Karthika Deepam 27 May Today Episode : హిమకు షాకివ్వబోయి.. అడ్డంగా బుక్కయిన నిరుపమ్.. తనకు మరింత దగ్గరైన జ్వాల.. శోభ ప్లాన్ నిరుపమ్ కు తెలుస్తుందా?

Karthika Deepam 27 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 మే 2022, శుక్రవారం ఎపిసోడ్ 1363 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాలతో నిరుపమ్ చనువుగా ఉండటం చూసి స్వప్న, శోభ టెన్షన్ పడతారు. ప్రేమ్ కొంచెం గడుసుగా ఉంటాడు కానీ.. నిరుపమ్ మరీ మెతక. వాడి భవిష్యత్తు తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంటుంది అంటుంది స్వప్న. దీంతో ఆంటి.. నిరుపమ్ భవిష్యత్తు మొత్తం నాతోనే అని ఫిక్స్ అయిపోండి. ఎంతో ధైర్యంగా ఉండే మీరు ఇలా భయపడటం ఏంటి అంటుంది శోభ. మరోవైపు రవ్వ ఇడ్లీని కలుస్తుంది హిమ. ఎలా ఉన్నావు అని అడుగుతుంది. బాగున్నాను అంటాడు రవ్వ ఇడ్లీ. ఏంటక్కా ఈ మధ్య రావడం లేదు అని అడుగుతాడు రవ్వ ఇడ్లీ. దీంతో ఏదో పనుల మీద బిజీగా ఉన్నాను అంటుంది హిమ.

karthika deepam 27 may 2022 full episode

జ్వాల వస్తుందా నీ దగ్గరికి. కలుస్తుందా అని అడుగుతుంది హిమ. దీంతో ఏమో అక్క.. ఈ మధ్య జ్వాల రావడం లేదు. దూరం దూరం ఉంచుతోంది.. అని అంటాడు. ఇంతలో జ్వాల ఆటోలో వస్తుంది. తింగరి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటుంది జ్వాల. రవ్వ ఇడ్లీకి కొన్ని డబ్బులు ఇచ్చి తీసుకో.. ఇంకేమన్నా కావాలంటే నన్ను అడుగు అంటుంది. ఈ తింగరి ఏంటి.. రవ్వ ఇడ్లీ మీద అంత శ్రద్ధ చూపిస్తోంది. డబ్బులు కూడా ఇస్తోంది. తనకు ఎందుకు అంత శ్రద్ధ.. రవ్వ ఇడ్లీ మీద అని అనుకొని ఆటో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

కట్ చేస్తే.. ఇంద్రుడు, చంద్రమ్మ.. ఏదో కొత్త ప్లాన్ వేస్తారు. బయటికి వెళ్తారు. జ్వాల ఆటో తగులపెట్టింది స్వప్న అని అంటాడు ఇంద్రుడు. చంద్రుడు.. ఇప్పుడు కారు వస్తుందా చూస్తుండగానే పుస్సుమని టైరు పంక్చర్ అవుతుంది చూడు అంటాడు.

ఇంతలో స్వప్న కారు వచ్చి మేకుకు గుచ్చుకొని పంక్చర్ అవుతుంది. దీంతో చంద్రమ్మ షాక్ అవుతుంది. అలా ఎలా టైర్ పంక్చర్ అయింది అంటుంది. దీంతో మేకులు పెట్టాను రోడ్డు మీద అంటాడు. కరెక్ట్ టైమ్ కు టైర్ పంక్చర్ అయింది. ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది.

ఇంతలో చంద్రమ్మ.. కారు టైర్ కు పంక్చర్ వేస్తాం అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది చంద్రమ్మ. దీంతో స్వప్న.. తనను చూసి పిలుస్తుంది. టైర్ కు పంక్చర్ వేయమని చెబుతుంది. దీంతో చంద్రమ్మ కారు టైర్ మారుస్తూ ఉంటుంది. కారు టైర్ మధ్యలో మారుస్తూ నాకు డబ్బులు ఎంతిస్తారు అని అడుగుతుంది. దీంతో వందో రెండొందలో ఇస్తా అంటుంది.

Karthika Deepam 27 May Today Episode : స్వప్నను బోల్తా కొట్టించిన ఇంద్రుడు, చంద్రమ్మ

దీంతో రెండు వేలు ఇస్తేనే చేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది చంద్రమ్మ. ఇంతలో ఇంద్రుడు.. అక్కడికి వచ్చి టైర్ మారుస్తాం అంటాడు. కానీ.. తనకు 4000 ఇస్తేనే చేస్తా అంటాడు. దీంతో ఏం చేయాలో తెలియక.. సరే.. 4 వేలు ఇస్తాను.. చేయి అంటుంది స్వప్న.

మరోవైపు నిరుపమ్ ఫోటోలు చూస్తూ మురిసిపోతూ ఉంటుంది జ్వాల. డాక్టర్ సాబ్.. మన పెళ్లికి మీ అమ్మ  ఒప్పుకుంటుందా.. నాకైతే డౌటే అని అనుకుంటుంది. నేనే ఏదో ఒక ప్లాన్ చేసి ఒప్పిస్తానులే.. అని మనసులో అనుకుంటుంది జ్వాల.

ఇంతలో ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడి నేను వెళ్తున్నా అని తన పిన్నికి చెబుతుంది. సేటు ఫోన్ చేశాడు.. సామాన్లు తీసుకెళ్లాలి అంటుంది. భోజనం చేసి వెళ్లు అంటుంది చంద్రమ్మ. కానీ.. అర్జెంట్ పని ఉందని చెబుతుంది. దీంతో చంద్రమ్మ చిన్నబుచ్చుకుంటుంది.

నువ్వు నా కోసమే.. నా మీద ప్రేమతోనే చెబుతున్నావు. నాకు అర్థం అయింది. కానీ.. పనిని కాదనకూడదు కదా. తర్వాత తింటానులే అంటుంది జ్వాల. మరోవైపు హిమను కలుస్తాడు ప్రేమ్. తనను చూస్తూ అలాగే ఉండిపోతాడు. హిమ అసలు నీకు ఏమైంది. నువ్వు నిరుపమ్ తో పెళ్లి ఎందుకు వద్దన్నావు.. అని అనుకుంటాడు.

ఈరోజు ఎలాగైనా ఈ విషయం నిన్ను అడుగుతాను అని అనుకుంటాడు. ఇంతలో హిమ.. ప్రేమ్ దగ్గరికి వస్తుంది. ఏంటి బావ అంటుంది. దీంతో కూర్చో హిమ.. నీతో చాలా మాట్లాడాలి అంటాడు. దీంతో కారులో కూర్చోకుండా.. పదా అంటుంది.

జ్వాల ఆటోలో వెళ్తుంటే.. నిరుపమ్ చూస్తాడు. ఎంతైనా జ్వాల కష్టజీవి అని అనుకుంటాడు నిరుపమ్. తనను చూసి కారు ఆపి.. పిలుస్తాడు. డాక్టర్ సాబ్ మీరేంటి ఇక్కడ అంటాడు. దీంతో జ్వాల నువ్వంటే నాకిష్టం అంటాడు. దీంతో జ్వాల షాక్ అవుతుంది.

డాక్టర్ సాబ్.. నువ్వంటే అని ఏదో చెప్పబోతుంది. ఇంతలో నీ పట్టుదల అంటే ఇష్టం. నీ కష్టపడేతత్వం అంటే నాకు ఇష్టం అంటుంది. ఏమైంది అంటే.. క్లచ్ వైర్ తెగిపోయింది అంటుంది జ్వాల. దీంతో నువ్వు చాలా హార్డ్ వర్కర్ వి. నీ హార్డ్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం అంటాడు.

ఇంతలో తనకు సేట్ ఫోన్ చేస్తాడు. ఒక షాపునకు వెళ్లాలి. సామాన్లు తీసుకొని వెళ్లాలి అంటుంది జ్వాల. నేను రాను అని చెప్పు. నాతో రా అంటాడు నిరుపమ్. మాటిచ్చాను డాక్టర్ సాబ్ అంటుంది. దీంతో నాకు పని ఉంది జ్వాల.. వెళ్దాం పదా అంటాడు నిరుపమ్.

సేట్ కి మాటిచ్చాను కానీ.. అంటుంది జ్వాల. ఫోన్ లాక్కొని నేను మీ సేట్ కు చెప్తాను ఆగు అంటాడు. కానీ.. వద్దు అంటూ వారిస్తుంది జ్వాల. దీంతో వేరే ఆటో అమ్మాయికి ఫోన్ చేసి సేట్ దగ్గరికి వెళ్లమని చెబుతుంది. దీంతో నాకోసం నువ్వు ఇంకొక పని చేయాలి అంటాడు నిరుపమ్.

ఏంలేదు.. మీ తింగరికి ఫోన్ చేసి.. మనం ఎప్పుడూ కలిసే రెస్టారెంట్ కు రమ్మనవా అంటాడు. దీంతో అదేంటి డాక్టర్ సాబ్.. మీరు పిలిస్తే వస్తుంది కదా అంటుంది. నువ్వే చేయి.. సర్ ప్రైజ్ ఇద్దాం అంటాడు. దీంతో వెంటనే హిమకు ఫోన్ చేసి చెబుతుంది. తర్వాత ఇద్దరూ కలిసి కారులో వెళ్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!

Rakhi Festival :  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…

2 minutes ago

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

1 hour ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

2 hours ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

3 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

4 hours ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

5 hours ago

Guvvala Balaraju : బిజెపిలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు : రాంచందర్ రావు

Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…

6 hours ago

Zodiac Signs : ఆగ‌స్ట్‌లో ఈ రాశుల వారు జ‌ర భద్రం…ఆర్ధికంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఎక్కువ‌..!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…

7 hours ago