Home » Entertainment » Karthika Deepam 23 July 2022 Full Episode
Entertainment

Karthika Deepam 23 July Today Episode : నిరూపమ్ చేతికి తాళిబొట్టు ఇచ్చి హిమకు కట్టమన్న సౌర్య..! షాక్ లో ప్రేమ్..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 23, 2022, 10:31 am
Advertisement

Karthika Deepam 23 July Today Episode : హిమ హాస్పిటల్ కి బయలుదేరుతుండగా సౌందర్య మీ తాతకు బాగోలేదు అని చెబుతుంది.. పక్కనే ఉన్న సౌర్య ఏంటి తాతయ్య మీకు బాగోలేదా.. నానమ్మ తాతయ్యను హాస్పిటల్ కు తీసుకు వెళ్దాం పద అని అంటుంది.. ఇంట్లో డాక్టర్ ఉండదా మళ్లీ హాస్పిటల్ కి ఎందుకు అని సౌందర్య అంటుంది.. తాతయ్యకు బాగానే ఉందిగా నానమ్మ అని హిమ అంటుంది.. సరే నేను హాస్పిటల్ కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి తాతయ్యని చూసుకుంటాను అని చెబుతుంది.. దాంతో సౌందర్య ఆనంద్ రావు ఇద్దరు వేసిన ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది.. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్న హిమ దగ్గరికి వెళ్లి ఏమైంది అని ప్రేమ్ అడుగుతాడు.. నువ్వు ఎందుకో నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావు అని నాకు అనిపిస్తుంది..

Advertisement

ఆ విషయం ఏంటో చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను కదా అని ప్రేమ్ అంటాడు.. సౌర్యను నిరూపమ్ బావను ఒక్కటి చేయాలి..అందుకు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది.. హమ్మయ్య సౌర్యకు నీరూపమ్ కు పెళ్లి చేసేస్తే.. నాకు లైన్ ట్రాక్ క్లియర్ అవుతుంది.. దీని గురించి ఇంతలా ఆలోచించాలా.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే.. వాళ్ళిద్దరూ ఎప్పుడు పక్కపక్కనే ఉండాలి.. అలా మనం ప్లాన్ చేద్దామని వెంటనే నిరూపమ్ కి కాల్ చేసి తాతయ్యకు బాగోలేదు నువ్వు అర్జెంటుగా రా అని చెబుతాడు ప్రేమ్..సౌభాగ్య తో కాఫీ షాప్ లో నిరూపమ్ వెంటనే అక్కడికి వస్తాడు.. ఏమైంది తాతయ్య అని అడుగుతాడు.. బాగోలేదు అన్నలు పోయేలాగా ఉన్నాయి అని ఆనందరావు భలే సమాధానం చెబుతాడు..

karthika deepam 23 july 2022 full episode

Advertisement

సరే హిమ నువ్వు కూడా డాక్టర్ వే కదా తాతయ్యను జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటాడు నిరూపమ్.. అంతలో జ్వాలమ్మ మీ ఆటో టైర్ పంచర్ అయింది కదా.. ఇదిగో ఇంకొక టైర్ తీసుకువచ్చాను అని ఎవరో వచ్చి టైర్ ఇస్తారు.. వెంటనే జ్వాలా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది.. శౌర్య వెళ్లి మీ తాతయ్యకు బాగోలేదు కదా నువ్వు ఇంట్లోనే ఉండు అని అడ్డుపడుతుంది.. ఇక్కడ ఉండి నేనేం చేస్తాను అని జ్వాల అంటుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో నిరూపమ్ బావ నువ్వు సౌర్యను పెళ్లి చేసుకోమని హిమ అంటుంది..

అంతలో సౌర్య వస్తుంది.. నువ్వు హిమనే పెళ్లి చేసుకోమని చెబుతూ చేతిలో తాళిబొట్టు తీసుకుని వస్తుంది.. బావ నేను ముందు నుంచి చెబుతున్నాను కదా.. నాకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు అని చెబుతోంది.. హిమకు కట్టు అని సౌర్య తాళిబొట్టు ఇస్తుంది సౌర్యని తాళిబొట్టు ఇవ్వడంతో హిమకు తాళిబొట్టు కట్టి తన భార్యను చేసుకుంటాడా.. లేదా అనేది చూడాలి.. ఆనందరావు సౌందర్య ఇద్దరు ఆనందంలో ఉండగా.. ప్రేమ్ మాత్రం బాధపడతాడు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం..

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి