Karthika Deepam 24 May Today Episode : నిరుపమ్, శోభ పెళ్లిని జ్వాల అడ్డుకుంటుందా? హిమ ప్లాన్ ఏంటి? జ్వాలే.. శౌర్య అనే నిజం సౌందర్యకు చెబుతుందా?

Advertisement
Advertisement

Karthika Deepam 24 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 1360 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వప్న అత్తకు, శోభకు ఏంటి సంబంధం అని అనుకుంటుంది హిమ. నిరుపమ్ ఎక్కడ అని అడుగుతుంది స్వప్న. దీంతో నిరుపమ్ బావ శౌర్యతో కలిసి బయటికి వెళ్లాడు అని చెబితే స్వప్న అత్త అరుస్తుందేమో అని అనుకుంటుంది కానీ.. మళ్లీ ఎందుకో నిజం చెబుదామని అనుకుంటుంది. బావ బయటికి వెళ్లాడు అంటుంది హిమ. ఆటోలో వెళ్లాడు అంటుంది. దీంతో స్వప్న షాక్ అవుతుంది. జ్వాల ఆటోలో వెళ్లాడు అంటుంది హిమ. జ్వాలతో కలిసి వెళ్లాడు అంటుంది. దీంతో శోభ.. తనను కొట్టింది జ్వాలానే కదా అని గుర్తుకు తెచ్చుకుంటుంది. వెంటనే స్వప్న.. నిరుపమ్ కు ఫోన్ చేస్తుంది. అదే సమయంలో నిరుపమ్ ఆటో తోలుతూ ఉంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయడు.

Advertisement

karthika deepam 24 may 2022 today episode

దీంతో మళ్లీ చేస్తుంది స్వప్న. మరోవైపు జ్వాల.. నిరుపమ్ ను ఓ చోటుకు తీసుకొని వస్తుంది. మనం ఎక్కడికి వచ్చాం అని అడుగుతాడు. దీంతో మనసు ప్రశాంతంగా ఉండే చోటుకు తీసుకెళ్లమన్నారు కదా. అందుకే ఇక్కడికి తీసుకొచ్చా అంటుంది జ్వాల. వాళ్లందరినీ చూశారా డాక్టర్ సాబ్ అంటుంది. వాళ్లందరూ ఎవరికి ఎవరు కాదు. చుట్టాలూ కాదు. వాళ్లంతా అనాథలు అంటుంది జ్వాల. వీళ్లంతా అనాథలా అంటాడు నిరుపమ్. దీంతో అవును.. అనాథ అనే బంధమే వాళ్లను ఒకచోటుకు చేర్చింది. వీళ్లంతా ఇప్పుడు పెద్ద కుటుంబం.. అంటుంది. ఇంతలో అందులో ఉన్న జాంపండు.. జ్వాల ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఆ పిల్లాడికి జాంపండు అనే పేరు పెట్టింది. ఇది అనాథ ఆశ్రమం అయితే ఒక్క బోర్డు కూడా లేదు ఏంటి అని అడుగుతాడు నిరుపమ్. ఇక్కడ ఆ బోర్డు ఉండదు. ఎందుకంటే.. ఆ బోర్డు చూసినప్పుడల్లా తాము అనాథలమని వాళ్లకు ప్రతిక్షణం గుర్తొస్తుంది. అందుకే బోర్డు పెట్టలేదు అంటుంది జ్వాల.

Advertisement

చూడండి డాక్టర్ సాబ్.. వాళ్లంతా ఎంత ఆనందంగా ఉన్నారో.. వాళ్లకు ఎవ్వరూ లేరు. ఆశలు లేవు.. పెద్ద పెద్ద కోరికలు లేవు. అందుకే మొహాల్లో అంత తేజస్సు కనిపిస్తోంది అంటుంది జ్వాల. కొందరికి అన్నీ ఉంటాయి.. కానీ ఒక్కరి మొహం మీద చిరునవ్వు కనిపించదు.. అంటుంది జ్వాల.

మన జీవితంలో సగభాగం నిద్రకు పోతే.. మిగిలిన సగం కూడా అయ్యోలకే పోతాయి కొందరికి అంటుంది జ్వాల. హ్యాపీగా ఉండాలి కదా డాక్టర్ సాబ్. బిందాస్ గా ఉండాలి. పులి ఎదురొచ్చినా హలో టైగర్ సాబ్ అనాలి అంటుంది జ్వాల. జ్వాల మాటలకు చాలా రిలాక్స్ అవుతాడు నిరుపమ్.

జ్వాల.. నువ్వు నిజంగా గ్రేట్ అని చెప్పి తన చేతులను పట్టుకుంటాడు నిరుపమ్. నీకు తెలియకుండానే గొప్ప గొప్ప మాటలు చెప్పావు అంటాడు నిరుపమ్. నువ్వు మాకోసం.. మా ఫ్యామిలీ కోసమే పుట్టావేమో అనిపిస్తోంద జ్వాల అంటాడు నిరుపమ్.

ఇప్పుడు నా మనసులోని టెన్షన్ ను తీసేశావు.. థాంక్యూ రౌడీ బేబీ అంటాడు నిరుపమ్. దీంతో జ్వాల ఖుషీ అవుతుంది. అవును.. డాక్టర్ సాబ్.. టెన్షన్ ఫ్రీ అంటే నాకు గుర్తొచ్చింది. ఏమైంది.. మీరు ఈ మధ్య పరేషాన్ గా కనిపిస్తున్నారు అని అడుగుతుంది.

దీంతో ఏం లేదు జ్వాల. ఏవేవో ఉంటూనే ఉంటాయి కదా అంతే అంటాడు నిరుపమ్. ఏదైనా పెద్ద ప్రాబ్లమా అని అడుగుతుంది. దీంతో నాకు చెప్పండి.. నేను ఏమైనా చేయగలుగుతానో చేస్తా అంటుంది. దీంతో అవసరం అయినప్పుడు చెప్తా అంటాడు నిరుపమ్.

Karthika Deepam 24 May Today Episode : అనాథాశ్రమానికి వచ్చి జ్వాలకు షాకిచ్చిన శోభ

ఇంతలో ముసలావిడ చాయ్ తీసుకొచ్చి ఇస్తుంది. శాంతాబాయి.. ఇక్కడ పనులన్నీ చేస్తుంది అని నిరుపమ్ చెబుతాడు. మీ ఆశ్రమాన్ని ఎవరు మెయిన్ టెన్ చేస్తున్నారు అని అడుగుతాడు నిరుపమ్. లోపల సూపర్ వైజర్ ఉంటాడు అని చెబుతుంది శాంతాబాయి.

ఇంతలో నిరుపమ్ కు మళ్లీ ఫోన్ వస్తుంది. దీంతో మళ్లీ ఫోన్ కట్ చేస్తాడు. నేను ఒకసారి లోపలికి వెళ్లి వస్తాను అంటాడు. అవును.. ఈ ఆశ్రమానికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతాడు. దీంతో చాలా ఉందిలే డాక్టర్ సాబ్.. మీరు వెళ్లి రండి అంటుంది జ్వాల.

కొన్నాళ్లు.. ఈ అనాథ ఆశ్రమంలో ఉన్నదాన్నే కదా. ఇప్పుడు ఆ విషయం డాక్టర్ సాబ్ కు చెబితే.. నా జీవిత కథ మొత్తం చెప్పాల్సి వస్తుంది అని అనుకుంటుంది జ్వాల. మరోవైపు ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. నిరుపమ్ లిఫ్ట్ చేయడు. కట్ చేస్తూ ఉంటాడు.

దీంతో చిరాకు వచ్చి వెళ్దాం పదా శోభ అంటుంది స్వప్న. తర్వాత శోభను చూపించి.. ఏంటి అలా చూస్తున్నావు.. డాక్టర్ శోభాదేవి.. నాకు కాబోయే పెద్ద కోడలు అని అంటుంది స్వప్న. దీంతో హిమ షాక్ అవుతుంది. ఎలా ఉంది నా సెలెక్షన్ అంటుంది స్వప్న. డాక్టర్ నిరుపమ్ వెడ్స్ డాక్టర్ శోభాదేవి.. అనే శుభలేఖలు త్వరలోనే చూస్తావు అని చెబుతుంది స్వప్న.

దేవుడా.. ఏంటిది.. శౌర్య నిరుపమ్ బావలను కలపాలని నేను అనుకుంటే.. అత్తయ్య ఏంటి.. ఎవరినో తీసుకొచ్చి పెద్ద కోడలు అంటుంది. నేను చాలా జాగ్రత్తగా నిరుపమ్ బావ మనసు మార్చాలని చూస్తుంటే.. స్వప్న అత్త అడ్డు వస్తోంది. ఎలాగైనా.. నిరుపమ్ బావ, శౌర్యను కలిపేలా చూడు దేవుడా అని అనుకుంటుంది హిమ.

కట్ చేస్తే.. ఆశ్రమానికి శోభ వస్తుంది. అక్కడ శోభను చూసి షాక్ అవుతుంది జ్వాల. నీ అంచనాలకు నేను అస్సలు అందను అంటుంది శోభ. దీంతో నా చేతికే అందావు.. అంచనాలకు అందకపోవడం ఏంటి అని అంటుంది జ్వాల. ఇంతలో నిరుపమ్ బయటికి వస్తాడు. శోభను చూసి కౌగిలించుకుంటాడు.

తను డాక్టరా.. వీళ్లిద్దరికి ఇంత పరిచయం ఏంటి అని అనుకుంటుంది జ్వాల. డాక్టర్ సాబ్ ఫ్రెండ్ అని తెలియక కొట్టాను.. తనేమైనా తలనొప్పి తెస్తుందా అని అనుకుంటుంది. ఏంటి.. శోభ ఏమైపోయావు.. ఇన్ని రోజులు అని అడుగుతాడు నిరుపమ్.

తర్వాత జ్వాలకు శోభను పరిచయం చేస్తాడు. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసా అని జ్వాలతో చెబుతాడు. నీకు చెబితే నమ్మవు. మా ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. అన్నీ ఓపెన్ గా మాట్లాడేసుకుంటాం అంటాడు. మరోవైపు నీకొక గుడ్ న్యూస్ అంటుంది శోభ.

నేను ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేశాను అని చెబుతుంది శోభ. తర్వాత జ్వాల.. ఆటో నడుపుతుంది అని చెబుతాడు నిరుపమ్. అవును.. నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది అని అడుగుతాడు నిరుపమ్. దీంతో స్వప్న ఆంటితో కలిసి వచ్చాను అంటుంది శోభ. తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Screen Time Guidelines: అతిగా ఫోన్‌ చూస్తున్నారా?..మీ ఒంట్లో వచ్చే సమస్యలు ఇవే..?

Screen Time Guidelines: నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ లేకుండా జీవితం ఊహించలేనిది. పని అయినా చదువు…

2 minutes ago

Heart Attack : పెరుగుతున్న గుండెపోటు.. 48 గంటల ముందు శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..!

Heart attack : ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వయస్సు, లింగం అనే తేడా లేకుండా…

1 hour ago

Zodiac Signs : 28 జనవరి 2026 బుధవారం నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు పసుపు కొమ్ములను నీటిలో వదలండి

Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 28 జనవరి 2026, బుధవారం ఏ రాశి…

2 hours ago

India EU Free Trade Agreement 2026 : భారత్-ఈయూ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం: భారీగా తగ్గనున్న కార్లు, మద్యం ధరలు

India EU Free Trade Agreement 2026 | దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్, యూరోపియన్…

11 hours ago

Union Budget 2026 : అన్నదాతల ఆశలకు కేంద్రం గుడ్ న్యూస్.. 7 సంచలన నిర్ణయాలు..?

Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…

12 hours ago

Redmi Note 15 Pro 5G : రెడ్మీ నోట్ 15 ప్రో 5జీ.. 29న గ్రాండ్ ఎంట్రీ.. 200 MP కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్స్..

Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్‌ఫోన్ Smart Phone మార్కెట్‌లో మరో హాట్ అప్‌డేట్‌కు…

13 hours ago

Pakistan : టీ20 వరల్డ్ కప్‌పై సస్పెన్స్.. భారత్-పాక్ మ్యాచ్ ఉందా?.. లేదా ?

pakistan : టీ20 వరల్డ్ కప్  india vs pakistan t20 world cup 2026  ప్రారంభానికి ఇంకా రెండు…

14 hours ago

Telangana: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి వివరాలు ఇవే..!

Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…

15 hours ago