచాను. నువ్వు ఫోన్ చేయగానే నీ కోపం గాల్లోకి పోయింది అంటుంది జ్వాల. ప్రేమ్ ఫోటో ఎగ్జిబిషన్ కు రమ్మన్నాడు కదా.. నేను వెళ్తున్నాను నువ్వు రావడం లేదా అని ఫోన్ చేశాను అంటుంది హిమ.

Advertisement

దీంతో సరే తింగరి నువ్వు వెళ్లు.. నేను తర్వాత వస్తా అంటుంది జ్వాల. ఇంతలో ఆటోలో జ్వాల ఎక్కడికో వెళ్తుంది. ఇంతలో ఫోటో ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త జయలలిత వస్తుంది. ఆ ఫోటో ఎగ్జిబిషన్ కు నిరుపమ్, స్వప్న కూడా వస్తుంది.

హిమ కూడా వస్తుంది. ప్రేమ్ కు బొకే తీసుకొచ్చి ఇస్తుంది. కంగ్రాట్స్ బావ అంటుంది. స్వప్నకు హిమను చూసి కోపం వస్తుంది. ప్రేమ్ చేతులు పట్టుకున్న హిమ చేతులను తీసేస్తుంది. హిమకు ఫోటోలు చూపిస్తాడు ప్రేమ్. నేను ఎప్పుడో ప్రేమలో పడ్డాను. ప్రకృతో అంటాడు ప్రేమ్.

Advertisement

కానీ.. మనసులో మాత్రం హిమపై ఎనలేని ప్రేమ ఉంటుంది ప్రేమ్ కు. తన మనసులోని మాటను ఎలా చెప్పాలో అర్థం కాదు. మరోవైపు ఆటోలో ఫోటో ఎగ్జిబిషన్ కోసం నా పెళ్లి చూపులు అని చెప్పి సత్యంను తీసుకెళ్తుంది. కానీ.. ఫోటో ఎగ్జిబిషన్ దగ్గరికి తనను తీసుకొస్తుంది.

Karthika Deepam 15 April Today Episode :  సత్యంను చూసి స్వప్న షాక్

ముందు సత్యం షాక్ అవుతాడు. ఇక్కడికి తీసుకొచ్చావు ఏంటి అంటాడు. దీంతో నన్ను క్షమించండి సార్.. మీకు అబద్ధం చెప్పాను అంటుంది. నేను లోపలికి వస్తే బాగోదు అంటాడు సత్యం. వాళ్లందరూ ప్రేమ్ ను పొడుగుతుంటే.. మీరు ఉండకపోవడం ఏంటి అంటుంది జ్వాల.

సత్యంను బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంది జ్వాల. ఇంతలో స్వప్న.. సత్యంను చూస్తుంది. దీంతో సత్యం భయపడతాడు. ఇంతలో ప్రేమ్.. సత్యంను చూసి డాడీ వెల్ కమ్. మీరు వస్తారని అస్సలు అనుకోలేదు అంటాడు ప్రేమ్. జ్వాలనే నన్ను బలవంతంగా తీసుకొచ్చింది అంటాడు సత్యం.

దీంతో థాంక్స్.. నువ్వు అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తావా అంటాడు ప్రేమ్. ఇంతలో నిరుపమ్, తింగరి కూడా వస్తారు. అందరూ కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటారు. అది స్వప్నకు అస్సలు నచ్చదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి