karthika deepam 25 january 2022 full episode
Karthika Deepam 25 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 జనవరి 2022, మంగళవారం 1258 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రుద్రాణికి వడ్డీ పైసలు కట్టి బాబును తీసుకొని వస్తుంది దీప. ఇంతలో పిల్లలు బాబును కాసేపు ఎత్తుకొని జోలపాడుతారు. ఇంతలో మహాలక్ష్మి వచ్చి మనం అనుకున్నదే జరిగింది దీప. ఆ రుద్రాణి మంచిది కాదు అని ముందే చెప్పాను కదా అంటుంది మహాలక్ష్మి. నేను బాగా అలసిపోయాను. కాసేపు రెస్ట్ తీసుకుంటాను.. బాబును తీసుకెళ్లు అని చెబుతుంది మహాలక్ష్మికి. ఏ సంబంధం లేని ఆనంద్ దూరం అయితేనే నాకు ఎంతో బాధకలుగుతోంది. మరి.. కన్నకొడుకు, మనవరాళ్లు దూరం అయితే ఇక వాళ్లు ఎంత బాధపడుతున్నారో అని సౌందర్య, ఆనందరావును తలుచుకొని బాధపడుతుంది.
karthika deepam 25 january 2022 full episode
మరోవైపు 6000 తీసుకొని కార్తీక్.. రుద్రాణి ఇంటికి బయలుదేరుతాడు. ఒకవేళ ఆ హోటల్ లో పనిచేసే వంట మనిషి దీపేనా అని అనుకుంటాడు కార్తీక్. నిజంగా దీపే ఆ వంటమనిషా. దీప, నేను ఇద్దరం ఒకే హోటల్ లో పని చేస్తున్నామా? నేను రుద్రాణి ఇంటికి కాదు.. ఇంటికి వెళ్లాలి. అడ్వాన్స్ తీసుకున్నది దీపే అయితే.. ఇంట్లో ఆనంద్ ఉండాలి. వంట మనిషి దీప కాకూడదు. ఇంట్లో ఆనంద్ ఉండకూడదు అని అనుకుంటాడు కార్తీక్. మరోవైపు ఆనంద్ కు స్నానం చేపించి కొత్త డ్రెస్ వేస్తుంది దీప. అమ్మా.. తమ్ముడిని చూసిన ప్రతిసారి కొత్తగా కనిపిస్తాడు కదా అమ్మా.. అంటుంది శౌర్య. ఇంతలో కార్తీక్ ఇంటికి వస్తాడు. లోపలికి వెళ్తాడు. లోపల ఆనంద్ ను చూస్తాడు కార్తీక్. షాక్ అవుతాడు.
దీప.. బాబుకు డబ్బులు ఇచ్చి విడిపించుకొచ్చిందా? అంటే దీప అదే హోటల్ లో పనిచేస్తుందా? దేవుడా అని అనుకొని లోపలకి వెళ్తాడు కార్తీక్. నాన్న వచ్చారు చూడు అని దీప అంటుంది. ఆనంద్ ను ఎత్తుకుంటాడు కార్తీక్. ఏరా నాన్నా.. అమ్మ తీసుకొచ్చిందా నిన్ను సారీరా అని అనుకుంటాడు కార్తీక్.
ఇంతలో ఆనంద్ ను తీసుకొని పిల్లలు బయటికి వెళ్తారు. కార్తీక్ ఆ వంట మనిషి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి.. ఏం టెన్షన్ పడుతున్నారు. ఆనంద్ ను తీసుకొచ్చాను కదా టెన్షన్ పడకండి అంటుంది దీప. దీంతో దీప పక్కన కూర్చొని రుద్రాణికి డబ్బులు ఎలా ఇచ్చావు దీప అని అడుగుతాడు కార్తీక్.
దీంతో ఇంట్లో కొన్ని డబ్బులు ఉండగా.. మరికొన్ని చేబదులు చేసి ఇచ్చాను అంటుంది. ఇంతలో తన దగ్గర ఉన్న ఆరువేలు దీపకు ఇస్తాడు. ఇంత డబ్బు ఎక్కడిది అంటే.. ఆనంద్ ను విడిపించడానికి అడ్వాన్స్ అడిగి తీసుకున్నాను అంటాడు కార్తీక్.
మరోవైపు విన్ని అన్నం తింటూ ఉంటుంది. ఇంతలో మోనిత వస్తుంది. సారీ మేడమ్ నాకు ఆకలై ముందే తినేస్తున్నాను అంటుంది విన్ని. పర్లేదు విన్ని. నేనే లేట్ అవుతుంది అని చెప్పాను కదా అంటుంది మోనిత. అన్నం తింటూ కార్తీక్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది మోనిత.
నాకు నా బాబే గుర్తొస్తున్నాడు అంటుంది మోనిత. పిచ్చి ఎక్కిపోతుంది అంటుంది మోనిత. మరోవైపు కార్తీక్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు. తనకు ఏం చేయాలో అర్థం కాదు. నేను అందరినీ కష్టపెడుతున్నాను. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అనుకుంటాడు కార్తీక్.
మరోవైపు రుద్రాణి మనుషులు.. కారులో వెళ్తుంటారు. ఇంతలో నడుచుకుంటూ వస్తున్న కార్తీక్ ను పిల్లిగడ్డం చూస్తాడు. నీకు ఏం కనిపిస్తోంది అంటాడు. దీంతో ఎవరో వస్తున్నారు అంటాడు. నీకు వాడే కనిపిస్తున్నాడు. నాకు ముందు ఉన్న మురికి గుంట కూడా కనిపిస్తోంది అంటాడు.
మరింకేం మురికి గుంట నుంచి పోనియ్. నీళ్లు మొత్తం వాడి మీద పడేద్దాం అంటాడు. ఇది గమనించిన కార్తీక్.. రాయి తీస్తాడు. దీంతో కారును ఆపి.. అరేయ్ జాగ్రత్తగా పోనియ్ అంటాడు. అరేయ్ చూసి నడపరా సారు మీద నీళ్లు పడతాయి అంటాడు పిల్లి గడ్డం.
మరోవైపు పిల్లల మీద అరుస్తుంది దీప. మీకు ఎప్పుడూ ఏదో ఒకటి అనడం తప్ప వేరే పని ఉండదా. తమ్ముడు నిద్రలేచినట్టున్నాడు. వెళ్లండి.. వెళ్లి తమ్ముడిని ఆడించండి అంటుంది దీప. కట్ చేస్తే హోటల్ కు వెళ్తుంది దీప. ఇంతలో హోటల్ లో టేబుల్స్ క్లీన్ చేస్తుంటాడు కార్తీక్.
టేబుల్స్ క్లీన్ చేస్తున్న కార్తీక్ ను చూసి షాక్ అవుతుంది దీప. ఏమండి.. ఏం చేస్తున్నారు అంటుంది. దీంతో కార్తీక్.. దీపను చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Operation Sindoor IPL : పహల్గాంలో 26 మంది మృతికి కారణమైన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటూ, ముష్కరులను మట్టుబెట్టడమే లక్ష్యంగా…
PM Modi : పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతి ఒక్క భారతీయుడి రక్తం మరిగింది. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని…
allu arjun plays dual role in atlee film Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
Good News : ఉపాధి హామీ కూలీలు ఉదయం లేచి ఎండ అనక, వానక అనక కష్టపడుతుంటారు. వారికి ఏ…
Samantha : ఎన్నో సంవత్సరాలుగా హీరోయిన్గా కొనసాగుతూ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా…
Renu Desai doesn't like it at all Renu Desai : తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితమైన నటి…
Pakistani Terror Camps : భారత సైన్యం పాక్ ఉగ్రవాదానికి గట్టి షాక్ ఇచ్చింది. పాక్ లోని మొత్తం 9…
Donald Trump : పహల్గాం ఉగ్రదాడి operation sindoor కి ప్రతీకారంగా భారత India సైన్యం బుధవారం అర్థరాత్రి 1.44…
This website uses cookies.