Karthika Deepam 26 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 జనవరి, 2022 బుధవారం ఎపిసోడ్ 1259 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రుద్రాణి మనుషులు కనిపించారా.. ఏమన్నారు వాళ్లు అని అడుగుతుంది దీప. వాళ్లే మనింటి నుంచి వెళ్తూ.. మీ నాన్న జాగ్రత్త అంటూ వెళ్లారు అని పిల్లలు దీపతో చెబుతారు. వాళ్లు ఎందుకు అలా అన్నారు అని అడుగుతారు. దీంతో వాళ్లు ఎందుకు అలా అన్నారు అని అడుగుతారు పిల్లలు. దీంతో తమ్ముడు నిద్రలేచినట్టున్నాడు. వెళ్లి వాడిని ఆడించండి అని అంటుంది దీప. రుద్రాణి.. డాక్టర్ బాబుకు ఏదైనా హానీ చేయాలని అనుకుంటుందా అని అనుకుంటుంది దీప. డాక్టర్ బాబుకు ఏదైనా హానీ చేయాలని అనుకుంటే.. నేను ఊరుకుంటానా.. ఆ రుద్రాణి అంతు చూస్తా అని అనుకుంటుంది.
మరోవైపు హోటల్ లో పని చేస్తూ ఉంటాడు కార్తీక్. ఇంతలో అప్పారావు.. ఓనర్ దగ్గరికి వెళ్లి సినిమాకు వెళ్లేందుకు పర్మిషన్ తీసుకుందామనుకుంటాడు. కానీ.. ఓనర్ ఇవ్వడేమో అనుకొని.. కార్తీక్ దగ్గరికి వెళ్లి పర్మిషన్ అడుగుతాడు. సరే.. నువ్వు మ్యాట్నీకి వెళ్లు అంటాడు కార్తీక్. రేయ్ ఎక్కడికిరా అని భద్రం అడుగుతాడు. మన పనికోసమే అంటాడు అప్పారావు. సరే వెళ్లు అంటాడు. మరోవైపు మోనిత.. తన అందాన్ని చూసుకొని మురిసిపోతుంటుంది. ఏంటే మోనిత ఎంత అందంగా ఉన్నావు. నువ్వు ఇంత అందంగా ఉన్నా కార్తీక్ మనసును మాత్రం కరిగించలేకపోతున్నావు అని అనుకుంటుండగానే తన ఇంటికి భారతి వస్తుంది. ఏంటో మోనిత నువ్వు.. అక్కడ ఉన్న హాస్పిటల్ అమ్మేసి ఇక్కడ బస్తీలో హాస్పిటల్ కొనడం ఏంటి.. బస్తీ వాళ్లను మార్చుతాను అన్నావు.. మార్చావా మరి అని అడుగుతుంది భారతి.
మోనిత.. జీవితంలో ఇప్పటికే నువ్వు చాలా కోల్పోయావు. నీ జీవితంలో నువ్వు ఏం చేస్తున్నావో నీకే అర్థం కావడం లేదు. లైఫ్ లో ఏదో ఒక గోల్ ఉండాలి అంటుంది. ఎందుకు లేవు. నా లైఫ్ లో మూడు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి కార్తీక్.. రెండు కార్తీక్.. మూడు కార్తీక్ అంటుంది.
ఏంటి మోనిత.. పాపం కార్తీక్ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఎన్నో సర్జరీలు చేసి సక్సెస్ చేసిన కార్తీక్ అలా అవడం ఏంటి. జీవితంలో ఎన్నో సర్జరీలు చేసిన కార్తీక్ కు అలా అవడం ఏంటి. సర్జరీ చేసే ముందు వరకు బాగానే ఉన్నాడట.. ఆ తర్వాతే ఏం జరిగిందో అర్థం కావడం లేదు అంటుంది.
తన డాక్టర్ వృత్తికి బ్రేక్ ఇస్తే.. అప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్లి నాకు దగ్గరవుతాడనుకున్నా కానీ.. ప్లాన్ అంతా రివర్స్ అయింది అని అనుకుంటుంది మోనిత. కానీ.. ఇంతలో మోనిత మీద భారతికి డౌట్ వస్తుంది. కొంపదీసి.. కార్తీక్ కు ఆపరేషన్ ముందు నువ్వేమైనా చేశావా అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు భారతి అని మోనిత టాపిక్ మారుస్తుంది.
కట్ చేస్తే దీప.. హోటల్ కు వెళ్తూ ఉంటుంది. ఆనంద్ తో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో అప్పారావు సైకిల్ మీద దీపను చూస్తాడు. ఎక్కడికి అక్క అంటాడు. హోటల్ కు అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే సినిమాకు అంటాడు అప్పారావు. మరి హోటల్ ఎవరు చూసుకుంటారు అని దీప అడిగితే.. నా అసిస్టెంట్ ఉన్నాడులే.. అతడు చూసుకుంటాడు అని చెబుతాడు అప్పారావు.
మరోవైపు బయటికి వెళ్లిన మోనితకు.. ఆదిత్య తారసపడతాడు. ఆదిత్య బాగున్నావా అని అడుగుతుంది. కనీసం వదిన బాగున్నావా అని కూడా అడగవా అంటుంది. మోనిత నాకు అసలే కోపం ఎక్కువ నన్ను వెళ్లనివ్వు అంటాడు. కోపం అప్పుడప్పుడు మంచిదే. నువ్వు కోప్పడా నేను ఏం అనుకోను. ఎందుకంటే నువ్వు నా మరిదివి కదా అంటుంది.
అన్నట్టు అత్తయ్య మామయ్యలు ఎలా ఉన్నారు. మా చెల్లెలు శ్రావ్యను అడిగానని చెప్పు అంటుంది. ఆదిత్య.. అవును కార్తీక్ వాళ్లు ఎక్కడున్నారో చెప్పవా ప్లీజ్ అంటుంది. మోనిత నన్ను ఇరిటేట్ చేయకు. నాకు ఎక్కడున్నారో తెలియదు అంటుంది మోనిత.
కార్తీక్, నా కొడుకును దూరం చేసుకున్న నన్ను చూస్తే నీకు జాలి కలగడం లేదా అంటుంది. జాలా.. అన్నయ్య వాళ్లు దూరం అయ్యాక మా డాడా ఆరోగ్యం బాగా లేదు. అందరం దూరం అయ్యాం.. అంటాడు. ఫోన్ అక్కడ పెట్టి ఆవేశంలో వెళ్లిపోతాడు ఆదిత్య.
ఆ ఫోన్ ను చూసి ఆదిత్య.. ఫోన్ మరిచిపోయి వెళ్లావా అని అనుకుంటుంది మోనిత. ఆ ఫోన్ ను తన కారు కింద వేసి తొక్కేసి వెళ్లిపోతుంది మోనిత. మరోవైపు దీప హోటల్ కు నడుచుకుంటూ వస్తుంటుంది. హోటల్ లో సర్వ్ చేస్తూ ఉంటాడు కార్తీక్. పార్శిల్ ఆర్డర్ ఇవ్వాలని బయటికి వెళ్లేందుకు కార్తీక్ వెళ్తుండగా ఆపుతాడు భద్రం.
నువ్వు ఇక్కడ చూసుకో.. నేను వెళ్లి ఇచ్చి వస్తానులే అని చెప్పి ఓనర్ వెళ్తా అంటాడు. ఇంతలో దీప వస్తుంది. చీటీ పాట గురించి చెప్తా అన్నారు కదా అంటుంది దీప. ఇప్పుడే ఈ పార్శిల్ ఇచ్చి వస్తాను.. ఇక్కడ కూర్చో అంటాడు ఓనర్. సరే.. అని దీప లోపలికి వెళ్తుంది.
అక్కడ టేబుల్ మీద ప్లేట్లు తూడుస్తున్న కార్తీక్ ను చూస్తుంది దీప. చూసి షాక్ అయిపోతుంది. ఏమండి అని అంటుంది. దీపను చూసి కార్తీక్ కూడా షాక్ అవుతాడు. ఏం చేస్తున్నారు మీరు.. అని అడుగుతుంది. కార్తీక్ తో మాట్లాడుకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంటికి వచ్చినా కార్తీక్ తో మాట్లాడదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.