karthika deepam 21 october 2022 full episode
Karthika Deepam 21 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 అక్టోబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 1489 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పోలీసుల నుంచి దుర్గను, దీపను కాపాడటంతో థాంక్స్ డాక్టర్ బాబు అంటుంది దీప. ఆరోజు నీ మీద అటాక్ చేయించిన వాళ్లకు ఇప్పటికే గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఉంటాయి. మళ్లీ అలాంటి సాహసం చేయదులే.. అని దుర్గ వెళ్తాడు. ఆ తర్వాత వెళ్లొస్తాను డాక్టర్ బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది దీప. వాళ్లు పోయాక.. అసలు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా కార్తీక్ అంటుంది మోనిత. దీంతో నేను అదే అడుగుతున్నా అంటాడు. మీ చుట్టాలబ్బాయి అని చెప్పి ఇప్పుడు నువ్వు అరెస్ట్ చేయిస్తే రేపు ఇంటరాగేషన్ లో అతడు నీ పేరు చెబితే ఎలా.. నీతో పాటు నా పరువు పోదూ అని ఏదో ఒకటి చెప్పి మోనితను నమ్మిస్తాడు.
karthika deepam 21 october 2022 full episode
కానీ.. కార్తీక ప్రవర్తన తనకు అర్థం కాదు. కార్తీక్ ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటుంది మోనిత. ఇంతలో కార్తీక్ ఫోటో పెట్టుకొని ఓం కార్తీకాయ నమ: అంటూ కార్తీక్ ను పూజిస్తుంటాడు దుర్గ. ఏయ్ పిచ్చా నీకు.. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నన్ను లోపల వేయించేద్దామనుకున్నావా బంగారం అంటాడు దుర్గ. దీంతో నెత్తి మీద బాంబు వేసి నిన్ను పైకి పంపించాల్సింది అంటుంది మోనిత. అది నీ వల్ల కాదు బంగారం.. అంటాడు దుర్గ. ఇప్పటికే నీ మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేశావనుకో.. మొహమాటం లేకుండా నిన్ను బయటికి పంపించేస్తాడు అంటాడు దుర్గ.
అసలు నేను నీతో ఇంత క్లోజ్ గా ఉన్నందుకు పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ.. నన్ను ఎందుకు కాపాడాడు. మనిద్దరి మధ్య ఏదో ఉందని కార్తీక్ సార్ కు అర్థం అయిపోయింది.
అందుకే నిన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. మనిద్దరం వెళ్లిపోతే కార్తీక్ సార్.. వంటలక్కతో సెటిల్ అయిపోతాడు అంటాడు దుర్గ. ఇంకా చాలా ఉంది. అదేంటో చూపిస్తా అని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత.
మరోవైపు దుర్గను కార్తీక్ కాపాడారు అని తన అన్నయ్యకు చెబుతుంది దీప. మరోవైపు ఇల్లు ఊడుస్తుండగా కొన్ని ట్యాబ్లెట్లు దొరుకుతాయి పని మనిషికి. దీంతో మోనితను పిలిచి ఇవేం ట్యాబ్లెట్లు అని అడుగుతుంది.
దీంతో ఇవెందుకు తీశావు అని అడుగుతుంది. ఇవి నాకు ఇల్లు ఊడుస్తుంటే నాకు సోఫా కింద దొరికాయి అని చెబుతుంది. ట్యాబ్లెట్లు ఎందుకు మింగడం లేదు.. అని కార్తీక్, శివను పిలుస్తుంది. కార్తీక్ ఎక్కడ అని శివను అడుగుతుంది.
దీంతో తెలియదు మేడమ్.. బయటికి వెళ్లినట్టున్నాడు మేడమ్ అని అంటాడు. కార్తీక్ బిహేవియర్ లో చాలా మార్పు వచ్చింది. ఇదంతా ఆ దుర్గ గాడు వచ్చిన తర్వాతే. అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లాడు.
వంటలక్క దగ్గరికి వెళ్లాడా ఏంటి.. వెళ్లి చూద్దాం అని అనుకుంటుంది. మరోవైపు కార్తీక్ కారులో ఒక చోటుకు వెళ్తాడు. మరోవైపు శౌర్య ఎక్కడుందో అని వెతుకుతూ ఉంటాడు కార్తీక్. బాబాయితో కలిసి మరోవైపు శౌర్య కూడా వెతుకుతూ ఉంటుంది.
బాబాయి.. ఇంటికెళ్లే ముందు ఒక పని చేద్దాం. ఒకసారి మోనిత ఆంటి ఇంటికి వెళ్దాం బాబాయి అంటుంది. దీంతో ఇప్పుడా ఎందుకు అంటాడు బాబాయి. తన ఇంటికి వెళ్లి రాయితో కొట్టాలి బాబాయి అంటుంది.
ఇప్పుడు నువ్వు కొడితే ఆవిడ దృష్టి మొత్తం నీమీదే ఉంటుంది. అమ్మనాన్నలు తెలియనీ అప్పుడు చెప్తా అని అంటుంది. అదే గల్లీలో రోడ్డుకు అవతల వైపు కార్తీక్ ఉంటాడు. ఇటువైపు బాబాయి, శౌర్య ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తారు.
మరోవైపు శౌర్య నవ్వు కార్తీక్ కు వినిపిస్తుంది. ఆ నవ్వు రౌడీదిలా ఉంది అని అనుకుంటాడు కార్తీక్. ఎస్.. ఇది రౌడీ నవ్వే అనుకొని శౌర్య అని గట్టిగా పిలుస్తాడు. కానీ.. అంతలోనే వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
తర్వాత వంటలక్క ఇంటికి వెళ్తుంది మోనిత. నిజం చెప్పి డాక్టర్ బాబును నాకు వదిలేసి వెళ్లిపో అంటుంది దీప. ఎవరు కలిసేది.. ఎవరు విడిపోయేది తొందరలోనే తేలుస్తా అంటుంది మోనిత. డాక్టర్ బాబును నాకు దూరం చేస్తా అని చెప్పి నువ్వు ఏం సాధించావు చెప్పు అంటుంది.
ఇద్దరూ కాసేపు డిస్కషన్ పెట్టుకుంటారు. ఆ తర్వాత డాక్టర్ బాబు ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పేసరికి మోనిత భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
This website uses cookies.