Karthika Deepam 23 Nov Today Episode : మోనిత బండారం బట్టబయలు చేసిన దీప.. బారసాలలోనే మోనిత పరువు తీసేసిన దీప

Karthika Deepam 23 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలయింది. ఈరోజు 23 నవంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 1204 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీప తన పుట్టింటికి వెళ్తుంది. దీంతో తన తండ్రి బాధపడతాడు. ఏమైందమ్మా.. పండక్కి అల్లుడితో కలిసి రాలేదు.. అని అంటాడు మురళికృష్ణ. తనకు కొత్త బట్టలు కూడా తీసుకొస్తుంది. కొత్త బట్టలు వేసుకున్నాక.. పదా నాన్న భోజనం చేద్దాం. ఇద్దరం కలిసి భోజనం చేసి ఎన్ని రోజులు అయిందో కదా.. అంటుంది. దీప విచిత్రంగా ప్రవర్తించడం చూసి షాక్ అవుతాడు మురళి.

karthika deepam 23 november 2021 full episode

కట్ చేస్తే.. మోనిత ఇంట్లో బారసాల ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉంటాయి. పనివాళ్లు డెకరేషన్ చేస్తుంటారు. అందరినీ త్వరత్వరగా పనులు చేయాలని చెబుతుంది మోనిత. ప్రియమణికి అన్ని పనులు అప్పగిస్తుంది. ఇంతలో భారతి వస్తుంది. ఏంటి మోనిత నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా.. కార్తీక్ స్టాఫ్ ను కూడా రమ్మన్నావట.. అంటే ఏమైంది.. పిలిస్తే వచ్చిన సమస్యేంటి అని అడుగుతుంది మోనిత. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. దీపక్కే నాకు మాటిచ్చింది. అందరినీ తీసుకొస్తా అని చెప్పింది అంటుంది మోనిత.

ఉదయమే కార్తీక్, సౌందర్య.. కారులో బయలుదేరుతారు. సౌందర్య, కార్తీక్.. ఇద్దరూ దీప గురించే ఆలోచిస్తుంటారు. ఆనంద రావు కూడా వాళ్లతో పాటు వెళ్తాడు. ఏంటిది సౌందర్య. మనం ఏం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నం.. ఇది కరెక్ట్ కాదు అని అంటాడు.. నాకు ఏం అర్థం కావడం లేదు అంటాడు ఆనంద రావు.

దీపకు అన్నీ తెలుసు. అంతా అయిపోయింది.. అంటుంది సౌందర్య. అయినా మనం మోనిత ఇంటికి వెళ్లడం ఏంటి. ఇంకోసారి ఆలోచించు సౌందర్య అంటాడు ఆనంద రావు. అవును మమ్మీ వద్దు అంటాడు కార్తీక్. వెనక్కి వెళ్లిపోదాం మమ్మీ అంటాడు. కానీ.. నువ్వు మోనిత గురించి ఆలోచిస్తున్నావు.. నేను దీప గురించి ఆలోచిస్తున్నా అంటుంది సౌందర్య.

మరోవైపు మోనిత ఇంట్లో బారసాల ఫంక్షన్ ప్రారంభం అవుతుంది. అందరూ వస్తుంటారు. కార్తీక్, దీప, సౌందర్య కోసం మోనిత ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో భారతి వస్తుంది. మా అత్త గారు ఇంకా రాలేదు అంటుంది. దీంతో భారతికి ఏం అర్థం కాదు. మోనితకు ఏంటి ఇంత ధైర్యం అని అనుకుంటుంది.

Karthika Deepam 23 Nov Today Episode : మోనిత కొడుకు బారసాలకు వచ్చిన దీప

ఇంతలో దీప.. వారణాసి ఆటోలో మోనిత ఇంటికి వస్తుంది. వారణాసి ఇక నువ్వు వెళ్లిపో అంటుంది. వద్దక్క నేను ఉంటాను అంటాడు. కానీ..వినదు. వద్దులే వెళ్లు అంటుంది. బ్యాగు పట్టుకొని మోనిత ఇంట్లోకి వెళ్తుంది దీప. క్యాటరింగ్ వాళ్లు అన్ని ఆహారాలు పంపించలేదని చెబుతుంది ప్రియమణి. దీంతో మోనితకు చిరాకు వేస్తుంది.

ఇంతలో దీప ఇంట్లోకి రావడం గమనిస్తుంది మోనిత. షాక్ అవుతుంది. భారతి కూడా షాక్ అవుతుంది. బ్యాగ్ పట్టుకొని వచ్చిన దీపను చూసి.. ఒకింత ఆందోళనకు గురవుతుంది. దీపక్క బ్యాగుతో వచ్చింది ఏంటి.. ఇటునుంచి ఇటే బస్తీకి వెళ్లేందుకు రెడీ అయిందా ఏంటి అని అనుకుంటుంది. దీపక్కరా.. వెల్ కమ్.. స్వాగతం అంటుంది మోనిత.

పర్లేదు మోనిత.. గొప్పగానే చేస్తున్నావు అంటుంది. ఏదో నీ ఆశీర్వాదం అంటే. నా ఆశీర్వాదాలు ఎప్పుడూ నీకు ఉంటాయి మోనితమ్మ అంటుంది. హలో డాక్టరమ్మ బాగున్నారా? మా మోనితకు ఆపరేషన్ చేసింది మీరే కదా.. థ్యాంక్యూ అంటుంది. ప్రియమణి బాగున్నావా? మోనితను బాగా చూసుకో అంటుంది.

కట్ చేస్తే.. కార్తీక్, సౌందర్య, ఆనందరావు ఫంక్షన్ కు వస్తారు. అక్కడికి వచ్చాక.. కార్తీక్ వల్లనే నేను తల్లిని అయ్యాను. ఓరోజు బాగా తాగొచ్చి అంటూ ఏదో చెప్పబోతుంది మోనిత. దీంతో నోర్మూయ్ అని అంటుంది దీప. చెంప పగులగొడతాను అంటుంది. ఇప్పుడే.. ఇక్కడే ఏది నిజమో ఏది అబద్ధమో నిరూపిస్తాను అంటుంది దీప.

ప్రియమణి బ్యాగు తీసుకురా అంటుంది దీప. అందులో నుంచి కొన్ని4 పేపర్లను తీసి మోనితకు చూపిస్తుంది. ఇదేంటో తెలుసా అని చెబుతుంటే… కార్తీక్, సౌందర్య అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

55 minutes ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

3 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

3 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

6 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

7 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

10 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

11 hours ago