Karthika Deepam 22 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 22 సెప్టెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 1151 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కోర్టు శిక్ష విధించడంతో మోనితను జైలులో వేస్తారు. దీంతో ఖైదీ డ్రెస్ వేసుకొని సెల్ లో ఉంటుంది మోనిత. జైలు గదిలో గోడల మీద మొత్తం నా కార్తీక్.. నా కార్తీక్ అని రాస్తుంది మోనిత. తర్వాత హాయ్ కార్తీక్.. నా కార్తీక్.. ఈ చీరలో ఎలా ఉన్నా.. పోలా.. అదిరిపోలా.. అని అంటుంది.
నాకు తెలుసు బంగారం. నేను అదిరిపోయేంత అందంగా ఉన్నానని.. దొంగ నీకు కూడా తెలుసు కానీ బయటపడవు. ఎందుకంటే నువ్వు కార్తీక్ కాబట్టి. నేను ఈ జైలులో 18 నెలలు నీకు దూరంగా ఉండాలా బంగారం. ఉంటాను బంగారం. 18 నెలలు ఏంటి.. 36 నెలలు అయినా నీ నామస్మరణతో ఇట్టే గడిపేస్తాను. బంగారం.. నేనిక్కడ బాగానే ఉన్నాను. ఇక్కడ నిన్ను ప్రేమఖైదీగా చేసుకున్నాక.. నేను ఎక్కడైనా ఖైదీగా అయినా గడిపేస్తాను బంగారం. డోంట్ వర్రీ.. నేను, మన బిడ్డ బాగున్నాం. ఇక్కడ అంతా క్షేమం బంగారం.. నీ ఆరోగ్యం జాగ్రత్త బంగారం. దీపక్క, పిల్లలను అడిగానని చెప్పు.. సరేనా అంటుంది మోనిత. ఇంతలో అక్కడికి కానిస్టేబుల్ వస్తుంది. ఎవరు మేడమ్ ఆయన.. అని అడుగుతుంది. ఆయన నాకు కాబోయే ఆయన. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు కాబోయే తండ్రి.. అంటుంది. కాబోయే ఆయన అంటున్నారు. బిడ్డకు తండ్రి అంటున్నారు.. అనగానే.. ప్రేమ అంటుంది. ప్రేమలో ఉన్నాం. ఈ జైలు శిక్ష అయిపోగానే పెళ్లి చేసుకుంటాం.. అంటుంది మోనిత.
కార్తీక్.. పేరు బాగుంది కదా. ఎంత అందంగా ఉంటాడో. అసలు చూస్తుంటే.. అలా చూస్తూ ఉండిపోతాను తెలుసా? నీ పేరు ఏంటి.. అని అడుగుతుంది. సుకన్య మేడమ్ అంటుంది. మీరు డాక్టర్ అట కద అంటే.. అవును.. నా కార్తీక్ కూడా డాక్టరే. నీకో విచిత్రం చెప్పనా.. ఇంగ్లీష్ లో ఐజేకేఎల్ ఎమ్ అని వరుసగా వస్తాయి కదా.. కే అంటే కార్తీక్.. ఎల్ అంటే లవ్.. ఎమ్ అంటే మోనిత.. కార్తీక్ లవ్ మోనిత.. అంటుంది మోనిత. ఓకే మేడమ్ నేను వెళ్తా.. అని అంటుంది కానిస్టేబుల్. దీంతో ఓకే ఓకే.. నాకూ పనుంది. నా బంగారు కార్తీక్.. అంటూ తనలో తానే ఫుల్ ఖుషీ అవుతుంది.
కట్ చేస్తే.. హిమ, శౌర్య.. ఇద్దరూ సౌందర్య చేతులకు మసాజ్ చేస్తుంటారు. తనకు సేవలు చేస్తుంటారు. ఏంటి మీరు సేవలు చేస్తున్నారా.. పడుకోండి అంటుంది. దీంతో ఏంటి నానమ్మా నువ్వు.. చాలా రోజులకు ఆనందంగా ఉన్నాం కదా.. నిద్ర రావట్లేదు అంటుంది. ఏమైనా కబుర్లు చెప్పు నానమ్మ అంటుంది హిమ. నీ గురించి చెప్పు నానమ్మ అని అడుగుతారు. దీంతో మాది గుంటూరు దగ్గర మంగళగిరి అంటుంది.. సౌందర్య.
మీ పెద్దోళ్లే మా ప్రాబ్లమ్.. నిజం చెప్పాలని పిల్లలకు చెప్పి.. మళ్లీ పిల్లలకే అబద్ధాలు చెబుతారు. నానమ్మా.. ఇప్పటిదాకా మేం ఏం మిస్ అయ్యామో నీకు తెలుసు కదా. అమ్మానాన్నలను ఒక సెల్ ఫోన్ లా, లాప్ టాప్ లా పంచుకున్నాం. మీరు చెప్పేవి అబద్ధాలు అని తెలిసినా నమ్మాం. మా కోసం కాదు.. మీకోసం నటించాం. మేము మాట్లాడేది తప్పా నానమ్మా.. అని అడుగుతారు. దీంతో మీ ప్రశ్నల పరంపరకు ఇప్పుడు సమాధానం చెప్పలేను.. అంటుంది సౌందర్య. మన ఇంట్లో ముందు ముందు సంతోషాలు ఉంటాయి.. అంటే ఇప్పుడు లేవా? అని అడుగుతుంది శౌర్య. మీ ఇద్దరితో నేను మాట్లాడలేను.. అంటుంది సౌందర్య.
నానమ్మా.. మనం అందరం ఎప్పటికీ ఇలాగే ఒకే ఇంట్లో కలిసి ఉంటామా?.. అని అడుగుతుంది శౌర్య. అందరం కలిసే ఉంటాం. మీరేం బాధపడకండి. ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. అందరూ కలిసే ఉంటాం. కలిసే ఉందాం.. అంటుంది సౌందర్య. ఇంతలో ఆనంద రావు అక్కడికి వచ్చి తుమ్ముతాడు. దీంతో సౌందర్య సీరియస్ గా చూస్తుంది.
కట్ చేస్తే దీప.. తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ ను వదిలేసి వెళ్లిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. కార్తీక్ తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన విషయాలను అన్నీ గుర్తుతెచ్చుకుంటుంది దీప. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. కింద కూర్చొని.. దీపను పైన కూర్చోమని చెబుతాడు. దీప… స్త్రీ ఎలా ఉండాలి అని బోలెడన్ని చెప్పారు కానీ.. ఒక మగాడు ఇలా ఉండాలని.. ఒక భర్త ఇలా ఉండాలని అంత స్ట్రాంగ్ గా చెప్పలేదు. ఒకవేళ ఎక్కడో ఒకచోట చెప్పినా.. వాటిని బయటికి రానీయలేదేమో అంటాడు కార్తీక్.
మన జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయో కదా.. దాదాపుగా 11 ఏళ్లు.. ఎన్ని వారాలు, ఎన్ని రోజులో కదా. ఒక మనిషి జీవితంలో ఇన్ని మలుపులు ఉంటాయా.. ఇన్ని కష్టాలా.. నువ్వో చోట.. నేనో చోట.. పిల్లలేమో మనకు వాటా.. ఏంటి ఇది దీప. ఇన్ని మలుపులు తీసుకున్న మన జీవితాల్లో ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను మాత్రం అనుకోలేదు దీప. తుపాను వెలిసినట్టు ఉంది. జరిగనవన్నీ మనసులో నుంచి తీసేద్దాం. కొత్తగా మొదలెట్టినట్టుగా సరికొత్త జీవితం మొదలు పెడుతాం.. అని కార్తీక్ చెప్తాడు.
ఇది అంతం కాదు డాక్టర్ బాబు. తుపాను అంతం కాలేదు. దారి మార్చుకొని మళ్లీ వస్తుంది. మోనిత జైలుకు వెళ్లినా తన కడుపులో బిడ్డ ఉంది. 18 నెలలు అటు చూసి ఇటు చూసేలోగా తను విడుదల అవుతుంది. మోనిత బిడ్డతో సహా.. విడుదల అయ్యాక ఇంటికి వస్తే.. అప్పుడు ఏం చేస్తాం. బిడ్డతో మోనిత ఈ ఇంట్లో అడుగు పెడితే మన బిడ్డలకు ఏం సమాధానం చెబుతాం. చెప్పడానికి మన దగ్గర ఎటువంటి సమాధానం ఉండదు. ఆ మోనిత పిల్లలకు నిజం చెబితే ఎలా.. అందుకే.. పిల్లలకు మనమే ఇప్పుడే నిజం చెప్పేద్దాం అంటుంది దీప.
వద్దు దీప. నిజం చెబుతావా? ఏం నిజం చెబుతావు. నా ప్రమేయం లేకుండా మోనిత గర్భం దాల్చింది. ఈ విషయాన్ని నువ్వు పిల్లలకు ఏమని చెబుతావు. వాళ్లు ఏం అర్థం చేసుకుంటారు. ఆ మోనిత విడుదల అయ్యే లోపు మనం యూఎస్ షిఫ్ట్ అయిపోదాం. అప్పటి వరకు పిల్లలకు ఈ విషయం తెలియనియ్యకుండా చూడు. అక్కడే మనం సేఫ్ గా ఉంటాం. ఇంకేం మాట్లాడకు. ఇది ఫైనల్ అని వెళ్లిపోతాడు కార్తీక్.
కట్ చేస్తే.. తన జైలు గదిలో పడుకున్న మోనిత.. కార్తీక్ తన కలలో ఉన్నట్టు కలవరిస్తుంది. లేచి చూసి నేను ఎక్కడున్నాను.. అని తనకు తానే అనుకుంటుంది. ఓ నేను జైలులో ఉన్నాను కదా.. మరిచే పోయాను అని అనుకుంటుంది. గుడ్ మార్నింగ్ కార్తీక్.. చూశావా.. నీ ప్రేమలో మునిగి.. ఇక్కడ కూడా ఒళ్లు మరిచి నిద్రపోయాను.
ఒకటిన్నర సంవత్సరం.. 18 నెలలు కదా.. చల్తా.. గడిపేస్తానులే కార్తీక్. కార్తీక్.. ఇలాగే నీ ధ్యాసలో హాయిగా శిక్షాకాలం పూర్తి చేస్తా. మరి.. నీ పరిస్థితి ఏంటి కార్తీక్. ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఆ దీప నిన్ను మాయ చేస్తే. నన్ను మరిచిపోయేలా చేస్తే.. అయ్యయ్యో ఇంత మంచి పాయింట్ ను నేను ఎలా మరిచిపోయాను.
18 నెలలు నాకు తక్కువ టైం కానీ.. కార్తీక్ ఫ్యామిలీకి చాలా ఎక్కువ టైమ్. అస్సలే దీప.. మామూలు ఆడది కాదు. వాళ్ల బంధం బలపడితే.. నా కార్తీక్ దీప మాయలో పడితే.. దీప పిల్లలు.. కార్తీక్ వాళ్ల అమ్మ, భాగ్యం, శ్రావ్య.. అందరూ కలిసి కార్తీక్ మనసు మార్చితే.. చేస్తే ఏంటి.. చేస్తారు.. వాళ్లకు టైమ్ ఇస్తే చేస్తారు కానీ నేను వాళ్లకు అంత టైమ్ ఇవ్వనుగా.. ఇస్తే నేను మోనితను ఎలా అవుతాను.. అని అనుకుంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.