Karthika Deepam 23 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ 23 సెప్టెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1152 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జైలులో కూర్చొని కార్తీక్ గురించే ఆలోచిస్తుంటుంది మోనిత. అందరూ కలిసి కార్తీక్ మనసు మారిస్తే ఎలా? అని అనుకుంటుంది. వాళ్లకు 18 నెలల టైమ్ దొరుకుతుంది కాబట్టి కార్తీక్ ను ఈలోపు మార్చేయొచ్చు అని అనుకుంటున్నారేమో.. నేను అలా జరగనీయను కదా. కార్తీక్, దీపను అస్సలు కలవనిచ్చేదే లేదు. మోనిత ఇక్కడ.. మోనిత అంటూ జైలులో కూర్చొని ప్లాన్లు వేస్తుంది మోనిత.
జైలుకు వెళ్లి నాకు ఇంతే ప్రాప్తం అని కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటుంది ఈ మోనిత అనుకుంటున్నావా? మనం ఏడ్పించే టైప్ కానీ.. ఏడ్చే టైప్ కాదమ్మా.. తుపాను సృష్టిస్తాను. ఇక్కడ కూర్చొని.. అక్కడ నీకు చుక్కలు చూపిస్తాను దీప. ప్రామీస్. నీ మీద ఒట్టు దీపక్క.. అని అంటుంది మోనిత.
కట్ చేస్తే.. కార్తీక్.. హిమ, శౌర్యతో కలిసి దాగుడు మూతలు ఆడుతుంటాడు. పిల్లలతో కలిసి కార్తీక్ సరదాగా ఆడుకోవడం చూసిన సౌందర్య, ఆనందరావు తెగ ముచ్చటపడతారు. సంతోషంతో ఉంటారు. చాలారోజులకు ఈ ఇంట్లో ఆనందాల కేరింతలు వినిపిస్తున్నాయి కదా సౌందర్య అంటాడు ఆనంద రావు. అవునండి.. ఈ కేరింతలు గుడిగంటలలా వినిపిస్తున్నాయి. ఎంతటి వారయినా.. కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే. నా పుత్రరత్నం నిర్దోషిగా బయటపడ్డాడు.
ఈ ఆనందాలు, సంతోషాలు ఇలాగే కొనసాగాలని తదాస్తు దేవతలు దీవించాలి. రోజూ మార్నింగ్ వాకింగ్ కు వెళ్తుంటే ఇలా అందరి ఆటపాటలు చూస్తుంటే ఎంత బాగుంటుందో కదా సౌందర్య అంటాడు ఆనంద రావు. అవునండి.. అంటుంది సౌందర్య. కుటుంబం గొప్పదనం అంతా కలిసిమెలిసి ఉండటంలోనే ఉంటుంది కదా సౌందర్య.. అని అనగానే అప్పటికే అంతా అయిపోలేదు.. అని మనసులో అనుకుంటుంది సౌందర్య.
ఇంతలో దీప.. కాఫీ తీసుకొని అక్కడికి వస్తుంది. అందరూ కలిసి హాయిగా, సంతోషంగా నవ్వుతూ ఉంటారు. ఇంతలో కార్తీక్.. హిమను పట్టుకుంటాడు. నేనే గెలిచాను.. అంటాడు. గెలిచింది మీరు కాదు డాక్టర్ బాబు. నన్ను గెలిపించారు.. అంటుంది.. దీప.
ఇంతలో ఆదిత్య, శ్రావ్య కూడా అక్కడికి వస్తారు. వాళ్లు కూడా వీళ్లను చూసి సంతోషపడతారు. ఇంతలో దీప.. కార్తీక్ దగ్గరికి వస్తుంది. దీప నువ్వు వచ్చావు కదా.. అని అంటాడు. కాఫీ వాసనను చూసి గుర్తు పట్టాను అంటాడు. 11 ఏళ్లు అన్నయ్య ఈ ఆటాపాటలకు దూరం అయ్యాడు.. అని ఆదిత్య అంటాడు.
రేయ్.. వీళ్ల స్కూల్స్ తెరిచారట. వెళ్లి ఆ ఫార్మాలిటీస్, ఫీజు గురించి చూసుకో.. అంటుంది సౌందర్య. సరే.. అమ్మ.. అంటాడు కార్తీక్. ఇంతకీ మీ క్లాస్, సెక్షన్ ఏంటో తెలుసా? అని ఫన్నీగా అడుగుతాడు కార్తీక్.
పిల్లలను స్కూల్ కు తీసుకెళ్తాను అని కార్తీక్ చెప్పగానే.. నేను కూడా వస్తాను కార్తీక్.. దారిలో నాకు కాస్త పని ఉంది అంటుంది దీప. దీంతో సరే మమ్మీ అంటాడు కార్తీక్.
ఇంతలో దీప రెడీ అవుతుంటుంది. పదా.. లేట్ అవుతుంది అనగానే.. రాత్రి అమెరికా వెళ్లిపోదాం అన్నారు.. ఇప్పుడేమో పిల్లలను స్కూల్ లో చేర్పిస్తున్నారు.. మనసు మార్చుకున్నారా? అని తనలో తాను అనుకుంటుంది దీప. దేవుడా.. కార్తీక్ అమెరికా వెళ్లే ప్లాన్ ను క్యాన్సిల్ చేసుకునేలా చేయి.. అని వేడుకుంటుంది.
కట్ చేస్తే.. మోనిత సీరియస్ గా జైలులో దేని గురించో ఆలోచిస్తుంటుంది. అటూ ఇటూ తిరుగుతుంది. ఏం చేయాలి.. దీప నా కార్తీక్ మనసు మార్చకముందే ఏదో ఒకటి చేయాలి. దీప.. నీకు టైమ్ ఇస్తే డాక్టర్ బాబు.. డాక్టర్ బాబు అంటూ నా కార్తీక్ ను నీ వైపు తిప్పుకుంటావు. పాపం.. నా కార్తీక్ అమాయకుడు. తెల్లని వన్నీ పాలు.. పుల్లనివన్నీ చింతకాయలు, మామిడికాయలు అనుకుంటాడు. జైలు శిక్ష పడిందని చేసిన తప్పులకు సాడ్ గా, బాదగా కూర్చుంటుంది అనుకున్నావా దీపక్క. నో సాడ్.. నో బ్యాడ్.. కార్తీక్ తో ప్రేమ ఒక్కటే నా లోకం. మరి.. నా కార్తీక్ ను నాకు కాకుండా చేస్తే ఊరుకుంటానా.. చీమ చీమ.. నన్ను ఎందుకు కుట్టావు అంటే నా చీమల పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు.. దీప దీప.. నా కార్తీక్ మనసు మార్చితే నేను ఊరుకుంటానా.. నేను కూడా కుడతాను.. స్వీట్ గా దెబ్బకొడతాను.. అని మోనిత అనుకుంటుండగానే.. ఇంతలో ఓ కానిస్టేబుల్ వస్తుంది.
మేడమ్ మేడమ్.. అంటుంది. ఏమైంది అనగానే కడుపు నొప్పి వచ్చింది మేడమ్. మా సుకన్యకు కడుపు నొప్పి వచ్చింది మేడమ్.. ప్లీజ్ అంటుంది. ఒకసారి వచ్చి చూడండి మేడమ్ అంటుంది.
కట్ చేస్తే.. కారులో కార్తీక్, దీప, పిల్లలు అందరూ కలిసి కారులో వెళ్తుంటారు. అందరూ పిచ్చాపాటీగా మాట్లాడుకుంటారు. నాన్నా ఎప్పుడూ నువ్వే డ్రైవ్ చేస్తుంటావా? అమ్మకు నేర్పించవా? అంటారు పిల్లలు. వద్దు.. నాకు గరిటె తిప్పడమే మేలు.. అని అనుకుంటుంది.
అమ్మకు ఎప్పుడూ డ్రైవింగ్ నేర్పించలేదా.. అని పిల్లలు అడిగితే.. నేర్పించాను. ఒకసారి చిక్కమగళూర్ వెళ్లినప్పుడు అక్కడ ఒకరి కాలు విరగ్గొట్టింది.. అని అంటాడు కార్తీక్. దీంతో విహారి గురించి గుర్తు తెచ్చుకుంటుంది దీప.
నాన్నా అప్పుడు కాలే విరిగిందా.. లేక ముక్కూ మూతి ఇంకా ఏమైనా డ్యామేజ్ అయ్యాయా.. అంటే ఏం కాలేదమ్మా.. ఒక్క కాలు మాత్రమే విరిగింది. లక్కీ ఫెలో.. అది తలుచుకుంటే ఇప్పటికీ ఫన్నీగా అనిపిస్తుంది.. అనగానే డాడీ అప్పుడు అమ్మ మీద అరిచారా అంటే ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాను.. అంటాడు కార్తీక్.
లైట్ తీసుకున్నా.. అని ఎంత సింపుల్ గా చెప్పారు డాక్టర్ బాబు. ఇదే విషయాన్ని 11 ఏళ్ల ముందు చెప్పి ఉంటే మనం అసలు దూరం అయ్యే వాళ్లం కాదు కదా… అని తనలో తాను అనుకుంటుంది దీప.
స్కూల్ కు రాగానే.. పిల్లలు ఓకే నాన్నా బై అని చెప్పి పిల్లలు స్కూల్ లోపలికి వెళ్లిపోతారు. నాన్నా ఒక గంట ఆగి రండి.. లేట్ చేయొద్దు అని చెబుతారు. సరే అని చెప్పి వెళ్తారు. మిక్సీ కొనడానికని చెప్పి కార్తీక్ కార్డు తీసుకొని వెళ్తుంది దీప.
మీ నాన్నను జైలులో పెట్టారంట కదా. ఏదో మర్డర్ కేసు అని అంటున్నారు. మీ నాన్నకు ఆ మోనితకు ఏదో ఉందట. మీనాన్న ఆ మోనిత ఆంటీని చీట్ చేశారంట. తప్పంతా మీ నాన్నదేనంట. మీ డాడీ బ్యాడ్ బాయ్ అంట.. అని స్కూల్ లోని పిల్లలు.. శౌర్య, హిమతో అంటారు. దీంతో వాళ్లు చాలా బాధపడతారు.
కట్ చేస్తే ఆసుపత్రికి వెళ్తాడు కార్తీక్. డాక్టర్ భారతితో మాట్లాడుతాడు. నా జీవితంలో ఒక చిరిగిపోయిన పేజీ ఆ మోనిత అంటాడు కార్తీక్. మోనిత నీ జీవిత భాగస్వామి కాకపోవచ్చు కానీ.. తను నీ జీవితంలో ఒక భాగం అయిపోయింది. మోనిత బిడ్డకు నువ్వే తండ్రివి కదా కార్తీక్.. అని డాక్టర్ భారతి కార్తీక్ తో అంటుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.