Home » Entertainment » Karthika Deepam 16 August 2022 Full Episode
Entertainment

Karthika Deepam 16 August 2022 Episode : కార్తీక్ కోసం ఎదురుచూస్తున్న దీప.. దీపకు ధైర్యం చెబుతున్న డాక్టర్ వాళ్ళ అమ్మ.. !!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: August 16, 2022, 10:30 am
Advertisement

Karthika Deepam 16 August 2022 Episode : కార్తీకదీపం సీరియల్ ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 1432 మంగళవారం ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం… దీప హాస్పిటల్ లో అక్కడున్న డాక్టర్ని కార్తీక్ గురించి అన్ని వివరాలను చెప్తుంది. అప్పుడు అక్కడున్న డాక్టర్ నిన్ను తీసుకువచ్చిన రోజు ఒక డెడ్ బాడీ వచ్చింది. కాబట్టి మనం మాచిడికి వెళ్లి చూద్దాం పద అని దీపని బ్రతిమిలాడి మార్చరీలోకి తీసుకెళ్తాడు. అప్పుడు దీప అక్కడ ఉన్న షూ నీ చూసి డాక్టర్ బాబి నా అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ తనని ధైర్యం చెప్పి దగ్గరికి తీసుకువచ్చి ఆ బాడీని చూస్తారు. కానీ అది కార్తీక్ డెడ్ బాడీ కాదు. అప్పుడు దీప నా మనసు కుదిరిపడింది అన్నయ్య అని డాక్టర్ని అంటుంది. ఇప్పుడైతే మా ఇంటికి వెళదాం. తర్వాత నీ భర్తని వెతుకుదాం అని చెప్తాడు.

Advertisement

కట్ చేస్తే ఇంట్లో హిమ ఆనంద్ రావు సౌందర్య.కార్తీక్ దీప లు చనిపోయారని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు సౌందర్య మనం ఇంట్లో ఉండొద్దు అండి. ఈ ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఏం మంచి జరిగింది. ఇప్పుడు ఏదో ఒక చెడు వార్త వింటూనే ఉన్నాం. ఈ ఇంట్లో ప్రతిక్షణం నరకం లో ఉన్నట్లే అనిపిస్తుందండి. కాబట్టి మనం అమెరికాకి వెళ్లి పోదాం అని సౌందర్య అంటుంది. అప్పుడు హిమ వద్దు నాయనమ్మ మనం ఇక్కడ సౌర్యానీ వదిలేసి వెళ్లిపోతే తను ఒక్కతే ఎలా ఉంటుంది. అమ్మానాన్న తనని చూసుకోమని నాకు చెప్పారు అని హేమ అంటుంది. అప్పుడు సౌందర్య నేను సౌర్యాన్ని వెతికి దాన్ని కూడా మనం అమెరికా తీసుకెళ్లి పోదాం. నేను వెతుకుతాను హేమ నువ్వు కంగారు పడకు అని ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండవద్దు..

Karthika Deepam 16 August 2022 Full Episode

Advertisement

అని అంటుంది. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళింట్లో డాక్టర్ వాళ్ళ అమ్మకి దీప ని పరిచయం చేస్తాడు. నీ కూతుర్ని తీసుకొస్తా అని చెప్పానుగా అమ్మ ఇదిగో తీసుకువచ్చాను అని అంటాడు. నువ్వేనా అమ్మ నీ గురించి మాట్లాడిన రోజంటూ లేదు.. ప్రతిరోజు దేవుడికి మొక్కుకుంటున్న నువ్వు బ్రతకాలి అని. దేవుడు నా మొర విన్నాడు. నిన్ను బ్రతికించాడు అది చాలమ్మా. అని అంటుంది. అప్పుడు దీప దేవుడు ఉండే అందరితో ఆడుకుంటున్నాడు ఇలా బాధ పెడుతున్నాడు. అని అంటుంది. అప్పుడు ఆ పెద్దావిడ దేవుడిని ఎప్పుడు నిందించకూడదు. దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు. మనకు అంత మంచి జరుగుతుంది. అని ధైర్యంగా ఉండాలి అని అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి