Home » Entertainment » Karthika Deepam 2 November 2022 Full Episode
Entertainment

Karthika Deepam 2 Nov Today Episode : కార్తీక్ కోసం మళ్లీ జుట్టు పట్టుకొని కొట్టుకున్న దీప, మోనిత.. ఇంద్రుడు ఇంటికి వెళ్లి మళ్లీ షాకిచ్చిన కార్తీక్

Authored By
Varun G
The Telugu News | Updated on: November 2, 2022 9:38 am
Advertisement

Karthika Deepam 2 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 నవంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 1499 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య ఖచ్చితంగా దొరుకుతుంది. తను ఇక్కడే ఉంది అని దీపకు ధైర్యం చెబుతాడు. మరోవైపు ఈ ఫంక్షన్ చేయడానికి మీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటుంది శౌర్య. దీంతో ఏం సమాధానం చెప్పరు. దీంతో దొంగతనం చేశారా అని అడుగుతుంది శౌర్య. లేదా మీ పుట్టింటి నుంచి వ్యాపారం కోసం తెచ్చిన డబ్బు అయినా ఖర్చు చేసి ఉండాలి అంటుంది శౌర్య. దీంతో లేదు.. ఆ డబ్బులు అలాగే ఉన్నాయి అని అంటుంది చంద్రమ్మ. గొప్ప మనసు ఉన్న వాళ్లు ఇచ్చారు అంటాడు ఇంద్రుడు. ఎవరు వాళ్లు అంటుంది శౌర్య. నీకు ఇష్టం ఉండదు కదా.. అందుకే అప్పుగానే వాళ్ల దగ్గర తీసుకున్నాం అంటాడు. దీంతో ఏంటో బాబాయి… నేను ఇక్కడ ఉండటం వల్ల మీకు అన్నీ ఇబ్బందులే అంటుంది శౌర్య.

Advertisement

karthika deepam 2 november 2022 full episode

మీకే అలా ఉంటే.. మా అమ్మానాన్నలు అయితే ఇంకెంతో సంతోషంగా ఉండేది. అమ్మానాన్నలు ఇవాళ వచ్చినట్టు అనిపించింది. ఈ సమయంలో ఏ ఆడపిల్లకు అయినా తన అమ్మానాన్నలు దగ్గర ఉండాలని అనుకుంటుంది కదా బాబాయి. కానీ.. నేను ఏం పాపం చేశాను. ఎందుకు మా అమ్మానాన్నలు లేరు బాబాయి అంటుంది శౌర్య. మరోవైపు దీప బాధపడుతుంటే ఓదార్చుతాడు దుర్గ. అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది అంటాడు దుర్గ. అన్నీ జరగకపోయినా కొన్ని అయినా జరగాలి కదా. ఒకటి అర అయినా జరగాలి కదా. నా జీవితంలో ఏదీ అనుకున్నట్టు జరగడం లేదు. ఎదురుగా నా భర్త ఉన్నారు కానీ.. నన్ను భార్యగా గుర్తించడం లేదు. అక్కడ నా కూతురు ఉందనుకొని వెళ్తే.. లేదు అంటుంది దీప.

Advertisement

అవును.. ఇంతకీ వాణి ఎక్కడ అని అడుగుతుంది దీప. దీంతో తను ఎవరో.. తనను ఎవరు పంపించారో మొత్తం దీపకు చెబుతాడు. అస్సలు అనుమానం రాలేదు. నిజంగా మనకు సపోర్ట్ చేయడానికే వచ్చింది అని అనుకున్నా అని అంటుంది దీప.

Karthika Deepam 2 Nov Today Episode : దీపకు అసలు విషయం చెప్పిన దుర్గ

తనను వచ్చిన చోటుకే అందుకే పార్శిల్ చేసేశా. మోనితకు షాకిచ్చా అంటాడు దుర్గ. దాన్ని అస్సలు వదలకూడదు అని అంటుంది దీప. మరోవైపు మోనితకు చాలా కోపం వస్తుంది. మరో వస్తువును కింద పడేస్తుంది.

Advertisement

దీంతో ఇంతలో శివ అక్కడికి వస్తాడు. కిందపడిపోయింది. తీసి పెట్టు అంటుంది మోనిత. దీంతో హమ్మయ్య నార్మల్ గానే ఉంది అని అనుకుంటాడు శివ. ఉదయం నుంచి మీరు ఏం తినలేదు. కొంచెమైనా తినండి అంటాడు.

దీంతో ఆకలి లేకుండా ఎలా ఉంటుంది మేడమ్ అంటాడు. దీంతో ఆకలి లేదన్నాను కదా.. నన్ను విసిగించకు అంటుంది మోనిత. మరోవైపు మోనిత దగ్గరికి వచ్చిన దీప.. మోనిత చెంప చెళ్లుమనిపిస్తుంది.

నా ప్రాణాలు తీయడానికి అంత పెద్ద ప్లాన్ వేస్తావా అని మరోసారి చెంప మీద కొడుతుంది. ఏం నాటకం ఆడావే. వాల్తేరు వాణీనా. నీ వల్ల బొటిక్ లో నష్టం వచ్చిందా. నీ అంతు చూడటానికి అని వచ్చి నాటకం ఆడి నా అంతు చూడటానికి ఏం ప్లాన్ వేశావే.. ఎంత ధైర్యమే నీకు అని ప్రశ్నిస్తుంది దీప.

దీంతో అవును.. ఏం చేస్తావే.. జస్ట్ మిస్ అయ్యావు అంటుంది. తర్వాత ఇద్దరూ కార్తీక్ గురించి కొట్టుకుంటారు. కార్తీక్ ప్రేమ నాదంటే నాది అని ఇద్దరూ కొట్టుకుంటారు. కార్తీక్ నాకే సొంతం. కార్తీక్ ను వదలను అంటుంది మోనిత.

Advertisement

నువ్వు అరిచినంత మాత్రాన కార్తీక్ నీవాడు అయిపోడు. ముందు కార్తీక్ ఎక్కడున్నాడో చెప్పు.. అని అడుగుతుంది దీప. దీంతో నాకు తెలియదు. ఎక్కడికి పోయాడో తెలియదు అంటుంది మోనిత.

మరోవైపు కార్తీక్… మళ్లీ ఇంద్రుడు ఇంటికి వెళ్తాడు. శౌర్య అన్నం తింటూ ఉంటుంది లోపల. సార్ మళ్లీ వచ్చారేంటి అంటాడు. ఫంక్షన్ జరిగింది కదా. లోపల ఇంకా క్లీన్ చేయలేదు. అలా వెళ్లి మాట్లాడుకుందాం రండి అంటాడు ఇంద్రుడు.

చెప్పండి సార్ అంటాడు. కొన్ని నిజాలు తెలుసుకుందామని అంటాడు. వారణాసి ఫోటో చూపించి ఇతడు తెలుసా అని అడుగుతాడు. దీంతో తెలియదు అంటాడు. మరోవైపు కిటికీలో నుంచి బయటికి చూస్తుంటుంది శౌర్య.

కార్తీక్ వచ్చాడని చూసి శౌర్యను లోపలికి తీసుకెళ్తుంది చంద్రమ్మ. ఆ తర్వాత ఈ పాపను ఎక్కడైనా చూశావా అని అడుగుతాడు కార్తీక్. అది శౌర్య ఫోటో. దీంతో నేను చూడలేదు అంటాడు ఇంద్రుడు.

Advertisement

ఆ తర్వాత కార్తీక్ వెళ్లిపోతాడు. ఇంద్రుడు లోపలికి వస్తాడు. బాబాయి.. ఇప్పటి దాకా నీతో మాట్లాడింది ఎవరు అని అడుగుతుంది శౌర్య. దీంతో నీకు బట్టలు, నగలు ఇచ్చారని చెప్పా కదా.. ఆయనే మళ్లీ వచ్చారు అంటాడు ఇంద్రుడు.

చెప్తే థాంక్స్ చెప్పేదాన్ని కదా అంటుంది శౌర్య. ఆ తర్వాత శౌర్యను బయటికి వెళ్లమంటాడు. ఏంటి గండా మళ్లీ వచ్చారు అని అడుగుతుంది చంద్రమ్మ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి