karthika deepam 2 february 2022 full episode
arthika Deepam 2 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 ఫిబ్రవరి 2022, బుధవారం ఎపిసోడ్ 1265 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్.. మెడికల్ షాపు నుంచి మెడిసిన్ తెచ్చి శౌర్యకు ఇస్తాడు. సెలైన్ బాటిల్ కూడా ఎక్కిస్తాడు. ఇదంతా సీసీ టీవీ కెమెరాలో లోపల ఉన్న డాక్టర్ చూస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అని చూస్తుంటుంది. వెంటనే తనకు అనుమానం వస్తుంది. ఇంతలో నర్సు వచ్చి జరగడం అని చెప్పి ఏంటిది.. ఏం చేస్తున్నారు అంటుంది. ఈ సెలైన్ ఎవరు పెట్టారు మాట్లాడరు ఏంటి అంటుంది. మీకు ఇంకా ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయలేదు కదా అంటుంది నర్సు. ఏంటండి ఇది ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంటే మీ వైద్యం మీరే చేసుకుంటారా? అంటుంది సిస్టర్.
karthika deepam 2 february 2022 full episode
ఇంతలో డాక్టర్ వాళ్ల దగ్గరికి రాబోతుంది. అందరినీ అడ్డంగా నిలుచోబెట్టి.. సెలైన్ ఎక్కిస్తుంటాడు. రిసెప్షన్ దగ్గరికి వచ్చిన డాక్టర్.. ఈరోజు ఎంతమంది కొత్త పేషెంట్లు వచ్చారు అని అడుగుతుంది. కార్తీక్ ఏం చేస్తున్నాడని చూసి వాళ్ల దగ్గరికి వస్తుంది. జరగండి.. అంటుంది. ఏంటిది.. ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతుంది. శ్రావణి.. సెలైన్ ఎవరు పెట్టారు. అసలు పేషెంట్ ప్రాబ్లమ్ ఏంటి అని రిసెప్షనిస్ట్ ను అడుగుతుంది. సెలైన్ ఎవరు పెట్టారు అని అడుగుతుంది. అసలు ఏం జరుగుతోంది ఈ హాస్పిటల్ లో. మీరంతా ఏం చేస్తున్నారు. ఇంతలో కార్తీక్ వచ్చి మేడమ్ ప్లీజ్ ఒక్కసారి పాపను చూడండి. సీరియస్ గా ఉంది. ప్లీజ్ పాపకు వైద్యం చేయండి అన్నా కూడా వినదు డాక్టర్.
నేను చేయను. మీరు వెళ్లిపోవచ్చు అని అంటుంది డాక్టర్. మీకే చెప్పేది వెళ్లండి అంటుంది. కట్ చేస్తే ఆదిత్యకు మరోసారి కంట పడుతుంది మోనిత. ఏంటి ఆదిత్య ఈ మధ్య ఇంట్లో కన్నా బయటే ఎక్కువగా కనిపిస్తున్నావు అంటుంది.
అది నీకు అనవసరం అంటాడు ఆదిత్య. ఎంతైనా నేను మీ ఫ్యామిలీనే కదా అంటుంది మోనిత. నన్ను ఇంకా దూరం దూరం పెడుతున్నారు. మీ ఫ్యామిలీకి ఇంకో వారసుడిని ఇచ్చాను. ఇన్ని జరిగినా కూడా మీ మనసు అంగీకరించడం లేదా. ఏంటి శ్రావ్య. ఎలా ఉన్నావు.. అంటుంది.
తర్వాత డాక్టరమ్మను ఒప్పించి తన కూతురుకు వైద్యం చేయమని చెబుతారు. దీంతో సరే అంటుంది డాక్టర్. నేను ఈ కేసును డీల్ చేయలేను కానీ.. డాక్టర్ ధనుంజయ్ గారు ఈరోజు విజిట్ చేస్తారు. ఆయన్ను చూడమని చెబుతాను.. అంటుంది డాక్టర్.
ధనుంజయ్ వచ్చి శౌర్యను చూస్తాడు. పాప హార్ట్ లో హోల్ ఉంది. ఎట్టిపరిస్థితుల్లో ఈరోజు ఆపరేషన్ చేయాలి. ఇప్పటికే ఆలస్యం జరిగింది. గతంలో ఒక ట్రీట్ మెంట్ జరిగినట్టుంది. ఇంతకుముందు పాపకు ఏమైనా అయిందా అని అడుగుతాడు డాక్టర్.
దీంతో అవునండి.. పాపకు డాక్టర్ కార్తీక్ ఆపరేషన్ చేశారు అని చెబుతాడు కార్తీక్. దీంతో వాట్.. మీ పాపకు ద గ్రేట్ కార్డియాలజిస్ట్ కార్తీక్ గారు సర్జరీ చేశారా అని అడుగుతాడు. నమ్మలేకపోతున్నాను అంటారు. అంత పెద్ద డాక్టర్ మీ పాపకు సర్జరీ చేశారా అంటారు డాక్టర్లు.
అలా ఎలా అపాయింట్ మెంట్ దొరికింది. ఏ హాస్పిటల్ లో సర్జరీ చేశారు అని అడుగుతారు. నేను కార్తీక్ గారి ఇంట్లో వంట మనిషిగా కొన్ని రోజులు పనిచేశాను సార్ అంటుంది దీప. దీంతో సరే అంటారు. లేకపోతే ఆయన మీకు ఎలా అపాయింట్ మెంట్ ఇచ్చారు అంటాడు డాక్టర్ ధనుంజయ్.
పాపకు ఆపరేషన్ చేస్తారా అంటే.. ఇది చాలా టఫ్ కేసు. మళ్లీ కాంప్లికేషన్ వస్తే సమస్య అవుతుంది. ఈ కేసును డాక్టర్ కార్తీక్ హాండిల్ చేస్తేనే బెటర్ అంటాడు. టైమ్ లేదు.. గడిచే ప్రతి నిమిషం పాప ఆయుష్షును తగ్గించినట్టే అంటాడు. నేను అయితే ఈ సర్జరీ చేయలేను అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.