
karthika deepam 16 april 2022 full episode
Karthika Deepam 16 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 ఏప్రిల్ 2022, శనివారం ఎపిసోడ్ 1328 హైలైట్స్ ఏంటో ఇఫ్పుడు చూద్దాం. ఏంటి డాక్టర్ సాబ్.. ఎగ్జిబిషన్ లో ఈ తింగరి ఫోటో కూడా పెడదామా అంటుంది జ్వాల. దీంతో అందరూ కాసేపు నవ్వుతారు. డాక్టర్ సాబ్ మీరు కూడా ఫోటోలు తీస్తారా అని అడుగుతుంది జ్వాల. దీంతో తీస్తాను కానీ దాన్ని ఎక్స్ రే అంటారు అంటాడు నిరుపమ్. ఇదంతా విన్న స్వప్నకు చాలా కోపం వస్తుంది. ఇంతలో జయలలిత వచ్చి ఫోటోలను చూస్తుంది. ఫోటోలు బాగున్నాయి అంటుంది. ఈ ఫోటో చాలా బాగుంది అంటుంది. ఇంతలో జ్వాల ఆ ఫోటోను చూసి.. ఆ ఫోటోకు అర్థం ఏంటి అని అడుగుతుంది.
karthika deepam 16 april 2022 full episode
దీంతో దాన్ని మనసుతో చూడాలి.. చూస్తే అర్థం అవుతుంది అంటాడు నిరుపమ్. ఈ స్నాప్ మీరే తీశారా అని అడుగుతుంది. అవును అంటాడు. ఈ ఫోటో నేను కొనుక్కుంటాను అంటుంది. ఆ ఫోటోను మూడు లక్షలకు కొంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ ఫోటో మూడు లక్షలా అంటుంది జ్వాల. నేను ఎన్ని కిలోమీటర్లు ఆటో నడిపితే రావాలి.. అంటుంది జ్వాల. నీ ఫోటోగ్రఫీని ఎవరు ఎంకరేజ్ చేశారు అని జయలలిత అడుగుతుంది ప్రేమ్ ను. మా డాడ్ నన్ను ఎంకరేజ్ చేశారు అంటాడు ప్రేమ్. దీంతో స్వప్నకు కోపం వస్తుంది. మా డాడ్ ఈజ్ మై హీరో అంటాడు ప్రేమ్. నాన్నకే ఈ క్రెడిట్ అంతా అంటాడు.
చూశావా మమ్మీ. తమ్ముడి గొప్పతనం.. డాడీ మంచితనం. మమ్మీ నీ దగ్గరుంటేనే గొప్పవాడిని అయ్యేవాడిని అన్నావు కదా. ఇప్పుడేమంటావు. ఇది డాడ్ అంటే అంటాడు ప్రేమ్. మరోవైపు ఫోటోలు చూసి ఆశ్చర్యపోతుంది. ప్రేమ్ ను పిలిచి.. ఈ ఫోటోలలో ఏముందని ఇంత డబ్బు పెట్టి కొంటున్నారు అని అడుగుతుంది.
ఇంతలో జయలలితతో ఫోటో దిగుదాం అని వెళ్తాడు ప్రేమ్. దీంతో మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇక్కడే పెట్టుకొని.. వాళ్లందరితో కలిసి ఫోటో దిగండి అంటుంది జ్వాల. దీంతో మీ వాళ్లను అందరినీ పిలవండి అంటుంది జయలలిత. దీంతో అందరూ అక్కడికి వస్తారు.
అందరినీ వరుసగా నిలుచోబెడుతుంది జ్వాల. తర్వాత నువ్వు కూడా వచ్చేయ్ జ్వాల. నువ్వు ఒక మా ఫ్యామిలీ మెంబర్ వే అంటాడు నిరుపమ్. దీంతో జ్వాల కూడా ఫోటో దిగుతుంది. మరోవైపు రవ్వ ఇడ్లీ.. మొబైల్ హోటల్ లో పనిచేస్తుంటాడు.
మరోవైపు అక్కడ పనిచేసే ఓ వ్యక్తి.. ఫంక్షన్ కు వెళ్లి వస్తా అంటాడు. కానీ.. తనకు ఎవ్వరూ ఉండరు కదా. తను ఏ ఫంక్షన్ కు వెళ్లడు కదా.. అని అనుకుంటాడు. అమ్మా నన్ను ఎందుకమ్మా వదిలేసి వెళ్లిపోయావు. ఎక్కడున్నావమ్మా.. చెప్పమ్మా అని అనుకుంటాడు రవ్వ ఇడ్లీ.
కట్ చేస్తే.. ఫోటో ఎగ్జిబిషన్ అయిపోతుంది. హిమకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. వెంటనే అక్కడికొచ్చిన జ్వాల దాన్ని లాక్కుంటుంది. దాన్ని ఇవ్వు అన్నా కూడా వినదు. ఇంతలో స్వప్న.. వాళ్లను చూసి కోపంతో వాళ్ల వైపు రాబోతుంది.
ఇదెవరికి.. ఆ డాక్టరమ్మకు ఇస్తావా అంటుంది. దీంతో ఏం చెప్పాలో ప్రేమ్ కు అర్థం కాదు. మరోవైపు తింగరి చూస్తుంది వాళ్లను. అయ్యో జ్వాల ఏం కొంటెపని చేస్తున్నావు. అత్తయ్యకు నీ సంగతి తెలియదు అని అనుకుంటుంది తింగరి. ఇంతలో తింగరి అక్కడికి వస్తుంది.
ఇంతలోనే డాక్టర్ సాబ్ వచ్చి ఆ ఫోటో ప్రేమ్ ను లాక్కుంటాడు. దాంట్లో హిమ ఫోటో ఉందని అందరికీ తెలిసిపోతుంది అని అనుకుంటాడు. జ్వాల ఏంటిది.. బయట ఏంటి ఈ ఆటలు అని అడుగుతాడు నిరుపమ్. నాకు గిఫ్ట్ ఇవ్వకుండా ఎవరికో గిఫ్ట్ ఇస్తాడట అని అంటుంది జ్వాల.
ఇంతలో స్వప్న అక్కడికి వస్తుంది. అయినా కూడా అదేంటో చూడనీ అంటుంది. దీంతో వద్దు.. వెళ్దాం పదా అని తన చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు నిరుపమ్. దీంతో స్వప్నకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఏంటి జ్వాల నువ్వు ఎందుకు ఇలా ప్రేమ్ తో ఆటలు ఆడుతావు అంటాడు నిరుపమ్.
ఈ ఆటో పిల్ల బాగా రెచ్చిపోతోంది. ఆయన్ను కూడా తనే తీసుకొచ్చింది అని అనుకుంటుంది స్వప్న. మరోవైపు చూశారు కదా సార్.. మీ అబ్బాయిని అందరూ ఎలా పొగిడారో అంటుంది. అసలు.. మీ అబ్బాయి కన్నా మీరే గ్రేట్ సార్ అంటుంది జ్వాల.
అందరిలాగా ఇది చదువు అది చదువు.. ఇది కావాలి అది కావాలి అని మీ అబ్బాయిని మీరు ఇబ్బంది పెట్టలేదు కదా సార్ అంటుంది జ్వాల. అవును.. నిజం.. చిన్నప్పటి నుంచి వాడికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అంటాడు. ఇంతలో అక్కడికి వస్తుంది స్వప్న.
ఓహో.. ఇదంతా నువ్వే చేశావా.. అంటుంది స్వప్న. అందులో తప్పేముంది అంటుంది జ్వాల. నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడు అంటుంది. మనం కారులో తిరిగితే స్థాయి పెరుగుతుందని.. ఆటోలో తిరిగితే తగ్గుతుందని ఎక్కడా లేదు మేడమ్ అంటుంది.
ఆటో నడిపేదానివి నువ్వు నాకు నీతులు చెప్పేది అంటుంది. దీంతో మంచి ఎవరు చెప్పినా మంచే కదా అంటుంది జ్వాల. స్వప్న.. జ్వాల ఏం తప్పు చేసింది అని అంటాడు. దీంతో ఎవరో అనామకురాలు వండిపెడితే తింటున్నారు. మీరు మాట్లాడకండి అంటుంది స్వప్న.
దీంతో మీరు వండిపెడితే.. మేము వండిపెట్టాల్సిన అవసరం ఉండదు కదా మేడమ్ అంటుంది జ్వాల. దీంతో ఏం కూశావే అంటూ తనను కొట్టబోతుంది స్వప్న. ఇంతలో నిరుపమ్ వచ్చి తన చేయిని ఆపుతాడు. తనను కొట్టకుండా ఆపుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.
ఆ తర్వాత కోపంతో జ్వాల ఆటోను కాల్చేస్తుంది స్వప్న. దీంతో మంటల్లో కాలిపోతున్న తన ఆటోను చూసి వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది జ్వాల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
This website uses cookies.