Home » Entertainment » Karthika Deepam 21 November 2021 Full Episode
Entertainment

Karthika Deepam 22 Episode highlights : కార్తీక్ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దీప.. కార్తీక్ ను మోనితకు అప్పగించి.. తన దారి తాను చూసుకోనుందా?

Authored By
Varun G
The Telugu News | Updated on: November 21, 2021, 11:36 am
Advertisement

Karthika Deepam 22 Episode highlights: కార్తీక దీపం సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 22 నవంబర్ 2021, 1203 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. ఇంతలో సౌందర్యకు మోనిత ఫోన్ చేసి విసిగిస్తుంది. దీంతో సౌందర్య ఫోన్ కట్ చేస్తుంది. దీంతో ఏకంగా ఇంటికే వచ్చేస్తుంది మోనిత. హ్యాపీ బర్త్ డే దీపక్క అంటూ బొకే తీసుకొని వస్తుంది. కానీ.. మోనిత ఎత్తుగడను ముందే పసిగట్టిన దీప.. థ్యాంక్యూ మోనిత.. బొకే బాగుంది అంటుంది.

Advertisement

karthika deepam 21 november 2021 full episode

మంచిగా మాట్లాడటంతో మోనిత షాక్ అవుతుంది. అదేంటి నేను ఏదో అనుకొని వస్తే.. దీప ఇలా ప్రవర్తిస్తుందేంటి అని అనుకుంటుంది. కార్తీక్ అని ఏదో అనబోతే.. షట్ అప్ మోనిత అంటాడు కార్తీక్. అయ్యో మోనిత.. నేను ఇఫ్పుడే బయటికి వెళ్తున్నా. లేకపోతే నీకు టీకాఫీ ఇచ్చేదాన్ని. ఇప్పుడే పిల్లలతో కలిసి బయటికి వెళ్దామనేసరికి నువ్వు వచ్చావు. ఏది ఏమైనా.. నా బర్త్ డేకు బొకే తెచ్చి శుభాకాంక్షలు చెప్పినందుకు థ్యాంక్స్ అని చెబుతుంది దీప.

Advertisement

ఇంతలో రేపు మా ఇంట్లో అబ్బాయి బారసాల ఉందని అందరూ తప్పకుండా రావాలని చెబుతుంది మోనిత. దీంతో బారసాలకు ఎవ్వరు రాకున్నా.. అందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు వెళ్లి బారసాల ఏర్పాట్లు చేసుకో మోనిత అని చెబుతుంది దీప.

దీంతో కార్తీక్, ఆదిత్య, సౌందర్య, ఆనందరావు అందరూ షాక్ అవుతారు. నాకు అన్ని నిజాలు తెలుసు మోనిత. నువ్వేం టెన్షన్ పడకు. నేను రేపు అందరినీ బారసాలకు తీసుకొస్తా.. అని మోనితకు మాటిస్తుంది దీప. దీంతో మోనిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

అసలు.. దీప ఏంటి ఇలా ప్రవర్తిస్తోంది. అంతా విచిత్రంగా ప్రవర్తిస్తోంది ఎందుకు అని మోనిత కూడా భయపడుతుంది. నేను వేసే ప్లాన్లు అన్నింటినీ అడ్డంగా తొక్కేస్తోంది. దీపకు ఎందుకు ఇంత ధైర్యం అని అనుకుంటుంది మోనిత. ఏం చేయాలో పాలుపోదు మోనితకు.

Karthika Deepam 21 Nov Today Episode : పిల్లలను తీసుకొని షాపింగ్ కు వెళ్లి తిరిగి రాని దీప

కార్తీక్, సౌందర్య కూడా అదే అనుకుంటాడు. దీప ఎందుకు ఇలా ప్రవర్తిస్తోందని. ఏం చేయాలో వాళ్లకు కూడా అర్థం కాదు. దీపకు అన్ని విషయాలు తెలిసిపోయి ఇలా మాట్లాడుతుందా అని కార్తీక్ టెన్షన్ పడతాడు. ఏం చేయాలో కార్తీక్ కు కూడా అర్థం కాదు. దీప పిల్లలను తీసుకొని షాపింగ్ కు వెళ్తుంది.

దీప ఆలోచనలను మనం అందుకోలేకపోతున్నాం మమ్మీ. ఇది మాత్రం కన్ఫమ్. దీప మనకు ఏదో షాక్ ఇవ్వబోతోంది.. అంటాడు కార్తీక్. ఇంతలో కారు వస్తుంది. పిల్లలు వస్తారు కానీ.. దీప రాదు. మీ అమ్మ ఏది అని అడుగుతుంది సౌందర్య. అమ్మ వెళ్లిపోయింది నానమ్మ అంటుంది రౌడీ.

వెళ్లిపోవడం ఏంటి అంటే.. రేపు పొద్దున మిమ్మల్ని ఎక్కడికో రమ్మన్నదట కదా. అక్కడే కలుస్తానంది అని చెబుతుంది శౌర్య. నువ్వు వెళ్లి బారసాలకు ఏర్పాట్లు చేసుకో. వీళ్లందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది.. అని దీప.. మోనితతో చెప్పడం గుర్తుతెచ్చుకొని షాక్ అవుతాడు కార్తీక్. ఇంతకీ దీప ఎక్కడికి వెళ్లింది. కార్తీక్ ను మోనితకు అప్పగించి.. దీప.. బస్తీకి వెళ్లిపోతుందా? అనే విషయం తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి