Home » Entertainment » Karthika Deepam 24 August 2022 Full Episode
Entertainment

Karthika Deepam 24 Aug Today Episode : డ్రామాలాడుతున్న మోనిత.. దీప మోనిత డ్రామాలను పసిగట్టగలదా..

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: August 24, 2022, 10:30 am
Advertisement

Karthika Deepam 24 Aug Today Episode : కార్తీకదీపం సీరియల్. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1439 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప కార్తీక్ కోసం పార్కులో అందరికీ ఫోటోను చూపిస్తూ వెతుకుతూ ఉంటుంది. అదే పార్కులో ఇంకొకపక్క మౌనిత కూడా కార్తీక ఫోటోను చూపిస్తూ వెతుకుతూ దీప దగ్గరికి వచ్చి తెలియకుండా తనకి ఫోటో చూపించి ఇతను కనిపించాడా అని అడుగుతుంది. అప్పుడు దీప ఆశ్చర్యంగా చూస్తూ తనతో గొడవపడి నా డాక్టర్ బాబు ని ఎక్కడ దాచావు అని తనపై దాడి చేస్తుంది. అప్పుడు మౌనిత ఏమి తెలియని దానిలాగా ఏడుస్తూ డ్రామాలాడుతూ ఉంటుంది. అప్పుడు దీప ఆపవే నీ డ్రామాలు నీవు తప్ప డాక్టర్ బాబుని ఎవరు తీసుకెళ్లరు అని తనపై దాడి చేస్తుంది. అయినా సరే మౌనిత ఇంకాస్త డోసు పెంచి ఏడుస్తూ డ్రామాలు ఆడుతూ ఉంటుంది. కట్ చేస్తే హిమ వాళ్ళ అమ్మానాన్న ఫోటోలను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది.

Advertisement

అంతలో సౌందర్య అక్కడికి వచ్చి ఎన్ని రోజులు ఏడుస్తావు హిమా.. ఇక వాళ్లు తిరిగి రారు నువ్వు ఏడవడం ఆపాలి. ఆలోచించటం ఆపాలి అని అంటుంది. అప్పుడు అమ్మానాన్నలు తిరిగిరారు కానీ నాయనమ్మ శౌర్య తిరిగి వస్తుంది కదా.. తనని ఎప్పుడు తీసుకొస్తావు అని అడుగుతుంది. అప్పుడు సౌందర్య శౌర్య ఎంత మొండిదో నాకు మాత్రమే తెలుసు అది మనం ఎంత చెప్పినా మన దగ్గరికి రాదు.. దాని కోపం తగ్గాకే వస్తుంది అని అంటుంది. అప్పుడు ఆనందరావు నువ్వు ఆలోచించటం ఆపావా.. నేను బాధపడడం ఆపాన మరి తనకు ఎలా చెప్తున్నావ్… అని సౌందర్యను అంటూ.. హీమని బాధపడకు తల్లి నేను తీసుకెళ్తాను అని చెప్తాడు. కట్ చేస్తే శివ కార్తీక్ కలిసి బయటికి వచ్చి.. కార్తీక్ శివ తో మీ మేడం అసలు నా భార్య కాదని ఎక్కడో డౌట్ కొడుతుంది అని అంటారు.

Karthika Deepam 24 August 2022 Full Episode

Advertisement

అప్పుడు శివ అదేంటి సార్ మా పేర్లు మర్చిపోయినట్టు మీ భార్యని కూడా మర్చిపోతారా అని అంటాడు. అప్పుడు కార్తీక్ మరేంటయ్యా లేకపోతే నన్ను నిలుచోనివ్వదు, కూర్చొనివ్వదు బయటికి వద్దంటుంది. అక్కడికి పోకు ఇక్కడ పోకు అని టార్చర్ పెడుతుంది. అని అంటుండగా మళ్లీ ఫోన్ చేసి కార్తీక్ ని తీసుకొని రమ్మని చెప్తుంది. సరే అని కార్తీక్ ని తీసుకొని శివ మళ్ళీ వెళ్ళిపోతారు. కట్ చేస్తే సౌందర్య సౌర్య కోసం ఏడుస్తూ కార్తీక్ ఫోటోని చూస్తూ నీ బిడ్డలని నేను సరిగా చూసుకోలేకపోతున్నాను.. మీకు శాంతి చేకూర్చలేకపోతున్నాను. అది ఈసారైనా వస్తానంటదో ఏమంటుందో ఏంటో అని ఏడుస్తూ అసలు అది అక్కడ ఉందో ఏటైనా వెళ్ళిపోయిందో నీ బిడ్డ ఎందుకురా ఇంత మొండిగా ప్రవర్తిస్తుంది. అంటూ ఉంటుంది. తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి