karthika deepam 19 april 2022 full episode
Karthika Deepam 19 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 ఏప్రిల్ 2022, మంగళవారం ఎపిసోడ్ 1330 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమ, నిరుపమ్.. జ్వాలకు షాకిచ్చారు. కొత్త ఆటో కొని తీసుకొని వస్తారు. ఏంటి డాక్టర్ సాబ్.. ఆటోలో వచ్చారు. మీకేమైంది అంటుంది జ్వాల. తింగరి.. నువ్వు ఆటో నడుపుతున్నావా.. అంత ధైర్యం వచ్చిందా అంటుంది. ఇంతలో నిరుపమ్.. ఆటో కీస్ తీసి తన చేతుల్లో పెడతాడు. ఈ ఆటో నీకే జ్వాల అంటాడు. దీంతో జ్వాల షాక్ అవుతుంది. ఆటో నాకా.. అంటుంది. దీంతో అవును జ్వాల. కొత్త ఆటో.. బావ నీకోసం కొన్నాడు అంటుంది హిమ. డాక్టర్ సాబ్.. మీరు నాకు ఆటో కొనడం ఏంటి అంటుంది. దీంతో తప్పేముంది జ్వాల. మమ్మీ తొందరపడింది. నేను ఆలోచించాను. ఇంతకన్నా మంచి ఆలోచన వేరే కనిపించలేదు అంటాడు నిరుపమ్.
karthika deepam 19 april 2022 full episode
అవును జ్వాల. అది అందరికీ ఆటో.. కానీ.. నువ్వు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యావు కదా అందుకే.. నీకోసం ఆటో కొన్నాడు అంటుంది హిమ. మీకు ఎలా థాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది జ్వాల. ఇంతలో ఇంద్రుడు, చంద్రమ్మ వస్తారు. కొత్త ఆటో ఎవరు తెచ్చారు అంటారు. దీంతో డాక్టర్ సాబ్.. నాకోసం ఈ ఆటోను తీసుకొచ్చారు అంటుంది జ్వాల. తర్వాత ముగ్గురూ కలిసి ఆటోలో అలా సరదాగా బయటికి వెళ్తారు. ఇంతలో ప్రేమ్ కు కాల్ వస్తుంది. హిమ అనుకుంటాడు కానీ.. కాదు. హిమ కోసం హాస్పిటల్ కు వెళ్తే అక్కడ హిమ లేదు.. అన్నయ్య లేడు. వీళ్లు ఎటు వెళ్లారు అని అనుకుంటాడు.
ఇంతలో ప్రేమ్ కు జ్వాల కనిపిస్తుంది. వామ్మో.. ఈ రౌడీ బేబీ ఇక్కడ ఉందేంటి. తన ఆటో కాలిపోయింది కదా. ఇంకో ఆటో కొనుక్కుందా అని అనుకుంటాడు. ఇంతలో ఆటోలో నుంచి నిరుపమ్, హిమ దిగడం చూసి షాక్ అవుతాడు ప్రేమ్. వీళ్లిద్దరు జ్వాల ఆటోలోనా అని షాక్ అవుతాడు ప్రేమ్.
రెస్టారెంట్ కు వెళ్తున్నారేమో.. ఏంటో ఈ మధ్య.. కాంబినేషన్. వీళ్లెందుకు నాకు చెప్పలేదు. హిమ అయినా నాకు చెప్పాలి కదా అనుకుంటాడు. రిచ్ గా ఉండాల్సిన నువ్వు ఇలా అవ్వడానికి.. ఇంట్లో నుంచి వెళ్లడానికి కారణం నేనే కదా అని అనుకుంటుంది హిమ.
రెస్టారెంట్ లోకి వెళ్లాక.. ప్రేమ్ కూడా వాళ్ల దగ్గరికి వెళ్తాడు. ఈరోజు పార్టీ నేనే ఇస్తున్నాను.. రా వచ్చి కూర్చో అంటుంది జ్వాల. దీంతో అమ్మో అయితే నేను వెళ్తాను అంటాడు. ఉండొచ్చు కదా బావ అనగానే.. ప్రేమ్ కూర్చుంటాడు. నాకు కొత్త ఆటో వచ్చింది. అందుకే పార్టీ ఇస్తున్నాను అంటుంది జ్వాల. డాక్టర్ సాబ్ కొత్త ఆటో కొనిచ్చాడు అంటుంది.
మరోవైపు బిర్యానీ వస్తుంది. తర్వాత తినుకుంటూ సరదాగా అందరూ మాట్లాడుకుంటారు. అవును తిక్క.. నీకు అక్క చెల్లి తమ్ముడు ఎవ్వరూ లేరా అని అడుగుతాడు ప్రేమ్. దీంతో జ్వాలకు కోపం వస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాదు. లేరు అంటుంది జ్వాల.
బతికిపోయారు.. ఉంటే నీలాంటి దానితో వేగలేక పారిపోయేవారు అంటాడు ప్రేమ్. దాన్ని వదిలేసి నేనే పారిపోయాను అని అనుకుంటుంది. నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ.. వాడు పోయినట్టే అంటాడు ఎక్స్ ట్రా. దీంతో తనకేంట్రా.. తనను చేసుకునే వాడు చాలా అదృష్టవంతుడు అంటాడు నిరుపమ్.
ప్రేమ్ ఎంత వద్దన్నా.. ఎక్స్ ట్రా అంటూ ఆటపట్టిస్తూనే ఉంటుంది జ్వాల. దీంతో ప్రేమ్ కు కోపం వస్తూనే ఉంటుంది. ప్రతి దానికి ఎక్స్ ట్రా అంటుంటే.. నువ్వు నన్నే అంటున్నావు కదా అని అంటాడు ప్రేమ్. నిన్నే అన్నాను ఏంటి అంటుంది జ్వాల. మరోవైపు హిమను చూస్తూ ప్రేమ్ తింటుంటాడు. నిరుపమ్ ను చూస్తూ జ్వాల తింటూ ఉంటుంది.
ఆ తర్వాత ఇంట్లో సౌందర్య.. హిమ, జ్వాల కలిసి దిగిన ఫోటోను చూస్తుంది. ఆ ఫోటోను చూసి తనే శౌర్య అని సౌందర్య గుర్తుపడుతుందో లేదో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.