karthika deepam 31 august 2022 full episode
Karthika Deepam 22 Aug Today Episode : కార్తీకదీపం సీరియల్ ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1437 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. దీప మార్కెట్లో కార్తీక్ ఫోటోను చూపిస్తూ అందరిని అడుగుతుంది. అలాగే కార్తీక్ తో వచ్చిన శివాని కూడా అడుగుతుంది. అప్పుడు ఆ శివ నాకు తెలియదు అని చెప్పాడు. దీప అలా అందరినీ అడుగుతూనే ఉంటుంది. అప్పుడు ఒకతను ఇప్పుడే జ్యూస్ తాగుతున్నాడు అక్కడ అని చెప్తాడు. దీప జ్యూస్ పాయింట్ లోకి వెళ్లేసరికి శివ తనని తొందరపెట్టి తీసుకెళ్ళిపోతాడు. అలా దీప అక్కడ అంతా వెతికి బాధపడుతూ ఉంటుంది ఎందుకు దేవుడా ఇలా చేస్తున్నావ్ దగ్గరగా వచ్చాడు అనుకుంటే మళ్ళీ దూరం చేస్తున్నావ్ అని ఏడుస్తూ ఉంటుంది. దీప అలా వెతుకుతూ నైట్ అంతా ఉంటుంది. కట్ చేస్తే చంద్ర, గండ సౌర్యాని సినిమాకి వెళ్దాం పదమ్మ అని అంటారు. అప్పుడు సౌర్య సినిమాకు దొంగతనం చేయడానికి అని అంటుంది. అప్పుడు అయ్యో అదంతా ఎప్పుడు మర్చి పోయాం తల్లి ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు అని అంటారు.
అప్పుడు శౌర్య సరే అని వాళ్లతో వెళ్లిపోతుంది. కట్ చేస్తే మార్కెట్లో ఒకపక్క దీప కూరగాయలు తీసుకుంటుంది. మరోపక్క శౌర్య బట్టలు తీసుకుంటూ ఉంటుంది.ఇంకొకపక్క కార్తీక్ వస్తు ఉంటాడు. కార్తీక్ అక్కడికి వస్తు ఇక్కడ బిర్యాని చాలా బాగుంటుంది సేతుపతి అని అంటాడు. సార్ ఇక్కడ బిర్యాని నా వద్దు సార్ అని తనను తీసుకెళ్లబోతుంటాడు. అప్పుడు కార్తీక్ బిర్యానీ కావాలి అని గట్టిగా అంటాడు. అంతలో దీప కార్తీక్ మాటను విని నా దగ్గరికి వచ్చి కార్తీక్ బాబు ఎక్కడున్నారు. ఎలా ఉన్నారు అని అంతా తడుముతూ ఉంటే.. అప్పుడు ఎవరు మీరు అని దీపని గుర్తుపట్టలేక పోతాడు. అప్పుడు దీప ఏడుస్తూ నేను మీ వంటలక్కని, దీపని మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని అంటుంది. అప్పుడు కార్తీక్ మీరు ఎవర్నో చూసి ఎవరో అనుకుంటున్నారమ్మ నేను మీరు అనుకున్న వాళ్ళని కాదు అని అంటాడు. అప్పుడు శివ సార్ ఎవరో పిచ్చిదాని లాగా ఉంది మనం వెళ్దాం పదండి అని అంటాడు.
Karthika Deepam 22 August 2022 Full Episode
అప్పుడు దీప అతన్ని మీరు పొద్దున ఈ ఫోటోను చూపించి అడిగితే నాకు తెలియదు అన్నారు ఎందుకలా చెప్పారు అంటే ఏదో నాటకం జరుగుతుంది. అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఏంటి ఆవిడ నిన్ను అడిగిందా అని అంటుండగా.. అప్పుడు శివ ఇలాంటివాళ్లు ఇలాంటి ట్రిక్స్ ఉపయోగించి డబ్బులు కోసం చేస్తూ ఉంటారు సార్ మనం వెళ్దాం పదండి అని తీసుకొని వెళ్తాడు. అప్పుడు దీప కొద్ది దూరం పరిగెట్టి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళ ఇంట్లో దీప జరిగిందంతా చెబుతుంది. అప్పుడు డాక్టర్ మనిషి అయితే బ్రతికే ఉన్నాడు కదా తన నీ భర్త అవునా.. కాదా.. తెలుసుకుందాం.. ఈ ఊర్లో నాకు అందరూ తెలుసు నువ్వేం కంగారు పడకు ధైర్యంగా ఉండు అని చెప్తాడు.
అప్పుడు సరే అన్నయ్య అని తను టీ తీసుకొస్తా అని చెప్పి వెళ్తుంది. అంతలో ఒక అతనికి నేను నీకు క్యాంప్ పెట్టాలి అని చెప్పాను కదా.. ఎప్పుడు చెప్తే ఎప్పుడొచ్చావు ఈరోజు డేట్ ఎంత అని క్యాలెండర్ వైపు చూపిస్తాడు. సరే సార్ నేను మళ్లీ ఏర్పాట్లు చేస్తానని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దీప క్యాలెండర్ వైపు చూస్తూ తన పెళ్లి జరిగిన రోజుని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ మళ్ళీ ఏమైంది క్యాలెండర్ వైపు ఎందుకు చూస్తున్నావ్? ఏమన్నా స్పెషల్ రోజా ఈరోజు అని అంటాడు. అప్పుడు నా భర్తతో ఈరోజు సంతోషంగా గడపాల్సిన రోజు అన్నయ్య కానీ నా భర్త నన్ను గుర్తించడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
This website uses cookies.