Karthika Deepam 25 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 మే 2022, బుధవారం ఎపిసోడ్ 1361 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ ఇంకా హిమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సౌందర్య, ఆనంద రావు వస్తారు. ఏమైందిరా నీకు.. ఈ మధ్య అదోలా ఉంటున్నావు అంటుంది సౌందర్య. ఏం లేదు అంటాడు. నేను బయటికి వెళ్తా.. పని ఉంది అంటాడు ప్రేమ్. అసలు ఏం జరిగింది అంటే.. ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. మీ నాన్న ఏడి అని అడుగుతాడు ఆనంద రావు. ఇంతలో సత్యం వస్తాడు. ప్రేమ్ వాలకం చూస్తుంటే.. నిరుపమ్ కంటే ముందే మీకు కోడలును తెచ్చేలా ఉన్నాడు. అవును.. అవును.. ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకునే వాడిలాగానే కనిపిస్తున్నాడు అంటుంది సౌందర్య.
మరోవైపు పెళ్లి అంటేనే నాకు బాధగా ఉంది. నిరుపమ్ గుర్తొస్తున్నాడు. జరిగిన దాని గురించి ఎవరిని ఏం అనాలో.. ఏం అనకూడదో నాకు అర్థం కావడం లేదు అంటాడు సత్యం. అసలు హిమ.. నిరుపమ్ ను ఎందుకు కాదన్నదో అర్థం కావడం లేదు అంటాడు సత్యం. నిరుపమ్ ప్రస్తావన తెస్తేనే నన్ను ఏం అడగొద్దు అంటోంది అంటాడు ఆనంద రావు. హిమకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తాం అని చెబుదాం. ఇలా చెబితేనన్నా తన మనసులోని మాటను బయటపెడుతుందేమోనని చిన్న ఆశ అంటుంది సౌందర్య. దీంతో మీ ఇష్టం అంటాడు సత్యం. బయట వాళ్లకు సమాధానం చెప్పలేకపోతున్నాను అంటాడు సత్యం. నాకు ఇద్దరు రత్నాల్నాంటి కొడుకులు ఉన్నారని ఇన్నాళ్లు గర్వపడేవాడిని అని అంటాడు సత్యం.
ఏదో విధంగా ఈ సమస్యను మనమే పరిష్కరించుకుందాం అంటాడు సత్యం. మరోవైపు హిమ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. శౌర్య, నిరుపమ్ పెళ్లి ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వస్తారు సౌందర్య, ఆనంద రావు.
దీనికి మన మీద ప్రేమ తగ్గిపోయింది. గౌరవం కూడా తగ్గిపోయింది. నిరుపమ్ ను ఎందుకు కాదన్నావో చెప్పమంటే అస్సలు చెప్పడం లేదు అంటుంది సౌందర్య. నీ మనసులో ఏముందో చెప్పు. మాకు కాకుంటే ఇంకెవరికి చెబుతావు అంటాడు ఆనంద రావు.
మనసులో ఏదీ దాచుకునేదానివి కాదు కదా. ఇప్పుడు ఏమైంది. జీవితానికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు మాదగ్గర ఎందుకు దాస్తున్నావు అని అడుగుతాడు ఆనంద రావు. అది మాట్లాడదు అంటుంది సౌందర్య. ఒక రాయితోనో.. గోడ తోనే మాట్లాడితే మనకు ఎలాగైతే సమాధానం రాదో.. హిమ కూడా అలాగే తయారైంది అంటుంది సౌందర్య.
ఎప్పటికైనా నిరుపమ్ ను నా మనవరాలే పెళ్లి చేసుకుంటుందని స్వప్నకు చెప్పి వచ్చాను. కానీ.. నువ్వు మాత్రం ఇక్కడ నోరు మెదపడం లేదు.. అంటుంది సౌందర్య. మరోవైపు.. జ్వాలే శౌర్య అని నానమ్మకు చెబితే అయిపోతుంది కదా అని అనుకుంటుంది.
కానీ.. శౌర్య ఎదురు తిరిగితే ఎలా.. అని భయపడుతుంది. శౌర్య, నిరుపమ్ బావను ఎలా కలపాలి అని అనుకుంటుంది హిమ. మరోవైపు స్వప్నకు జ్వరం వస్తుంది. దీంతో ట్యాబ్లెట్లు తెచ్చి వేసుకోమంటాడు నిరుపమ్. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు అంటాడు.
దీంతో.. నీ మీద కోపం వస్తుంది. అంతలోనే నువ్వు చూపించే ప్రేమకు అది కరిగిపోతుంది అంటుంది. ఈరోజు నేను వంట చేయలేదు అంటుంది స్వప్న. దీంతో నువ్వేం టెన్షన్ పడకు. నేను జ్వాలకు చెప్పి తెప్పిస్తున్నా అంటాడు నిరుపమ్. దీంతో స్వప్నకు కోపం వస్తుంది.
ఆ ఆటోది వంట చేసి తీసుకొస్తే నేను తినాలా.. తినను అంటుంది స్వప్న. ఇంతలో జ్వాల బాక్స్ తీసుకొని వస్తుంది. డాక్టర్ సాబ్ అంటుంది. ఏం స్పెషల్ తెచ్చావు అని అడుగుతాడు నిరుపమ్. రుచికరమైన వంటలు తెచ్చాను అంటుంది జ్వాల.
స్వప్న, శోభ కూడా అక్కడికి వస్తారు. జ్వాలను చూసి షాక్ అవుతుంది శోభ. నువ్వేంటి ఇక్కడ అంటుంది శోభ. జ్వాల అంటేనే స్వేచ్ఛాజీవి. ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్తుంది అని అంటుంది జ్వాల. బాక్స్ తెచ్చాను.. టైమ్ కు వచ్చావు. నా వంటల రుచి కూడా చూడు.. బాగుంటాయి అంటుంది జ్వాల.
ఇక్కడేదో గొడవ జరిగేలా ఉందని అనుకొని.. ఈ బాక్స్ నేను హాస్పిటల్ కు తీసుకొస్తాను.. అక్కడికి వచ్చి తీసుకెళ్లు అంటాడు నిరుపమ్. దీంతో బాక్సుల వంకతో మళ్లీ హాస్పిటల్ కు వెళ్తుందా అని మనసులో అనుకుంటుంది స్వప్న. ఏంటి మేడమ్ అలా చూస్తున్నారు. మీ ఆరోగ్యం జాగ్రత్త. అందుకే.. మీకు ఉప్పు లేకుండా వంటలు తెచ్చాను అంటుంది జ్వాల.
ఏయ్.. ఆపుతావా అంటుంది స్వప్న. నాకు పెద్దోళ్లంటే గౌరవం అంటుంది జ్వాల. ఏదేదో మాట్లాడుతుంది. దీంతో స్వప్నకు చిరాకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.