Karthika Deepam 27 June Today Episode : జ్వాలకు సౌందర్య సర్ ప్రైజ్.. పెళ్లి కార్డుతో హిమకు షాకిచ్చిన నిరుపమ్.. ఇంతలో మరో ట్విస్ట్

Advertisement
Advertisement

Karthika Deepam 27 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 1389 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమ కోసం వెతుక్కుంటూ వస్తే జ్వాలకు తింగరి కనిపిస్తుంది. ఛీ.. ఛీ.. నువ్వేంటి ఇక్కడ అంటుంది. అసలు నీ మొహం నాకు చూపించకు అంటుంది జ్వాల. నువ్వు పెద్ద మోసకారివి అంటుంది. దీంతో జ్వాల ప్లీజ్ జరిగిందేంటో నీకు తెలియదు అంటుంది. దీంతో జరిగిందంతా నాకు అర్థం అయింది. నాకు, డాక్టర్ సాబ్ కు మధ్య నువ్వు విలన్ వి. ఇన్నాళ్లు నాకు శత్రువు ఒకరే అనుకున్నాను. నువ్వు అంతకు మించి తయారయ్యావు. అయినా నువ్వేంటి ఇక్కడ. నాకు నా శత్రువు ఇక్కడే ఉందని తెలిస్తే వచ్చాను అంటుంది జ్వాల. దీంతో అయ్యో శౌర్య.. నిన్ను ఆ శోభ తప్పుదోవ పట్టిస్తోంది. నువ్వు నిరుపమ్ బావ ఒక్కటి కావాలనేదే నా బాధ అంటుంది. జ్వాల అంటూ ఏదో అనబోతే.. చెప్పేది నీకే.. నాతో మాట్లాడకు అంటుంది.

Advertisement

karthika deepam 27 june 2022 full episode

అసలు నీకు తింగరి అని పేరు పెట్టాను. అసలు నీ పేరేంటో చెప్పవే. నీ మొహం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదు. నీ పేరేంటో చెప్పు.. నీ పేరును కూడా నా చేతి మీద పచ్చబొట్టు వేయించుకుంటాను. దానికి నీకు చాలా పోలికలు ఉన్నాయి. అది కూడా ఇలాగే నంగనాచిలా కనిపిస్తూ మా అమ్మానాన్నలను పొట్టన పెట్టుకుంది. నువ్వేమో నా జీవితాన్ని, నా డాక్టర్ సాబ్ ను తీసేసుకున్నావు అంటుంది జ్వాల. తనే హిమ అని తెలియకపోతేనే తనపై ఇంతలా రెచ్చిపోతోంది. ఒకవేళ తనే హిమ అని తెలిస్తే ఇంకెలా రెస్పాండ్ అవుతుందో జ్వాల అని అనుకుంటుంది శోభ. మరోవైపు నా శత్రువు ఫోన్ చేసింది. ఇంకా రావట్లేదు ఏంటి అని అనుకుంటుంది జ్వాల. వెంటనే ఆ నెంబర్ కు ఫోన్ చేస్తుంది కానీ.. ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల.

Advertisement

మరోవైపు జ్వాల గురించే ఆలోచిస్తూ ఉంటుంది హిమ. ఈ శోభ ఎందుకు ఇలా చేస్తుంది. శౌర్య గురించి నేనే బావకు చెబితే అయిపోతుంది కదా అని అనుకుంటుంది. శౌర్య విషయంలో బావను మోసం చేయలేదు అనే తృప్తి ఉంటుంది కదా. అసలు నాకు క్యాన్సర్ లేదని బావకు చెబితే.. బావ నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెబితే.. నమ్ముతాడా.. నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటాడా అని అనుకుంటుంది హిమ.

Karthika Deepam 27 June Today Episode : పెళ్లి కార్డుతో సర్ ప్రైజ్ చేసిన నిరుపమ్, స్వప్న

ఇంతలో ఆనంద రావు వచ్చి.. హాస్పిటల్ కు వెళ్తే కాస్త మనశ్శాంతి అయినా ఉండేది కదా అంటాడు ఆనంద రావు. ఇంతలో నిరుపమ్, స్వప్న వస్తారు. నానమ్మను పిలవండి అంటాడు నిరుపమ్. తను లేదు అంటాడు ఆనంద రావు. ఇంతలో పెళ్లి కార్డు తీసుకొచ్చి ఇస్తాడు.

మరోవైపు సౌందర్య.. జ్వాల ఇంటికి వెళ్తుంది. అక్కడికెళ్లి చూసి షాక్ అవుతుంది. ఇల్లు అంతా చిందరవందరగా ఉంటుంది. అక్కడ చూస్తే ఎవరో పడుకొని ఉంటారు. దీంతో జ్వాల అంటూ పిలుస్తుంది. కానీ.. ఉలుకు ఉండదు.. పలుకు ఉండదు. జ్వాల ఏమైందే అంటుంది.
దుప్పటి తీసి చూస్తే జ్వాల నిద్రపోతూ ఉంటుంది. ఇంటిని శుభ్రం చేస్తుంది సౌందర్య. రక్తంతో నిరుపమ్ బొమ్మ గీసి దాన్ని చింపేస్తుంది. వాటన్నింటినీ క్లీన్ చేస్తుంది. బయట నీళ్ళు చల్లి ముగ్గు వేస్తుంది. తను ముగ్గు వేయడాన్ని శాంతాబాయి చూస్తుంది. ఈవిడ ఎవరు.. శోభ మేడమ్ కు చెప్పాలా వద్దా అని అనుకుంటుంది.

శోభ గురించి అసలు నిజాన్ని ఆనంద రావు కు చెబుతుంది. మనం ఇప్పుడు ఏమాత్రం అవకాశం ఇచ్చినా.. శోభ నిరుపమ్ బావ మనసును కలుషితం చేస్తుంది. ఏం చేసి అయినా శౌర్యతో నిరుపమ్ బావ పెళ్లి చేయాలి అంటుంది హిమ. ఏంటో మన జీవితాలు ఎటు పోతున్నాయి అని అంటాడు ఆనంద రావు.

కట్ చేస్తే జ్వాల లేచి చూసేసరికి.. ఇల్లంతా సర్ది ఉంటుంది. దీంతో జ్వాల షాక్ అవుతుంది. అప్పుడే సౌందర్య.. అంట్లు కడిగి ఇంట్లోకి వస్తుంటుంది. ఏంటి సీసీ ఇవన్నీ నువ్వే చేశావా అని అడుగుతుంది. దీంతో నా ఇల్లు నీది కాదా.. నీ ఇల్లు నాది కాదా అంటుంది.

ఇంతలో తనకు ఒక సర్ ప్రైజ్ అంటూ ఒక పేపర్ ను ఇస్తుంది. ఏంటిది అంటుంది జ్వాల. దీంతో తెరిచి చూడు నీకే అర్థం అవుతుంది అంటుంది సౌందర్య. దాన్ని తెరిచి చూసి షాక్ అవుతుంది జ్వాల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Prakash Raj : పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. సోషల్ మీడియాలో రచ్చ షురూ..!

Prakash Raj : తిరుమల లడ్డూ వివాదంపై దేశం మొత్తం సంచలనం కాగా దాని పై రాజాకీయ నేతలను ట్యాగ్…

5 hours ago

Ysrcp : ఉత్త‌రాంధ్ర కూడా ఖాళీ కాబోతుందా.. అక్క‌డ వైసీపీ నుండి జంప్ అయ్యే తొలి వికెట్ ఇదే..!

Ysrcp : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాజ‌కీయ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీలో ఉన్న నేత‌లు మెల్లమెల్ల‌గా…

6 hours ago

Jani Master : నేరం ఒప్పుకున్న జానీ మాస్ట‌ర్.. దురుద్ధేశంతోనే ఆమెని అసిస్టెంట్‌గా మార్చుకున్నాడా.!

Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నేరాన్ని జానీ…

7 hours ago

Saturday : శనివారం రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తున్నారా… కష్టాలను కొని తెచ్చుకున్నట్లే..!

Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత…

8 hours ago

Koratala Siva : నా ప‌ని నన్ను చేసుకోనివ్వ‌కుండా మ‌ధ్య‌లో వేళ్లు పెడితే ఇలానే ఉంట‌ది.. కొర‌టాల స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర్వాత ప‌లు సినిమాలు చేయ‌గా,అందులో విజ‌యం సాధించిన‌వి చాలా త‌క్కువే అని…

9 hours ago

Tirupati Laddu : ల‌డ్డూ సీక్రెట్ ఇప్పుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్ట‌డం వెన‌క అంత స్కెచ్ ఉందా?

Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…

10 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో దారుణాతి దారుణాలు.. అమ్మాయిల ప్రై… పా.. నొక్కుతూ..!

Bigg Boss Telugu 8  : ప్ర‌స్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 8 జరుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఎన్నో…

11 hours ago

Sleep : నిద్ర కూడా లివర్ ను దెబ్బతీస్తుంది అంటే నమ్ముతారా… అవునండి ఇది నిజం… పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటంటే…??

Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…

12 hours ago

This website uses cookies.