
Karthika Deepam 23 August 2022 Full Episode
Karthika Deepam 23 Aug Today Episode : కార్తీక దీపం సీరియల్. ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1438 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. దీప తన పెళ్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే కార్తీక్ ని శివ లేపుతూ ఉంటాడు. కానీ కార్తీక్ నన్ను కాసేపు పడుకొని ఇవ్వు అని అంటాడు. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళ ఇంట్లో దీప పెళ్లిరోజు సెలబ్రేషన్స్ చేయడానికి ఇల్లంతా డెకరేషన్ చేసి కేక్ తీసుకొచ్చి దీపతో కేక్ కట్ చేయమని చెప్తారూ.. అప్పుడు దీప సంతోష పడిపోతూ కేక్ కట్ చేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు దీపకి పెద్దావిడ డాక్టర్ కలిసి ధైర్యం చెప్తారు. నీ భర్తకి ఏం కాదు నీ భర్త దొరుకుతాడు అని చెప్తారు. కట్ చేస్తే సౌందర్య సౌర్య గురించి బాధపడుతూ ఉంటుంది. అంతలో హిమ అక్కడికి వచ్చి ఇక బయలుదేరండి నాయనమ్మ, తాతయ్య వెళ్లి హిమ ని తీసుకురండి అని చెప్తుంది. అప్పుడు సౌందర్య తను రానని మీరు మళ్ళీ ఇక్కడికి వస్తే నేను దూరంగా వెళ్లిపోతానని అంటుంది నేను ఎలా తీసుకురాను అని అంటుంది. అప్పుడు హిమ కుదురుతుంది నానమ్మ నేను అన్నము, నిద్ర బంద్ చేసి స్కూల్ కి వెళ్లడం కూడా బంద్ చేసి నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అప్పుడు కుదురుతుంది అని అంటుంది.
అప్పుడు సౌందర్య హిమ చంప మీద ఒక్కటి ఇచ్చి ఇప్పటికే అందరూ దూరమైనందుకు మేమెంతో కుమిలి పోతున్నాము. ఇక నువ్వు కూడా ఎందుకే ఇలా చేస్తున్నావ్ అని అంటుంది. అప్పుడు హిమ అందుకే సౌర్యాని తెచ్చుకుందాం నాయనమ్మ.. తను లేకుండా నేను బ్రతకలేను నన్ను ఎలాగైనా సరే శౌర్య దగ్గరికి తీసుకెళ్లండి అని చెప్తుంది హిమ. కొద్దిసేపు ఆలోచించి ఆనందరావు సరే తీసుకెళ్తాను అని చెప్తాడు. అప్పుడు సంతోష్ పడిపోయి తను రూమ్ లోకి వెళుతుంది. కట్ చేస్తే దీప కార్తీక్ ఎందుకు నన్ను గుర్తుపట్టట్లేదు పక్కనున్న అతను ఎందుకు తను కార్తీక్ ని నాకు దూరంగా ఉంచాలి అనుకుంటున్నాడు. డాక్టర్ బాబుని నా దగ్గరికి చేర్చుకుంటా అని అంటుంది. అలా తనని వెతకడం కోసం కిందికి వచ్చి పెద్దావిడకి వెళ్తున్న అని చెప్తుంది. అప్పుడు పెద్దావిడ నిన్నొకటి అడగొచ్చా అమ్మ అని అంటుంది. అడుగమ్మ అని దీప అంటుంది. అంతలో డాక్టర్ వాళ్లకి టీ తీసుకొని వచ్చి ముగ్గురికి ఇస్తాడు. అప్పుడు దీప ఎందుకన్నయ్య ఇవన్నీ నీకు నేను ఉన్నంతవరకు ఇవన్నీ మీరు ముట్టుకోవద్దని నేను చెప్పాను కదా అని అంటుంది. మీకెందుకు అన్నయ్య ఇంత ప్రేమ నామీద నాతో మీకు ఏం బంధం ఉంది అని అంటుంది.
Karthika Deepam 23 August 2022 Full Episode
అప్పుడు పెద్దావిడ బంధాలు అవసరం లేదమ్మా.. మనసులు కలిస్తే చాలు అని అంటుంది. సరేలే గాని నీ భర్త మీద నీకు ఇంత ప్రేమ ఉంది కదా.. నీ భర్త కూడా అదే ప్రేమ ఉండాలి కదా మరి నిన్ను ఎందుకు గుర్తుపట్టలేకపోయాడు అని అంటుంది. అప్పుడు దీప అదే ఇప్పుడు తెలుసుకుంటానమ్మా అని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌర్య వాళ్ళ అమ్మ నాన్నలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ పిన్ని, బాబాయిలు నువ్వు అలా బాధపడకు తల్లి నిన్ను అలా చూస్తుంటే మా గుండెలు పగిలిపోతున్నాయి అని అంటారు. అప్పుడు సౌర్య బాబాయ్ అమ్మ నాన్నలు బ్రతికే ఉన్నారు. ఎందుకంటే అమ్మానాన్నలు చనిపోతే వాళ్ళ బాడీలు హాస్పిటల్ లో ఉండాలి కదా ఎన్ని హాస్పటల్ తిరిగినా అమ్మానాన్న బాడీలు దొరకలేదు అంటే వాళ్లు కచ్చితంగా బ్రతికే ఉన్నారు. వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారు. మనం వాళ్ళని వెతుకుదాం బాబాయ్ అని చెప్తుంది.
అప్పుడు గండ సరే తల్లి నేను రేపటి నుంచి ఆటో తోలుతాను అందులో మనం అమ్మానాన్నని ఎత్తుకుదాం అని చెబుతాడు. సరే బాబాయ్ అని వెళ్ళిపోతుంది. అప్పుడు చంద్ర ఎందుకయ్యా పిల్ల అమ్మానాన్నలు మర్చిపోయాలా చేయకుండా తనకి ఇంకా అమ్మానాన్నలు బ్రతికి ఉన్నారని ఆశలు రేపుతున్నావు.. వాళ్లు ఎలా బ్రతుకుతారయ్యా అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత అని అంటుంది. అప్పుడు గండ పిల్ల ఇంట్లో ఉంటే ఊరికే అమ్మానాన్నల గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. కాబట్టి ఆటో నేర్పించమని అడుగుతుంది కదా.. అలా నేర్చుకుంటూ ఆ ధ్యాసలో పడి వాళ్ళని మర్చిపోతుంది. అలా చిన్నగా చిన్నగా తనకి వాళ్ళ అమ్మానాన్న లేరు, రారు ఇక అని తనకే అర్థమవుతుంది అని అంటాడు. కట్ చేస్తే దీప పార్కు లో కార్తీక్ కోసం వెతుకుతూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.