Home » Entertainment » Karthika Deepam 22 September 2022 Full Episode
Entertainment

Karthika Deepam 22 Sep Today Episode : మౌనిత వేసిన ప్లాన్ కి… ఒక్కసారిగా షాక్ కి గురైన వంటలక్క…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: September 22, 2022, 9:30 am
Advertisement

Karthika Deepam 22 Sep Today Episode : కార్తీక దీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1464 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… హిమ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నట్లు ఒక లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆనందరావు ఆ లెటర్ ని చూసి చదువుతూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ విషయాన్ని సౌందర్యకి ఎలా చెప్పాలి అని భయపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మౌనిత, కార్తీక్ ని ఆనంద్ ని తీసుకొని ఒక ఊరికి వెళుతూ ఉంటుంది. ఇక వాళ్ల కారు వెనుక దీప కూడా ఇంకొక కారు లో ఫాలో అవుతూ ఉంటుంది. తనను చూసిన దీప నీకు ఇక పిచ్చిఎక్కి పోవాలి అని అనుకుంటూ ఉంటుంది. కొంచెం ముందుకి వెళ్ళగానే మౌనిత సెట్ చేసిన ఒక బట్టలు కొట్టు అది ఎప్పటిదో దానిలాగా తయారుచేసి దానిపైన కార్తీక్ ,మౌనితల పేర్ల బోర్డును ఉంచుతారు. దానిని కార్తీక్ చూపించి మనం పెళ్లయిన కొత్తలో ఇక్కడ బట్టల షాపు పెట్టాము అని అనగానే.. కార్తిక్ మరి ఇకనుంచి ఎందుకు వెళ్లిపోయాం అనగానే.. ఇక్కడ బేరాలు లేవు అందుకే వెళ్ళిపోయాము అని చెప్తుంది మౌనిత. ఇక దీప కూడా ఆ బోర్డు ని చూసి ఇది ఎప్పుడు ఇక్కడ బట్టల షాపు ఎప్పుడు పెట్టింది.

Advertisement

ఇదంతా ఏదో చేస్తుంది అని అనుమాన పడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆనందం హిమ గురించి ఫోన్ చేసి సౌందర్య కి చెప్తాడు. అప్పుడు సౌందర్య బాధపడుతూ ఈ పిల్లలు ఏంటండీ ఇలా చేస్తున్నారు.. సరే సౌర్య ఉండేది ఇక్కడే కాబట్టి అది దాని దగ్గరికి వెళ్తుంది కాబట్టి నేను అక్కడికి వెళ్తాను మీరు కూడా రండి అని చెప్తుంది. ఇక కట్ చేస్తే కార్తీక్ ని ఒక ఊర్లోకి తీసుకెళ్లి కార్ దిగుతూ ఉండగా.. అక్కడ మౌనిత సెట్ చేసిన కొందరు జనాలు గబగబా వాడి దగ్గరికి వచ్చి తెగ డ్రామాలాడుతూ ఉంటారు. కార్తీక్ బాబు ఎలా ఉన్నావు? బాగున్నారా? మీ బాబు ఎలా ఉన్నాడు అమ్మ మౌనితమ్మ బాగున్నావా అని అంటూ ఉండగా… కార్తీక్ బిత్తిరి చూపులు చూస్తూ ఉంటాడు. అప్పుడు అందులో ఒక ఆవిడ నేను సూరమ్మత్తని అని అంటూ ఉంటుంది. అదంతా చూస్తున్న దీప ఇది కార్తీక్ ని మాయలో పడేయడానికి ఇదంతా చేస్తుంది డాక్టర్ బాబు దాన మాయలో పడకముందే నేను వెళ్ళాలి అని వెళ్లి డాక్టర్ బాబు ఇది నీ ఊరు కాదు.. వీళ్ళని వాళ్లు కాదు.. అని అంటుండగా… ఆ జనాలలో ఒక ఆవిడ అక్క వీళ్ళని వదలవా ..ఇంకా వెంటాడుతూనే ఉన్నావా.. అని దీప నీ తిడుతూ ఉంటుంది.

Karthika Deepam 22 september 2022 full episode

Advertisement

ఒక ఆవిడ దీపపై కార్తిక్ కి ఇది ఒక మాయలాడి దీని మొగుడు ఆర్ఎంపీ డాక్టర్ దీన్ని వదిలేసి పోయాడు. మీ ఇంట్లో వంట చేసుకుంటూ ఉండేది ఇది నీ మీద మోజు పడింది. అని చెప్తూ ఉంటుంది. అప్పుడు దీప ఏడుస్తూ ఇదంతా మౌనిత సెట్ చేసింది. ఇది మీరు నమ్మకండి. నేను నీ భార్యని మీరు నా మెడలో తాళి కట్టారు. అని ఏడుస్తూ ఉండగా… కార్తీక్ ఒక్కసారిగా ఇక ఆపు వంటలక్క.. ఇంతమంది చెప్పేది నమ్మాలా.. నువ్వు చెప్పేది నమ్మాలా ..ఎందుకు ఇంత మందితో మాటలు అనిపించుకుంటున్నావు… ఇకనైనా మారి మంచిగా బ్రతుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు దీప ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే సౌందర్య, ఆనందరావు, హిమ గురించి ఆలోచిస్తూ ఉండగా.. ఆనందరావు మన ఇంటికి ఏదో పెద్ద శాపం జరిగింది. అందుకే మన కొడుకు, కోడలు దూరమయ్యారు. ఇప్పుడు మనవరాలు దూరమవుతున్నారు. అని అంటూ ఉంటాడు. అప్పుడు అంతలో ఒక ఇన్స్పెక్టర్ సౌందర్య కి ఫోన్ చేసి మౌనిత నెంబర్ ను ఇస్తాడు. కట్ చేస్తే మౌనిత ఇంటికి వచ్చేసి దీపకి ఇచ్చిన డోస్ కి సంతోష పడిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ ని అనుమానం పోయిందా కార్తిక్ అని అంటుండగా… ఆ పోయింది.

మోనిత నిన్ను ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు సారీ అని చెప్తాడు. ఇక తెగ సంతోష పడుతూ ఉంటుంది మోనిత. అంతలో సౌందర్య ఫోన్ చేస్తుంది. మౌనిత ఫోన్ ఎత్తి హలో ఎవరు అని అంటుండగా.. అవతల సౌందర్య మీరెవరు అని అడుగుతుంది. అప్పుడు మీరే నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతారు ఏంటి.? మాది ఒక బోటిక్ మీకేం కావాలి అని అడుగుతూ ఉంటుంది మోనిత. అప్పుడు సౌందర్య నేను సౌందర్యాన్ని అనగానే.. కార్తీక్ సర్దుతున్న బొమ్మ కింద పడగానే చూసుకో కార్తీక్ అని నోరు జారుతుంది. అవతల సౌందర్య వింటూ కార్తిక్ అంటున్నావేంటి మోనిత అని అనగానే మోనిత ఫోన్ కట్ చేస్తుంది. ఇక సౌందర్య కి అనుమానం వచ్చి మౌనిత దగ్గరికి వస్తు ఉంటారు.. ఇక మౌనిత కంగారు పడిపోతూ ఉంటుంది. మౌనిత ని చూసిన కార్తిక్ ఏమైంది ఫోన్ రాగానే అలా అయిపోయావు అని అడుగుతాడు. అయ్యో ఇది ఫోన్ వల్ల కాదు కార్తీక్ ఈరోజు ఊరికి వెళ్లి వచ్చాం కదా.. కొంచెం టైడ్ అయ్యాము నీకు అలా కనిపిస్తున్నాను అని అంటుంది. అప్పుడు కార్తీక్ అయితే వెళ్లి పడుకో ఎందుకు అక్కడే కూర్చున్నావు అని అంటాడు. అప్పుడు ఏం కాదులే కార్తీక్ అని అంటూ… సౌందర్య ఆంటీ ఇక్కడికి వస్తే ఏం చేయాలి అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి