Karthika Deepam 15 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 డిసెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 1223 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ పక్కన దీప ఉంటే.. కార్తీక్ కు ఏం కాదు. దీప అన్నీ చూసుకుంటుంది. దానికి ఆ ధైర్యం దేవుడు ఇచ్చాడు అని సౌందర్య.. ఆనందరావుకు ధైర్యం చెబుతుంది. ఇంతలో స్కూటీ వేసుకొని నేరుగా సౌందర్య ఇంట్లోకే వచ్చేస్తుంది మోనిత. కార్తీక్.. మన బాబు కనిపించడం లేదు అంటుంది. ఇంతలో సౌందర్య, ఆనంద రావు వస్తారు. ఏం మాట్లాడుతున్నావు అంటుంది సౌందర్య. మీరు అనుకున్నంత పని చేశారు కదా. మీ కొడుకు కనిపించడం లేదని చెప్పి నా కొడుకును ఎత్తుకెళ్లారా? అంటుంది. ఆదిత్య ఏడి.. అని అడుగుతుంది మోనిత. ఆదిత్య ఇంట్లో లేడు. బయటికి వెళ్లాడు అంటుంది సౌందర్య. ఖచ్చితంగా ఇది ఆదిత్య పనే. నా కొడుకును ఎత్తుకెళ్లి మీరు నన్ను బెదిరించాలనుకుంటున్నారేమో.. నా కొడుకును ఎవరు ఎత్తుకెళ్లారో తెలిసే దాకా నేను ఇక్కడే ఉంటా అంటుంది మోనిత.
నీ కొడుకును ఎందుకు ఎత్తుకెళ్తాం.. అంటుంది సౌందర్య. వాడు నాకు ఒక్కడే కొడుకు కాదు. ఈ ఇంటి వారసుడు. వాడు దొరికే దాకా నేను ఇక్కడే ఉంటాను.. అని అంటుంది మోనిత. మరోవైపు శ్రీవల్లికి ఈసారి కూడా బిడ్డ పుట్టి చనిపోతుంది. అయ్యో దేవుడా ఎందుకు నాకు ఈ గతి. ఈసారి కూడా నాకు పుట్టిన బిడ్డను నాకు కాకుండా చేశావా.. అని అనుకొని ఏడుస్తుంది శ్రీవల్లి. ఇంతలో తన భర్త ఓ బాబును తీసుకొని వస్తాడు. ఈ హాస్పిటల్ లోనే ఎవరో ఒక ఆవిడ బిడ్డను కనేసి చనిపోయిందట. మగబిడ్డ. మనమే పెంచుకుందాం అంటాడు. కానీ.. శ్రీవల్లి కోసమే.. ఆ బిడ్డను దొంగలిస్తాడు తన భర్త. నడుచుకుంటూ వెళ్తూ కారులో ఆ బిడ్డ పడుకోవడం చూస్తాడు. శ్రీవల్లి బాధను తీర్చాలంటే ఏదో ఒకటి చేయాలి అనుకొని.. ఆ బాబును ఎత్తుకొచ్చి శ్రీవల్లికి ఇస్తాడు. మోనిత కొడుకును శ్రీవల్లికి ఇస్తాడు. కారు మాట్లాడుతాను.. ఇవాళే వెళ్లిపోదాం అంటాడు శ్రీవల్లి భర్త.
మరోవైపు కార్తీక్, దీప, తన పిల్లలు కింద కూర్చొని భోజనం చేస్తుంటారు. అమ్మ ఇలా కింద కూర్చొని తినడం బాగుందమ్మా అంటుంది హిమ. ఏమంటారు కార్తీక్ బాబు అంటే అవును దీప అంటాడు కార్తీక్. ఇంతలో రుద్రాణి అక్కడికి వస్తుంది. ఇల్లు సౌకర్యంగా ఉందా అంటుంది రుద్రాణి.
రండి.. ఇలా వచ్చారు ఏంటి.. కబురు చేస్తే నేనే వచ్చేదాన్ని కదండి అంటుంది దీప. వచ్చేలా చేశావు మరి.. నేనేం చేయను అంటుంది రుద్రాణి. ఇల్లు మొత్తం చూస్తుంది. ఇంట్లో సామాన్లు గట్రా బాగానే ఉన్నాయి. టైమ్ బాలేక వచ్చాను అన్నావు. వంట సామాన్లు చాలానే ఉన్నాయి.. నీవేనా అంటుంది.
బయట వాళ్ల వస్తువులు ఉన్నాయని నేనే తీసుకొచ్చానండి అంటుంది. ఎవరి వస్తువులు అంటే శ్రీవల్లి వాళ్లయి అంటుంది దీప. ఆ మాట నాకు చెప్పాలి కదా.. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా. ఇది రుద్రాణి సామ్రాజ్యం అని తెలుసు కదా అంటుంది. దీంతో నేనే వచ్చి మీకు చెప్పాలని అనుకున్నాను అండి అంటుంది దీప.
నోర్మూయ్.. అంటూ కింద ఉన్న అన్నం గిన్నెను తంతుంది రుద్రాణి. దీంతో అందరూ లేచి నిలబడతారు. మీరేం మనుషులు అండి. పిల్లలు తింటున్నారని తెలిసి కూడా కాళ్లతో తంతారా.. అని సీరియస్ అవుతాడు కార్తీక్. నా మాట వినకపోతే నేను అంతే అంటుంది రుద్రాణి. గిన్నెలయినా మనుషులైనా కాళ్లతోనే సమాధానం చెబుతాను. రుద్రాణి సామ్రాజ్యం ఇక్కడ అంటుంది.
కార్తీక్ ను పక్కకు నెట్టేస్తుంది రుద్రాణి. దీంతో దీప ఆవేశంతో రుద్రాణి చెంప పగులగొడుతుంది. దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. మర్యాద.. మర్యాద నేర్చుకోండి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు అనుకుంటున్నారు.. అంటుంది. మీలాంటి వాళ్లు వందమంది చేతులెత్తి మొక్కుతారు తెలుసా అంటుంది.
నన్నేమన్నా భరిస్తాను కానీ.. మిమ్మల్ని నామందు అగౌరవంగా మాట్లాడితే ఆ దేవుడు అయినా ఊరుకోను అంటుంది దీప. అంత గొప్పోడా.. అంత గొప్పోడు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని అంటుంది రుద్రాణి. అది నీకు అనవసరం అంటుంది దీప.
అంత గొప్పోడు అయితే చాలా పెద్ద కథే ఉందన్నమాట అంటుంది రుద్రాణి. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను బియ్యం ఇస్తాను అంటే వద్దన్నావే అప్పుడే నాకు డౌట్ వచ్చింది అంటుంది రుద్రాణి. ఈ ఇల్లు నీది అనుకున్నా అంటుంది దీప.
ఈ ఇల్లు నాదే. ఆ కోటేశ్ నాదగ్గర 2 లక్షలు అప్పు తీసుకొని రూపాయి చెల్లించలేదు. అందుకే సామాన్లు బయట వేసి ఇల్లు తీసుకున్నాను. ఇప్పుడు మీరొచ్చి సామాన్లన్నీ మళ్లీ లోపల వేసి మొదటి తప్పు చేశారు. నన్ను కొట్టి రెండో తప్పు చేశారు అంటుంది రుద్రాణి. మా వారిని ఏమైనా అంటే మళ్లీ కొడతా అంటుంది దీప.
ఇన్ని సంవత్సరాలలో నా ముందు ఇలా మాట్లాడిన వాళ్లే లేరు. నేను ఉండనివ్వను అంటుంది రుద్రాణి. చూడబోతే మీకు చాలా జాలి గుండె ఉన్నట్టుంది. అయ్యో పాపం కోటేశ్.. అయ్యో పాపం శ్రీవల్లి అనుకున్నారా? అంటుంది రుద్రాణి. అవును.. జాలి పడితే తప్పేంటి అంటుంది దీప.
మీది అంత జాలి గుండె అయితే.. ఆ కోటేశ్ తీసుకున్న అసలు 2 లక్షలు.. ధర్మవడ్డి 1. 20 లక్షలు.. మొత్తం 3.20 లక్షలు కట్టేయండి.. అంటుంది రుద్రాణి. ఏంటి మాట్లాడరు అంటుంది. అవసరమైతే ఇస్తాం అంటాడు కార్తీక్. దీంతో అదీ చూద్దాం అంటుంది. ఇంటి బయట నావాళ్లు ఉన్నారు. చిటికేస్తే మిమ్మల్ని ఊరు దాటించడం.. లోకాన్నే దాటించడం అంత కష్టమేమీ కాదు నాకు అంటుంది రుద్రాణి.
చూడండి.. మీ బెదిరింపులకు ఇక్కడ భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు. ఈ ఇంటికి అద్దె ఇద్దామనుకున్నాను కానీ.. ఇది మీ ఇల్లే కాదని తెలిసినప్పుడు.. అద్దె కోటేశ్ కు ఇవ్వాలి అంటుంది దీప. దీంతో నా అంచనాలకు మించి ఉన్నావు నువ్వు అంటుంది రుద్రాణి. ఎవరికి ఏ వాయనం ఇవ్వాలో.. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అంటుంది రుద్రాణి.
పిల్లలు బాగున్నారా అమ్మా అంటుంది రుద్రాణి. ఈ సారి వచ్చినప్పుడు చాకొలేట్స్ తెస్తానులే అమ్మ అంటుంది. మూడు లక్షల 20 వేలు అసలు వడ్డి కలిపి అంటుంది రుద్రాణి. గుర్తు పెట్టుకుంటాను. ఇంతకు డబల్ ఇస్తాను అని తన చెంప వాయించిన సంగతి గుర్తు చేసి మరీ వెళ్లిపోతుంది రుద్రాణి.
కట్ చేస్తే.. ఉదయం అవుతుంది. మోనిత సౌందర్య ఇంట్లో పూజ చేస్తుంటుంది. ఎవరు ఆ పూజ చేసేది అని ఆదిత్య అడుగుతాడు. నాకు అదే అర్థం కావడం లేదు ఆదిత్య అంటుంది శ్రావ్య. చూస్తే.. మోనిత పూజ చేయడం చూసి ఆదిత్య షాక్ అవుతాడు ఆదిత్య.
శుభోదయం ఆంటి గారు.. శుభోదయం మామయ్య గారు. పూజ చేస్తూ గుడ్ మార్నింగ్ చెబితే బాగుండదని తెలుగులో చెప్పాను అంటుంది. హారతి తీసుకోండి అంటుంది మోనిత. ఆనంద రావును కూడా అడుగుతుంది. కానీ.. వాళ్లు తీసుకోరు. అందరికీ శుభోదయం.. అంటుంది. కానీ… ఎవ్వరూ మాట్లాడరు.
కట్ చేస్తే శ్రీవల్లి, కోటేశ్.. బాబును తీసుకొని ఇంటికి వస్తారు. వాళ్లను ఇంట్లోకి రానిస్తారు కార్తీక్, దీప. లేక లేక కలిగిన బాబు అమ్మ అంటాడు కోటేశ్. కానీ.. బాబు చూస్తే రోజుల బిడ్డలా లేడే.. వయసు ఎక్కువగా ఉన్నట్టు ఉంది అంటాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.