Karthika Deepam 22 Feb Today Episode : బాబాయిని చంపేందుకు మోనిత కుట్ర.. కానీ.. ఆపరేషన్ చేసి కాపాడిన కార్తీక్.. మోనిత గుట్టును రట్టు చేసిన దీప

Karthika Deepam 22 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 ఫిబ్రవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 1282 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ బాబు ఎక్కడున్నాడో తెలుసా నీకు అని అడుగుతుంది మోనిత. దీంతో ఆ బాబు మా అక్కాబావలతోనే ఉంటున్నాడు అని చెబుతాడు అప్పారావు. శ్రీవల్లి, కోటేశ్ చనిపోయాక వాళ్ల దగ్గరే ఉంటున్నాడని చెప్పి కార్తీక్ బాబును ఎత్తుకొని ఉన్న ఫోటోను చూపిస్తాడు అప్పారావు. ఒరేయ్.. నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది మోనిత. దీంతో అవును మేడమ్. బాబును తీసుకెళ్లి వాళ్లే పెంచుకుంటున్నారు అంటాడు అప్పారావు. మైగాడ్.. నా బాబు కార్తీక్ ఇంట్లో ఉన్నాడా.. కార్తీక్ ఇంట్లో ఉన్న బాబు నా బాబా.. అని అనుకుంటుంది. ఈ డబ్బులు తీసుకో అని ఇస్తుంది మోనిత. దీంతో వద్దు మేడమ్.. ఉంటాను మేడమ్ అని చెప్పి అప్పారావు వెళ్లిపోతాడు.

karthika deepam 22 february 2022 full episode

ఆనందరావు గారు ఈ మమ్మీని వదిలేసి డాడీ దగ్గరికి వెళ్లారా అని అనుకుంటుంది మోనిత. మరోవైపు మోనిత బాబాయికి గుండె నొప్పి వస్తుంది. దీంతో విన్నీ వెంటనే ఏదో ట్యాబెట్ కోసం వెతుకుతుంది. ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చి వాటర్ ఇచ్చి ఈ ట్యాబ్లెట్ వేసుకోమని చెబుతుంది విన్నీ. దీంతో బాబాయి కాస్త కుదుటపడతాడు. ఇలా నొప్పి వస్తే ట్యాబ్లెట్ ఇవ్వమని మేడమ్ గారు చెప్పారు. మేడమ్ కు కాల్ చేస్తాను సార్ అని చెబుతుంది విన్నీ. మరోవైపు దీప.. ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మోనిత.. ఏం కుట్ర పన్నుతోంది అని అనుకుంటుంది దీప. మోనితలో సడెన్ గా ఈ మార్పు ఏంటి. ఆపరేషన్ చేస్తే అన్నీ వదిలేస్తానని ఎందుకు అంటోంది. ఆపరేషన్ డాక్టర్ బాబు చేస్తే మోనితకు ఏంటి లాభం. బాబాయి మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చినట్టు అని అనుకొని.. వెంటనే వారణాసికి ఫోన్ చేస్తుంది దీప.

వారణాసి ఎక్కడున్నావు అని అడుగుతుంది. బస్తీలోనే ఉన్నాను అక్క అంటాడు. మోనిత వాళ్ల బాబాయిని ఆపరేషన్ కు తీసుకెళ్లారా అని అడుగుతుంది. దీంతో ఆపరేషన్ రేపు అట అక్క. అరుణ వదిన చెప్పింది అంటాడు. మోనిత ఇంట్లో ఉందా అంటే లేదు బయటికి వెళ్లింది అక్క అంటాడు.

డాక్టర్ బాబు ఆపరేషన్ ఈరోజే అన్నాడు కదా. మరి.. రేపు అని వారణాసి అంటున్నాడు అని వెంటనే డాక్టర్ బాబుకు ఫోన్ చేస్తుంది. ఏంటి దీప మీకు ఆపరేషన్ మీద అంత ఇంట్రెస్ట్ అని అంటాడు. అవన్నీ కాదు కానీ.. ఆపరేషన్ రేపా.. ఈరోజా చెప్పు అని అంటుంది. దీంతో ఈరోజే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.

మరోవైపు తన బాబు గురించి ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. ఆనంద రావు గారు మీరు అక్కడే ఉండండి. డాడీ దగ్గరే ఉండండి. మీరు డాడీ దగ్గరికి వెళ్లి భలే పని చేశారండి అని అనుకుంటుంది మోనిత. ఇంతలో మోనితకు విన్నీ ఫోన్ చేస్తుంది. కానీ.. లిఫ్ట్ చేయదు. ఇన్ని సార్లు ఫోన్ చేస్తుంది. ఏం పనిలేదు అని అనుకుంటుంది మోనిత.

Karthika Deepam 22 Feb Today Episode : మోనిత బాబాయిని ఆసుపత్రికి తీసుకెళ్లిన దీప

కట్ చేస్తే దీప.. మోనిత ఇంటికి వెళ్లి బాబాయిని ఆసుపత్రికి తీసుకెళ్తుంది. మోనిత ఇంటికి రాగానే.. ఈ విషయాన్ని మోనితకు చెబుతుంది విన్నీ. బాబాయిని కావాలనే వదిలేసి వెళ్లాను. నా ప్లాన్ ను దీప మొత్తం చెడగొట్టేసింది అని మనసులో అనుకుంటుంది మోనిత.

కార్తీక్ దగ్గరికి బాబాయిని తీసుకెళ్లి మోనిత నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. నువ్వు తొందరపడటమే మంచిదైంది దీప. ఏదైనా జరిగితే వాళ్ల బాబాయి ఫ్రాణాలకే ప్రమాదం ఏర్పడేది అంటాడు కార్తీక్. లక్కీగా నువ్వు బాబాయిని తీసుకొచ్చావు. ఆపరేషన్ జరిగింది. బాబాయి సేఫ్. డిశ్చార్జ్ పూర్తి కాగానే బాబాయి అమెరికా వెళ్లిపోతా అన్నాడు అని చెబుతాడు కార్తీక్.

ఇంతలో మోనిత వస్తుంది. ఆపరేషన్ రేపని చెప్పా కదా. ఎందుకు ఇవాళే అపరేషన్ చేశావు అని కార్తీక్ ను నిలదీస్తుంది మోనిత. దీంతో మోనిత చెంప చెళ్లుమనిపిస్తుంది దీప. ఆపరేషన్ రేపు కాదని నీకు అన్నీ తెలుసు. అయినా కూడా ఎందుకు ఇలా చేశావు అని మోనితను నిలదీస్తుంది దీప.

అవును.. నాకు తెలుసు. అయితే ఏంటి. మోనిత ఇక్కడ అంటుంది మోనిత. ఎందుకో తెలుసా? కార్తీక్. కార్తీక్ మీద ప్రేమ అంటుంది మోనిత. కార్తీక్ అంటే పిచ్చి అంటుంది మోనిత. బాబాయిని ఆపరేషన్ దాకా ఒప్పించి ఆపరేషన్ జరగకుండా ఆపి బాబాయి చనిపోతే దిక్కులేని దానిగా అయిపోయానని ఏడుస్తూ కార్తీక్ మనసు కరిగేలా ప్రవర్తించి తనకు దగ్గరవ్వాలని ప్రయత్నించాను.. మోనిత ఇక్కడ అంటుంది మోనిత.

దీంతో మోనిత చెంప చెళ్లుమనిపిస్తాడు కార్తీక్. ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి. నా మంచితనం నీకు అలుసు అయిపోయిందా. నీవల్ల నా ఫ్యామిలీ మొత్తం నరకం చూస్తున్నారు. 11 ఏళ్లు దూరం అయ్యాం. ఇంట్లో నుంచి పారిపోయాం. ఇప్పటికైనా మమ్మల్ని ప్రశాంతంగా బతకనీయవా. అసలు ఎవరే నువ్వు. నీతా నాకేంటి.. నాతో నీకేంటి అని ప్రశ్నిస్తాడు  కార్తీక్.

దీంతో కార్తీక్ అలా అంటావేంటి. నేను కూడా నీ భార్యనే కదా.. అని తాళి చూపిస్తుంది మోనిత. దీంతో ఆ తాళీని తెంపి.. 20 రూపాయలు పెట్టి కొని దాన్ని మెడలో వేసుకుంటే దాన్ని తాడు అంటారు కానీ.. తాళి అనరు. దీనికో పవిత్రత ఉంది. దాన్ని మంటగలిపావు అంటాడు కార్తీక్.

తాళి, బంధం, ఆప్యాయత.. వీటి విలువ తెలియదు నీకు. చెప్పినా కూడా నీకు అర్థం కాదు. మేము ప్రశాంతంగా బతకాలంటే నీకు ఏం కావాలి. డబ్బు కావాలా.. మా మమ్మీ డాడీ కాళ్లు పట్టుకొని నీకు ఉన్నదంతా ఇచ్చేస్తాను. చెప్పు నీకేం కావాలి అని అడుగుతాడు కార్తీక్.

దీంతో నాకు ఇవేమీ వద్దు. నాకు నా బాబును తెచ్చివ్వు అంటుంది మోనిత. మన బాబు అని నువ్వు అనుకోవడం లేదు కదా. నువ్వు అనుకోవడం లేదు కదా.. నా బాబును నాకు వెతికి పెట్టి ఇవ్వు కార్తీక్ అంటుంది మోనిత. ఇంకెప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను.. అంటుంది మోనిత.

దీంతో ఇదే మాట మీద ఉంటావా అని అడుగుతాడు కార్తీక్. డాక్టర్ బాబు.. ఎక్కడున్నాడో.. ఎవరు ఎత్తుకెళ్లారో తెలియదు. ఎలా వెతికి పట్టుకుంటాం అంటుంది దీప. దీంతో దీప నువ్వు ఆగు ప్లీజ్ అంటాడు కార్తీక్. నీ బాబును తెచ్చిస్తే ఇవన్నీ వదిలేస్తావా అని అడుగుతాడు కార్తీక్.

దీంతో వదిలేస్తాను అంటుంది. మన ప్రేమ మీద ఒట్టు అంటుంది మోనిత. మాట మీద నిలబడు.. అది చాలు అంటాడు కార్తీక్. సరే కార్తీక్.. అని అనుకొని ఇద్దరూ కొట్టారు కదా ఇంతకు ఇంతకు పగ తీర్చుకుంటాను అని మనసులో అనుకుంటుంది మోనిత.

బాబును ఎక్కడని వెతుకుతావు కార్తీక్.. అని అనుకుంటుంది. ఇంకేంటి చూస్తున్నావు. వెళ్లు అని అంటుంది దీప. నా చెంప మీద కొట్టారని గర్వ పడుతున్నారేమో.. మీ ఇద్దరి అనుబంధం మీద నేను కొట్టబోతున్నాను అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత.

మరోవైపు అప్పారావు.. సౌందర్య ఇంటికి వెళ్తాడు. పెద్ద మేడమ్ నన్ను దీవించండి అంటాడు. నా తరుపు నుంచి నేను నీకు ఏదైనా హోటల్ పెట్టిస్తా కానీ.. నువ్వు చేస్తున్న పని అస్సలు వదిలిపెట్టకు అంటుంది సౌందర్య. ఎవ్వరూ కనిపించడం లేదేంటి మేడమ్ అంటాడు.

దీంతో కార్తీక్, దీప ఇద్దరూ బయటికి వెళ్లారు. పిల్లలు ఆడుకుంటున్నారు అని చెబుతుంది. తర్వాత కోటేశ్ ఫోటో చూసి.. మోనిత బాబును ఎత్తుకెళ్లింది కోటేశే అని తెలుసుకుంటుంది. అంటే.. మన ఇంట్లో ఉన్న బాబే.. మోనిత కొడుకా.. ఈశ్వరా ఏంటి నీ లీల అని అనుకొని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…

44 minutes ago

Prize Money | క‌ప్ గెలిచిన టీమిండియా ప్రైజ్ మ‌నీ ఎంత‌.. ర‌న్న‌ర‌ప్ పాకిస్తాన్ ప్రైజ్ మ‌నీ ఎంత‌?

Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…

3 hours ago

Chia Seeds | పేగు ఆరోగ్యానికి పవర్‌ఫుల్ కాంబినేషన్ .. పెరుగు, చియా సీడ్స్ మిశ్రమం ప్రయోజనాలు!

Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…

4 hours ago

TEA | మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచే భారతీయ ఆయుర్వేద టీలు.. ఏంటో తెలుసా?

TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…

5 hours ago

Papaya | రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…

6 hours ago

Cumin nutrition | జీలకర్ర ఎక్కువగా తింటున్నారా.. ఆరోగ్య ప్రయోజనాల వెంట కొన్ని ప్రమాదాలు కూడా

Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…

7 hours ago

Tulasi Kashayam | తులసి కషాయం ఆరోగ్యానికి అమృతం లాంటిది .. వర్షాకాలంలో రోగనిరోధకత పెంచే పానీయం

Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…

8 hours ago

Zodiac Signs | పండగ సమయంలో మూడు రాశులపై కేతువు అనుగ్రహం ..ఆర్థిక లాభాలు, అదృష్టం కురిసే చాన్స్

Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…

9 hours ago