Home » Entertainment » Karthika Deepam 26 October 2021 Full Episode
Entertainment

Karthika Deepam 26 Oct Today Episode : మోనితకు సీరియస్.. కార్తీక్ తో కలిసి పడుకుంటేనే ఈ గర్భం వచ్చిందని అసలు నిజం చెప్పిన మోనిత

Authored By
Varun G
The Telugu News | Published on: October 26, 2021, 1:10 pm
Advertisement

Karthika Deepam 26 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 26 అక్టోబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 1180 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ కు భారతి ఫోన్ చేస్తుంది. మోనితకు నొప్పులు వస్తున్నాయని చెబుతుంది. తను నువ్వు వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటానని చెబుతోంది. పేగు బిడ్డ మెడకు చుట్టుకుంది. తను చచ్చిపోతుంది కార్తీక్ అంటుంది భారతి. అయితే నాకెందుకు చెబుతున్నావు. నాకేం అవసరం. చచ్చిపోతే చచ్చిపోని.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు కార్తీక్. తన తల్లికి అసలు విషయం చెబుతాడు. ఇంతలో కాఫీ తీసుకొని దీప వస్తుంది. దీప రాగానే కార్తీక్ టాపిక్ మారుస్తాడు. నేను రాగానే టాపిక్ మార్చారని దీప తెలుసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

karthika deepam 26 october 2021 full episode

మరోసారి భారతి ఫోన్ చేస్తుంది. దీంతో సౌందర్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఆంటీ మీరైనా అర్థం చేసుకోండి ఆంటి. కార్తీక్ వస్తేనే తను ఆపరేషన్ చేయించుకుంటానని చెబుతోంది. చూస్తూ ఇద్దరి ప్రాణాలను తీయడం ఏంటి అంటుంది భారతి. దీంతో నేను మళ్లీ ఫోన్ చేస్తాను అని చెబుతుంది. కడుపులో ఉన్న బిడ్డ ఏం పాపం చేసిందిరా అంటుంది సౌందర్య. దీంతో ఎవరి మీద జాలి పడుతున్నావు మమ్మీ అంటుంది సౌందర్య. ఆ పసిప్రాణాన్ని అలా ఎలా వదిలేస్తాం అంటుంది సౌందర్య.

Advertisement

కట్ చేస్తే కార్తీక్ వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటా అని మోనిత అంటుంది. ఇంతలో తన పల్స్ రేట్ పడిపోతుంటుంది. భారతి నువ్వు నాకు ఏ ఇంజెక్షన్ ఇవ్వకూడదు. కార్తీక్ రావాలి.. నా భర్తగా సంతకం పెట్టాలి అప్పుడే నేను ఆపరేషన్ చేయించుకుంటా అని చెబుతుంది మోనిత. కార్తీక్ వస్తున్నాడు ముందు నువ్వు ఇంజెక్షన్ తీసుకో.. బిడ్డ పరిస్థితి బాగా లేదు అంటుంది భారతి.

మరోవైపు సౌందర్య దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. మరోసారి భారతి ఫోన్ చేస్తుంది. ఆంటి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఇంకొంచెం లేట్ అయితే మోనిత బతకదు.. కడుపులోని బిడ్డ కూడా బతకదు. మీరే అర్థం చేసుకోండి. ఈ ఒక్కసారికి కార్తీక్ ను రమ్మని చెప్పండి. లేదంటే ఉసురు తగులుతుంది ఆంటి. మోనిత ఎంత దుర్మార్గురాలు అయినా సరే.. తను ఇప్పుడు తల్లి కాబోతోంది అర్థం చేసుకోండి.. ఈ ఒక్కసారికి కార్తీక్ ను రమ్మని చెప్పండి అంటుంది భారతి. ఇంతలో దీప అక్కడికి వస్తుంది. అత్తయ్య మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. కాఫీ కోసం అంటూ కంగారు పడుతుంది. ఏంటి అత్తయ్య ఇంత కంగారు పడుతోంది. ఏమైంది అసలు అని అనుకుంటుంది దీప.

Advertisement

భారతి వీడియో కాల్ చేస్తుంది. కాల్ చేసి మోనితను చూపిస్తుంది. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. మరోవైపు హిమ, శౌర్య.. ఇద్దరూ బాధ పడుతూ కూర్చుంటారు. ఏంటి హిమ నాతో కూడా మాట్లాడటం లేదు అంటుంది శౌర్య. హిమ ఏమైంది.. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నామీద నాకే కోపం వచ్చింది అంటుంది హిమ. నేను బాగా ఆలోచించాను డాడీ గురించి అంటుంది. డాడీ మంచోడే అనిపించింది అంటుంది హిమ. ఒకవేళ డాడీ అమ్మను మోసం చేస్తే అమ్మ ఇక్కడుండేది కాదు కదా. బస్తీకి వెళ్లిపోవాలి కదా. అమ్మ బస్తీకి వెళ్లిపోలేదు అంటే డాడీ మంచోడే కదా అంటుంది. అవును.. మొదటి నుంచి నేను మొత్తుకునేది అదే.. అని చెబుతుంది శౌర్య. దీంతో హిమ కూడా సంతోషిస్తుంది. ఇద్దరూ మళ్లీ కలిసిపోతారు. అమ్మకు, నాన్నకు ఒకేసారి సారీ చెబుదాం అని అనుకుంటారు ఇద్దరూ.

Karthika Deepam 26 Oct Today Episode : కార్తీక్ ను ఒప్పించి ఆసుపత్రికి తీసుకెళ్లిన సౌందర్య

కట్ చేస్తే కార్తీక్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సౌందర్య వచ్చి.. పెద్దోడా నా మాట వినరా.. భారతి నాతో వీడియో కాల్ మాట్లాడింది.. అంటుంది. అవన్నీ నాటకాలు అంటాడు కార్తీక్. నాకెందుకో నిజమే అనిపిస్తోందిరా అంటుంది సౌందర్య. చచ్చిపోతుందేమోరా అంటుంది. మన కుటుంబాన్ని వీధిలో నిలబెట్టిన దానికోసం వెళ్లి సంతకం చేయాలా అంటాడు కార్తీక్. ఇంతలో దీప వీళ్లు మాట్లాడుకోవడం చూస్తుంది. వీళ్ల దగ్గరికి రాబోతుంది. దీపను చూడు.. నేను సంతకం పెడితే దీపను మోసం చేసినవాడినే అవుతాను అంటాడు కార్తీక్.

karthika deepam 26 october 2021 full episode

పసిపిల్లాడి ప్రాణాలు తీసే హక్కు మనకు లేదు.. పదా సంతకం పెట్టు అని చెబుతుంది సౌందర్య. దీంతో ఇద్దరూ ఆసుపత్రికి బయలు దేరుతారు. ఇంతలో దీప కలగజేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య అని అడుగుతుంది. గుడికి అంటుంది సౌందర్య. నేను కూడా వస్తాను అంటుంది దీప. వద్దులే.. నేను కార్తీక్ కోసం మొక్కుకున్న మొక్కు అంటుంది. పదా కార్తీక్ వెళ్దాం అంటుంది సౌందర్య. వెళ్లక తప్పదా అంటాడు కార్తీక్.

Advertisement

ఇంతలో ఆసుపత్రికి వెళ్తారు కార్తీక్, సౌందర్య. మరోవైపు హిమ బ్లడ్ రిపోర్ట్స్ కోసం ఆసుపత్రికి వెళ్తుంది దీప. అక్కడ ఉన్న ల్యాబ్ సిబ్బందిపై సీరియస్ అవుతుంది. నా భర్త ఇచ్చిన శాంపిల్స్ ను ఆ మోనితకు ఎందుకు ఇచ్చావు అంటూ సీరియస్ అవుతుంది. దీంతో నేను ఆ శాంపిల్స్ ఎవ్వరికీ ఇవ్వలేదు. అది ఆసుపత్రిలోనే ఉంది అంటుంది ల్యాబ్ డాక్టర్. దీంతో దీప షాక్ అవుతుంది. మరోవైపు మోనిత ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో అసలు నిజం చెబుతుంది మోనిత. నేను చనిపోయేముందు మీకొక నిజం చెప్పాలి. ఇది ఆర్టిఫిషియల్ ఇన్సెములేషన్ గర్భం కాదు. సహజంగా మనకు పుడుతున్న బిడ్డ అని చెబుతుంది మోనిత. దీంతో కార్తీక్, సౌందర్య షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి