
Karthika Deepam 15 september 2022 full episode
Karthika Deepam 15 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1458 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత ఆడిన డ్రామాలు నమ్మి కార్తీక్ వచ్చి దీపని తిడుతూ ఉంటాడు. అప్పుడు దీప బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ అన్ని విషయాల్ని మర్చిపోతాను కానీ నీ విషయం అంటేనే ఎందుకు నాకు గుర్తుంటుంది. దానిని పట్టుకుని మౌనిత నీమీద నాకు ప్రేముంది అని అనుకుంటుంది. అయినా నువ్వు ఏం ఆశిస్తున్నావు నన్ను ఆశిస్తున్నావా నాకు పెళ్లయింది. భార్య ఉంది. నేను పరాయి స్త్రీ మీద ఆశపడను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మౌనిత ఆనంద్ ని తీసుకురావడానికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ కార్తీక్ ని ఇక్కడే వదిలేసి వెళ్తే ఇంతలో దీప కార్తీక్ ని దగ్గర చేసుకుంటుంది. ఇప్పుడు ఎలా అక్కడికి తీసుకెళ్లాము అంటే సౌందర్య ఆంటీ వాళ్ళు ,పక్కన ఉన్న వాళ్ళందరూ కార్తీక్ ని గుర్తుపడతారు. కార్తీక్ కి నేనేమో నీది ముంబై మీవాళ్లు అక్కడ ఉన్నారని చెప్పాను.
ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఒక ఐడియా ఈ నాలుగు రోజులు నేను దీప ని ఇక్కడ లేకుండా చేస్తే సరిపోతుంది అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.ఇక కట్ చేస్తే దీప డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లి కార్తీక్ తిట్టిన విషయం వాళ్లకు చెప్తూ ఉంటుంది. అప్పుడు నీ బర్తనే కదమ్మా తిట్టింది నిన్ను. నువ్వు ఎందుకు బాధ పడతావు అని వాళ్ళు ధైర్యం చెబుతూ ఉంటారు. అప్పుడు దీప ప్రేమగా చూసుకోవాల్సిన నా భర్త నన్ను అలా తిడుతుంటే చాలా కష్టంగా ఉంటుంది అన్నయ్య అని అంటుంది. అప్పుడు నీ భర్తని నువ్వే కాపాడుకోవాలి నువ్వే ఒక డాక్టర్ అవ్వాలి. కానీ అమౌనిత తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదొక పెద్ద రాక్షసి అని చెప్తూ ఉంటారు. అప్పుడు సరే అన్నయ్య అని అంటుంది. కట్ చేస్తే హిమ, ఆనంద్ రావు ని ఆనంద్ ని తీసుకురమ్మని అడుగుతూ ఉంటుంది. నేనే తీసుకొచ్చే దాన్ని తాతయ్య కాని వాళ్ళు నాకు ఇవ్వను అన్నారు. నువ్వు నాయనమ్మ వెళ్లి తీసుకురండి అని అంటుండగా.. ఆనందరావు కొద్దిసేపు ఆలోచించి సరే అమ్మ అని చెప్తాడు. కట్ చేస్తే చంద్ర, గండ ,శౌర్యాని, వారణాసి తో వెళ్ళొద్దని చెప్తారు.
Karthika Deepam 15 september 2022 full episode
అప్పుడు సౌర్య నేను వెళ్ళాలి మా అమ్మానాన్నలని వెతకాలి అని అంటుంది. అప్పుడు వాళ్లు నీకు దగ్గు వస్తుందమ్మా మనం హాస్పిటల్ కి వెళ్ళాం అని అంటారు. అప్పుడు సౌర్య నేనెవర్ని వంటలక్క కూతురిని ఈ మాత్రం దానికి డాక్టర్ దగ్గరికి ఎందుకు ఇంట్లో ఏదో ఒక మందు వేసుకుంటే సరిపోతుంది. అని వారణాసితో వెళ్ళిపోతుంది. ఇక చంద్ర,గండ తనని చూసి బాధపడుతూ ఉంటారు. కట్ చేస్తే దీప వంట చేసి డాక్టర్ కి పెద్దావిడకు వడ్డిస్తూ.. నేను డాక్టర్ బాబు ని ఇక్కడికి తీసుకొస్తాను అన్నయ్య ఏదైనా వైద్యం చేసి తనకి గతం గుర్తొచ్చేలా చేస్తారా అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ చేస్తాను కానీ తనంతట తానే రావాలి నువ్వు బలవంతంగా తీసుకురావద్దు. అలా తీసుకొస్తే తను నీ మీద ద్వేషం పెంచుకుంటాడు. నా భార్య మోనితే అని గుర్తు పెట్టుకుంటాడు. అలా కాకుండా నువ్వు ప్రేమతో తనని దగ్గర చేసుకో అని కొన్ని విషయాలను చెప్తాడు. అప్పుడు సరే అన్నయ్య అని అంటుంది.
కట్ ఒక ఆశ్రమం నుంచి ఇద్దరు ఆడవాళ్లు వచ్చి మేడం మీ భర్త గతం మర్చిపోయాడు అంట కదా.. ఇక్కడ మా ఆశ్రమం ఉంది. దానిలో మేము ఉచితంగా మందు ఇస్తాము మీ భర్తకి వారం రోజులు గతమంతా గుర్తుకొస్తుంది. అని అంటారు. అప్పుడు మౌనిత మాకు అది ఏమీ అవసరం లేదు మీరు వెళ్ళండి అని వాళ్ళకి చెప్తుంది. ఇదంతా చూస్తున్న దీప సంతోష్ పడిపోతూ ఉంటుంది.ఇక రేపటి ఎపిసోడ్ లో దీప ఊరికి వెళ్తూ.. గండ ఆటో దగ్గరికి వచ్చి అన్న ఆటో వస్తుందా.. అని అడగగానే ఆ వస్తుందమ్మా ఎక్కు అని అంటాడు. అంతలో సౌర్య ఫోన్ చేసి బాబాయ్ సరుకులు తీసుకురా అని చెప్తూ ఉండగా.. నేను రాస్తూ ఉంటాను. నువ్వు చెప్పమ్మా అని అంటాడు. అప్పుడు దీప అన్న నేను మాట్లాడి రాస్తానులే మీరు ఆటో నడపండి అని చెప్తుంది. అప్పుడు దీప ఫోన్ తీసుకొని ఆ హలో చెప్పండి అని అంటుండగా.. శౌర్య తన మాటను విని మా అమ్మ గొంతులా ఉందని ఆలోచిస్తూ ఉంటుంది.
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
This website uses cookies.