Home » Entertainment » Karthika Deepam 21 September 2022 Full Episode
Entertainment

Karthika Deepam 21 Sep Today Episode : ఆ వంటలక్కే నా భార్య అంటున్న కార్తీక్… దీపకి దూరంగా కార్తీక్ ని తీసుకెళ్లిపోతున్న మోనిత…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: September 21, 2022 9:27 am
Advertisement

Karthika Deepam 21 Sep Today Episode : కార్తీకదీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల ఆదరణ పొందుతోంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1463 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ ,మోనిత దగ్గరికి వచ్చి ఈ బాబు పేరు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మౌనిత కొద్దిసేపు ఆలోచించి ఆనంద్ అని చెప్తుంది. అప్పుడు తన పేరు ఎప్పుడో విన్నట్లుగా అనిపిస్తుంది. అనగానే మన బాబే కదా ఆ పేరు మనం ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం కదా అందుకే నీకు గుర్తుకొస్తుంది. అని అనగానే కార్తీక్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దీప కార్తీక్, దగ్గరికి వెళ్తుండగా.. నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా.. నన్ను నా కార్తీక్ ని వదలవా అని అంటుంది. అప్పుడు నీ కార్తికేంటే నా భర్తని పట్టుకొని నీ కార్తీక్ అని మాట్లాడుతున్నావ్ నా సంసారంలో నువ్వు అడుగు పెట్టావా.. నీ సంసారంలో నేను అడిగి పెట్టాన అని అలా వాళ్ళిద్దరూ మధ్య గట్టి ఘర్షణ జరుగుతుంది. అలా జరిగిన తర్వాత దీప నీ ఆటలన్నీ డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చే వరకే అతనికి ఒక్కసారి గతం గుర్తొచ్చిందంటే నీ చెదలు అంత దులిపేస్తాడు. అంటూ కార్తీక్ ని డాక్టర్ బాబు అని పిలుస్తుంది. అప్పుడు కార్తీక్ రాగానే ఎలా ఉంది డాక్టర్ బాబు తగ్గిపోయిందా అని అనగానే.. అప్పుడు కార్తీక్ ఆ తగ్గిపోయింది.

Advertisement

వంటలక్క వీడున్నాడు కదా.. అంత సరదాగా గడిచిపోతుంది అని అంటారు. అప్పుడు దీప వాడితో బాగా ఆడుకోండి నెమ్మదిగా గతాన్ని గుర్తుచేసుకోండి అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌర్య దగ్గరికి ఆనంద్ రావు, హిమ వచ్చి సౌర్యని ఎలాగైనా తీసుకెళ్లాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ శౌర్య నేను రాను ఇప్పుడు అమ్మ నాన్నలు దొరికిన తర్వాతనే నేను వస్తాను అని మీరు మళ్ళీ ఇక్కడికి వస్తే నేను దూరంగా పారిపోతాను అని చెప్తుంది. అప్పుడు వాళ్లు తిరిగి వెళ్ళిపోతూ ఉండగా… తాతయ్య ఒక్క నిమిషం నా పచ్చబొట్టుని ఎలా తీసేసుకోవాలి. అని అనగానే అప్పుడు హిమ ఆ పచ్చబొట్టు తీయడానికి ప్రయత్నించావో నా మీద ఒట్టే… అలాగే ఈ ఇంటిని ఈ ఊరిని వదిలేసినా కానీ బాగోదు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మౌనిత దీప గురించి ఆలోచిస్తూ ఉండగా… మౌనిత, దీప గురించి ఆలోచిస్తూ ఉండగా.. కార్తీక్ వస్తాడు అప్పుడు మౌనిత, కార్తీక్ ని నీకు అదేమైనా కనిపించిందా అని అడుగుతుంది. అప్పుడు అది అంటే వంటలక్కే కదా తన గురించి అడుగుతున్నావా అని అంటాడు.అప్పుడు అవును ఇంకా నా కర్మకి దానితో టెన్షన్ పడటం తప్ప ఇంకేముంది అని అనగానే… కార్తీక్ నేను ఒక విషయం సూటిగా అడుగుతాను నాకు సమాధానం చెప్పు అని అంటూ నా భార్య ఆ వంటలక్క… నువ్వా అని అనగానే.. మౌనిత కార్తీక్ పై మండిపడుతుంది. అవును నిజంగానే నాకు తెలియడం లేదు నువ్వు భార్య అని చెప్తే నేను నమ్మాను..

Karthika Deepam 21 september 2022 full episode

Advertisement

హాస్పిటల్ నుంచి తీసుకువచ్చావు ఎటువంటి ప్రూఫ్ లేదు. నేనేమైనా అడిగానా.. హాస్పిటల్ నుంచి తీసుకువచ్చిన కొన్ని రోజులు బాగానే ఉన్నామూ ఇక ఆ వంటలక్క వచ్చిన దగ్గరనుంచి భయపడిపోతూ టెన్షన్ పడుతూ ఉన్నావు నాకు ఎందుకు నీ మీద అనుమానం వస్తుంది అని అంటాడు. అప్పుడు మౌనిత ఏడుపు డ్రామా మొదలు పెడుతూ నీకోసం ఇదంతా చేస్తున్నాను నా కొడుకుని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాను అయినా నీకు నమ్మకం కలగడం లేదా.. అని అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే దీప డాక్టర్ కి జరిగిందంతా చెబుతుంది. అప్పుడు డాక్టర్ తనని ఎలాగైనా హాస్పిటల్ కి తీసుకురా అక్కడ ట్రీట్మెంట్ చేపిద్దాం. నేను అంతా చూసుకుంటాను అని అంటాడు. సరే అన్నయ్య నేను తప్పకుండా తీసుకొస్తాను అని చెప్తుంది. కట్ చేస్తే మౌనిత కార్తీక్ ని ఎలాగైనా ఇక్కడినుంచి తీసుకెళ్లి పోవాలని ఒక సీన్ ప్లే చేస్తూ.. ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నామ్ అని అనగానే.. అప్పుడు మౌనిత నామీద బోలెడు అనుమానాలు ఉన్నాయి కదా… అవన్నీ తీరాలి అంటే మనం ఆ ఊరికి వెళ్ళాలి అని చెప్తుంది. ఇప్పుడు అదంతా ఏమీ లేదు మౌనిత అప్పుడంటే ఏదో అలా అనిపించింది అనేసాను అని అంటాడు.లేదు కార్తీక్ వెళ్లాలి తప్పకుండా అని అనగానే సరే వెళ్దాం కానీ టిఫిన్ చేసి వెళ్దాం అని అంటాడు.

కట్ చేస్తే శివ దీప దగ్గరికి వెళ్లి ఏం వంట చేశావు అని అనుకుంటూ దీపక్క మేడం సార్ ని ఏ ఊరుకో తీసుకెళ్తుంది. అని చెప్తాడు. అప్పుడు ఏ ఊరికి తీసుకెళ్తుంది. తమ్ముడు అని అంటుంది. అప్పుడు అదంతా నాకు తెలియదు అక్క నన్ను తీసుకెళ్లడం లేదు సార్ డ్రైవింగ్ చేస్తాడంట అని అనగానే.. తమ్ముడు నువ్వు ఎలాగైనా కనుక్కొని చెప్పు నువ్వు వచ్చేసరికి మీకు ఏమేం కావాలో అవన్నీ వండి పెడతాను. అని అనగానే సరే అక్క అని అక్కడి నుంచి వెళ్లి.. మౌనితకి మేడం మీరు చెప్పమన్నట్టుగానే ఆ వంటలక్కకి చెప్పేశాను అని అంటాడు. అప్పుడు మౌనిత అయితే అది ఏమంటుంది అని అనగానే.. అవునా ఎక్కడికి వెళ్తున్నారు కనుక్కొని చెప్పు అని చెప్పింది అని అంటాడు. అప్పుడు సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అనగానే… శివ మేడం మీరు ఏ ఊరికి వెళ్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు మౌనిత సీరియస్గా శివ వైపు చూడగానే వద్దులేండి మేడం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మౌనిత ఇక మేము ఎక్కడికి వెళ్తున్నాము తెలియక మమ్మల్ని ఫాలో అవుతూ నువ్వు అక్కడికి రాగానే పిచ్చెక్కిపోతుంది అని అంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి