Home » Entertainment » Karthika Deepam 26 February 2022 Full Episode
Entertainment

Karthika Deepam 26 Feb Today Episode : ఆనంద్ మోనిత కొడుకేనని కన్ఫమ్ చేసుకున్న దీప.. ఇంతలో దీపకు మరో షాక్.. కార్తీక్ కు ఈ విషయం తెలిసి ఏం చేస్తాడు?

Authored By
Varun G
The Telugu News | Published on: February 26, 2022, 10:30 am
Advertisement

Karthika Deepam 26 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 ఫిబ్రవరి 2022, శనివారం ఎపిసోడ్ 1286 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీవల్లి, కోటేశ్ ఏ పుణ్యలోకంలో ఉన్నారో కానీ.. ఆనంద్ ను మీరు కోరుకున్నట్టే డాక్టర్ ను చేస్తాం అని అనుకుంటుంది దీప. ఇంతలో తనకు కోటేశ్ కు సంబంధించిన ఒక పుస్తకం కనిపిస్తుంది. అప్పట్లో ఇందులో ఏదో కనిపించింది అని అనుకుంటుంది దీప. ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తుంది దీప. కోటేశ్ ఈ కారు నెంబర్ ఎందుకు వేశాడు. ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు అని అనుకుంటుంది దీప. ఇంతలో మామయ్య వాళ్లకు కాఫీ ఇవ్వడం మరిచిపోయాను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప. ఆనంద్ గురించి ఏం ఆలోచించావు సౌందర్య అని అడుగుతాడు ఆనంద రావు.

Advertisement

karthika deepam 26 february 2022 full episode

ఇంకేం ఆలోచించలేదండి అంటుంది సౌందర్య. అభం శుభం తెలియని పసివాడు వీడు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఇక్కడికి వచ్చాడు.. అంటాడు ఆనంద రావు. ఇంతలో మోనిత ఇంటికి వస్తుంది. ఆనంద రావు ఒడిలో ఉన్న ఆనంద్ ను చూసి మురిసిపోతుంది మోనిత. బాబుకు ఊయల, కొత్త బట్టలు అని చెబుతుంది. ఇవన్నీ బాబుకు వేసి ఊయల.. జంపాల అను దీపక్క అంటుంది మోనిత. ఎవరు బాబు అయినా బాబు బాబే కదా.. అంటుంది మోనిత. దీంతో ఆనందే తన బిడ్డ అని మోనితకు తెలిసినట్టే మాట్లాడుతోంది ఏంటి అని అనుకుంటుంది సౌందర్య. ఆనంద్ ను ఎత్తుకోబోతుంది. దీంతో ఆగు.. నా బిడ్డ మీద చేయి వేయొద్దు అంటుంది దీప. నీ బిడ్డా.. అంటుంది మోనిత. దీంతో అవును అంటుంది దీప.

Advertisement

నా బిడ్డను వదిలేసి.. నేను కని ఇచ్చిన వారసుడిని వదిలేసి ఎవరో కన్న బిడ్డను తెచ్చుకున్నారు ఏంటి అని అంటుంది మోనిత. నాకు ఈ బిడ్డను ఇచ్చేయండి. నా బిడ్డను వీడిలో చూసుకుంటాను అంటుంది మోనిత. దీంతో నడవవే.. అంటూ మోనితను అక్కడి నుంచి లాగి బయటకు నెట్టేస్తుంది.

బై ఆనంద రావు గారు.. డాడీ వాళ్ల దగ్గర హ్యాపీగా ఉండండి. అమ్మ త్వరలోనే మీ దగ్గరికి వస్తుంది అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. మరోవైపు పిల్లలు షాపింగ్ చేసి అప్పుడే ఇంటికి వస్తాడు. నానమ్మా.. బాబాయి మాకు బట్టలు కొనిచ్చాడు అంటారు పిల్లలు.

Advertisement

బాగున్నాయి. మీ గదిలో పెట్టుకోండి అంటుంది సౌందర్య. మరోవైపు ఆనంద్ ను తీసుకొని దీప.. ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. ఏరా ఆనంద్ చూశావా.. మోనిత ఎంత దుర్మార్గురాలో.. ఆఖరికి నిన్ను కూడా వదలడం లేదురా. నిన్ను తనకు ఇవ్వమంటోంది. అయినా నిన్ను ఎలా ఇస్తాం. నువ్వు మాలో ఒకడివిరా. నువ్వు మా ప్రాణం కదా అంటుంది దీప.

Karthika Deepam 26 Feb Today Episode : మోనిత కారును చూసి.. కోటేశ్ పుస్తకంలో రాసి నెంబర్ ను గుర్తుకు తెచ్చుకున్న దీప

ఇంతలో మోనిత కారు కనిపిస్తుంది. కారు నెంబర్ చూడగానే కోటేశ్ బుక్ లో రాసిన నెంబర్ గుర్తొస్తుంది. కోటేశ్ ఈ నెంబర్ ఎందుకు రాసిపెట్టినట్టు. అసలు ఈ కారుకు, కోటేశ్ కు ఏంటి సంబంధం అని అనుకుంటుంది దీప. నన్ను క్షమించు అమ్మా అని ఎందుకు రాశాడు అని అనుకుంటుంది.

అసలు పేరు రాయకుండా కారు నెంబర్ ఎందుకు రాశాడు అని అనుకుంటుంది దీప. వెంటనే కారులో ఎవరు ఉన్నారో చూస్తుంది. చూస్తే.. అందులో లక్ష్మణ్ ఉంటాడు. చూసి.. లక్ష్మణ్ నువ్వేంటి ఈ కారులో ఉన్నావు అని అడుగుతుంది. దీంతో అదేంటి మేడమ్ మీకు తెలియదా.. ఇది మోనిత మేడమ్ కారు కదా అంటాడు లక్ష్మణ్.

దీంతో దీప షాక్ అవుతుంది. అంటే.. వీడు మోనిత కొడుకా అని భయపడుతుంది దీప. దీంతో దీపకు ఏం చేయాలో అర్థం కాదు. నడుచుకుంటూ అలాగే వెళ్లిపోతుంది. కోటేశ్.. మోనిత కొడుకును ఎత్తుకొచ్చాడా? మోనిత కొడుకు ఇన్నిరోజులు మా దగ్గర ఉన్నాడా? మోనిత కొడుకుతో నా పిల్లలు ఆడుకుంటున్నారా? మోనిత కొడుకుతో మేము ఇప్పటి దాకా ఇంత అనుబంధాన్ని పెంచుకున్నామా? అని అనుకుంటుంది దీప.

Advertisement

ఒరేయ్ ఆనంద్ ఏంట్రా ఇది.. అని అనుకుంటుంది దీప. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది దీప. రత్న సీతను కలవడానికి వెళ్తుంది దీప. నువ్వు నాకొక సాయం చేసి పెట్టాలి అంటుంది దీప. ఏంటి అని అడిగితే.. మొత్తం చెబుతుంది. ఏంటి రత్నసీత మాట్లాడవు అంటుంది.

మోనిత కొడుకును ఎత్తుకెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ నా దగ్గర లేదక్క అంటుంది. దీంతో.. ప్లీజ్ ఈ ఒక్క సాయం చేసిపెట్టు ప్లీజ్. నా బుర్ర బద్దలు అయిపోతుంది రత్నసీత అంటుంది. కానీ.. నా దగ్గర లేదు అంటుంది. కానీ.. మోనిత ఇవ్వొద్దని చెప్పడంతో తన దగ్గర లేదని అబద్ధం చెబుతుంది రత్నసీత.

దీంతో దీప అక్కడి నుంచి వెళ్లిపోబోతుండగా.. దీపక్క అంటూ రత్న సీత పిలుస్తుంది. నా దగ్గర ఆ వీడియో ఉంది దీపక్క అంటుంది రత్నసీత. చూడు.. అని ఫోన్ తీసి చూపిస్తుంది. ఆ వీడియోలో కోటేశ్.. బాబును ఎత్తుకెళ్లడం చూస్తుంది దీప.

భగవంతుడా.. ఎంత పని చేశావు కోటేశు అని అనుకుంటుంది. ఏం అనుకోకండి మేడమ్. ఈ వీడియోను మీకు, కార్తీక్ గారికి చూపించొద్దని ముందే చెప్పింది అని అంటుంది రత్నసీత. అంటే.. బాబు నాదగ్గరే ఉన్నాడని మోనితకు కూడా తెలిసిందా. తెలిసి చెప్పిందా.. తెలియక చెప్పిందా అని అనుకుంటుంది దీప.

Advertisement

డాక్టర్ బాబు వచ్చి అడిగితే వీడియో లేదని చెప్పు రత్నసీత నీకు దండం పెడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప. ఈ బిడ్డ మోనిత బిడ్డ అని డాక్టర్ బాబుకు ఎలా చెప్పాలి అని అనుకుంటుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి