Karthika Deepam 27 August 2022 Full Episode
Karthika Deepam 27 Aug Today Episode : కార్తీకదీపం సీరియల్ ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1442 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… సౌర్య దగ్గరికి వెళ్లి ఆనంద్ రావు ఇంటికి రమ్మని అడుగుతాడు. అప్పుడు నేను హిమ ఉన్న ఇంటికి ఎప్పటికీ రాను అని అంటుంది శౌర్య. అప్పుడు ఆనందరావు నీకు హిమ మీద కోపం ఎప్పుడు తగ్గుతుంది అమ్మ అని ఏడుస్తూ అంటారు. అప్పుడు అమ్మా నాన్నలు బ్రతికి వచ్చినప్పుడు ఆ కోపం పోతుంది అని చెప్తుంది. అయినా సరే మీరు అమెరికాకి వెళ్లిపోయారు కదా.. నన్ను వదిలేసి మళ్లీ ఎందుకు తిరిగి వచ్చారు.. అప్పుడు ఆనందరావు నీకు మేము అమెరికా వెళ్లిపోయామని ఎలా తెలుసమ్మా అని అడుగుతాను. నేను ఇంటికి వచ్చాను మీరు అమెరికాకి వెళ్లిపోయారని చెప్పారు. అప్పుడు ఇంకాస్త నా మీద మీకు ప్రేమ లేదని అర్థమైంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో తాతయ్య అని చెప్తుంది సౌర్య. మేము ఆ ఇంట్లో అమ్మ నాన్న జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని ఇల్లు వదిలేసి వెళ్లిపోయాం కానీ నాలుగు రోజులు కూడా అక్కడ ఉండలేకపోయాం.నీకోసమే మళ్లీ తిరిగి వచ్చాం అని అంటాడు. అయినా సరే నేను రాను మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటుండగా సరే.. ఈ బట్టలన్నా తీసుకో అని ఆనంద్ రావు అంటాడు. అప్పుడు నాకు ఇలాంటివి ఏమీ వద్దు మీరు వెళ్లిపోండి అని తను ఇంట్లోకి వెళ్ళిపోతుంది.
తర్వాత వాళ్లు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే దీప ఆటోలో వస్తూ ఉంటుంది. సౌందర్య వాళ్లు ఆటోకి ఎదురుగా వెళ్తూ ఉంటారు. కారు క్రాస్ అయ్యేటప్పుడు దీనిపని ఆనంద్ రావు చూస్తాడు. అప్పుడు కారు ఆపు అని కారు దిగి ఆనందరావు సౌందర్యతో నేను దీప చూశాను అని చెప్తాడు. అప్పుడు సౌందర్య అదంతా బ్రహ్మం అండి నా కూడా చాలాసార్లు అలానే అనిపించింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే దీప డాక్టర్ వాళ్ళ ఇంట్లో డాక్టర్ తో జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ దీపకు ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే కార్తీక్ గతం కొద్దికొద్దిగా గుర్తు వస్తూ ఉంటుంది. దీప అని కలవరిస్తూ ఉంటాడు. అప్పుడు మౌనిత భయపడిపోతూ ఉంటుంది. నేను వేసిన మందులు పనిచేయడం లేదా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నీ పేరు ఏంటి అని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు నా పేరు మౌనిత అని కంగారుపడుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడు నాకు తలనొప్పిగా ఉంది కొంచెం తల మర్దన చేస్తావా.. అని అడుగుతాడు. అప్పుడు మౌనిత తలమార్ధనా చేస్తే గతమంతా గుర్తొస్తుంది అని ఏదో విధంగా తప్పించుకుంటుంది.
Karthika Deepam 27 August 2022 Full Episode
నేను బయటికి వెళుతున్నాను. అని కార్తీక్ తో చెబుతుంది. అప్పుడు కార్తీక్ నేను కూడా అలా బయటకు వెళ్లి వస్తాను అని అంటాడు. అప్పుడు వద్దు కార్తీక్ మీరు వెళ్ళకూడదు అని అంటుంది. అప్పుడు కార్తీక్ నేను ఎక్కడికి వెళ్ళనివ్వు నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు అని అంటాడు. మోనిత ఏదో ఒకటి చెప్పి తనని ఆపుతుంది. కట్ చేస్తే హోటల్లో హిమ, సౌందర్య, ఆనందరావు సౌర్య గురించి మాట్లాడుతూ ఉంటారు హిమకు నేను సౌర్యని ఏనాటికైనా తీసుకొస్తాను అని మాట ఇస్తుంది. అప్పుడు ఆనందం మనం సౌర్యని బలవంతంగా అయినా తీసుకురావాల్సింది. అని అంటాడు. అప్పుడు సౌందర్య నాకు తీసుకురావాలని ఉందండి కానీ తీసుకొస్తే అది ఉంటుందా. ఉండదు అది మనకి దూరంగా వెళ్ళిపోతే ఏం చేస్తాం అందుకే నేను దానిని బలవంతంగా తీసుకు రావడం లేదండి అని చెప్తుంది. కట్ చేస్తే మౌనిత బయటికి వచ్చి కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కార్తీక్, మౌనిత వాళ్ళ ఇంట్లో ఉన్నట్లు దీప తెలుసుకుంటుంది. సోమవారం ఎపిసోడ్ లో మౌనిత దీప మధ్య ఏం జరగబోతుందో ఎదురుచూడాల్సిందే…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.