Karthika Deepam 27 Oct Today Episode : మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే అని ఒప్పుకున్న కార్తీక్.. సంతోషంలో మోనిత.. దీప షాక్

Karthika Deepam 27 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 అక్టోబర్ 2021, బుధవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్, సౌందర్య ఎందుకు నా వద్ద కొన్ని విషయాలు దాస్తున్నారు అని అనుకుంటుంది దీప. అందుకే వెంటనే దీప.. వారణాసితో కలిసి కారులో వెళ్తుంటుంది. చాలా సీరియస్ గా తనలో తానే మాట్లాడుకుంటుంది. అసలు.. వీళ్లు ఎందుకు తన వద్ద కొన్ని విషయాలు దాస్తున్నారు అని అనుకుంటుంది దీప. కారులో ఎటో వెళ్తూ ఉంటుంది.

karthika deepam 27 october 2021 full episode

కట్ చేస్తే మోనితకు నొప్పులు పెరుగుతాయి. కార్తీక్ కార్తీక్ అంటూ అరుస్తుంది మోనిత. కార్తీక్ వస్తున్నాడా భారతి అని అడుగుతుంది. వస్తున్నాడు అప్పటి వరకు ఈ ఇంజెక్షన్ తీసుకో అంటుంది. వద్దు కార్తీక్ రావాలి.. కార్తీక్ కు ఒక నిజం చెప్పాలి. కార్తీక్ కు నేను చచ్చిపోయేలోపు ఆ నిజం కార్తీక్ కు తెలియాలి అంటుంది మోనిత. ఆ నిజం ఏంటో నాకు చెప్పు అంటుంది భారతి. అయ్యో భారతి.. నీకు చెప్పలేను కేవలం కార్తీక్ కే చెప్పాలి పిలువు ప్లీజ్ అంటుంది మోనిత. ఆ నిజం ముందు కార్తీక్ కు తెలియాలి అంటుంది.

మరోవైపు దీప.. హిమ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొచ్చేందుకు హాస్పిటల్ కు వెళ్తుంది. మా అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాము.. రిపోర్ట్స్ వచ్చాయా? అని అడుగుతుంది. రెడీ అయ్యాయి.. ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తాను అంటుంది. ఇంతలో తనకు ఒక ఫైల్ కనిపిస్తుంది. అది చూస్తే కార్తీక్ ది. షాక్ అవుతుంది దీప. రిపోర్ట్స్ తీసుకొచ్చాక.. నీ పేరు పల్లవా అని అడుగుతుంది. బుద్ధి ఉందా నీకు.. అని అడుగుతుంది. నువ్వు అలాంటి పాడు పనులు చేసి సంపాదిస్తున్నావా? అని అడుగుతుంది. అసలు మీరు ఎందుకు సీరియస్ అవుతున్నారు అని అడుగుతుంది పల్లవి. అప్పుడే మరిచిపోయావా? మోనిత ఎవరో తెలియదా నీకు. డాక్టర్ మోనితకు శాంపిల్స్ ఇవ్వలేదు.. డబ్బులు తీసుకోలేదూ అంటుంది. మా ఆయన డాక్టర్ కార్తీక్ టెస్టుల కోసం శాంపిల్స్ ఇస్తే వాటిని దొంగచాటుగా ఇవ్వలేదు అంటూ చెబుతుంది. మేడమ్ నేను ఇవ్వలేదు అని చెబుతుంది.

ఒక్క నిమిషం ఆగండి.. శాంపిల్స్ ఇచ్చినట్టు రిపోర్ట్ లో ఉంది కానీ.. శాంపిల్స్ ఎవ్వరికీ ఇవ్వలేదు అంటుంది పల్లవి. ఆ రిపోర్ట్ కూడా ఎవ్వరూ తీసుకెళ్లలేదు. మోనిత ఎవరో కూడా మాకు తెలియదు. ఆ శాంపిల్ ఇక్కడే ఉంది.. అంటుంది. మీరు పొరపాటు పడుతున్నారు ఆ శాంపిల్స్ ఎవ్వరికీ ఇచ్చే అవకాశమే ఉండదు అని చెబుతుంది పల్లవి. కోటి రూపాయలు ఇచ్చినా మా నుంచి బయటికి శాంపిల్స్ వెళ్లవు అంటుంది.

Karthika Deepam 27 Oct Today Episode : నీ వల్లే తల్లిని అయ్యాను అని కార్తీక్ కు చెప్పిను మోనిత

దీంతో దీప అక్కడి నుంచి హిమ రిపోర్ట్స్ తీసుకొని వెళ్లిపోతుంది. ఇంతలో మోనితను చూడటానికి కార్తీక్, సౌందర్య వస్తారు. మోనిత స్పృహతప్పి ఉంటుంది. మోనిత.. కార్తీక్ వచ్చాడు లే అని చెబుతుంది భారతి. ఇదంతా నిజమేనా లేక అంతా ఉత్తుత్తి పనా అని అడుగుతాడు కార్తీక్. ఇంతలో మోనిత కళ్లు తెరుస్తుంది. నువ్వు వచ్చావా కార్తీక్ అని సంతోషిస్తుంది మోనిత. నాకు కూర్చునే ఓపిక కూడా లేదు కార్తీక్ అంటుంది మోనిత. ఇప్పటికైనా ఇంజెక్షన్ చేయించుకో అంటుంది భారతి. ముందు కార్తీక్ తో ఒకసారి మాట్లాడాలి. నేను చచ్చిపోయేలోగా ఒక నిజం చెప్పి చావాలి అంటుంది మోనిత. నా బిడ్డ కోసం ఇప్పటి దాకా నా ప్రాణాలు ఆపుకున్నాను. నేను ఇక బతకను. నాకు తెలిసిపోతోంది. కార్తీక్.. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇది ఆర్టిఫిషియల్ ఇన్ సెమ్యులేషన్ గర్భం కాదు. ఇది సహజమైన గర్భం. నీ వల్లే సహజంగా నేను తల్లిని అయ్యాను అని అంటుంది మోనిత. దీంతో అందరూ షాక్ అవుతారు. స్టాపిట్ మోనిత అంటాడు కార్తీక్. వెంటనే కొత్త నాటకానికి తెర లేపావా? కొత్త కథ చెబుతున్నావా? వెళ్దాం పదా మమ్మీ అని అంటాడు కార్తీక్.

చావబోయే ముందు కొత్త అబద్ధాలు ఎందుకు చెబుతాను కార్తీక్ అంటుంది. నేను నిజమే చెబుతున్నాను అంటుంది. కార్తీక్ ఇన్ని రోజులు నేను అబద్ధాలు చెప్పే ఉండొచ్చు. ఏదేదో ప్లాన్స్ చేసి ఉండొచ్చు కానీ.. ఇది నిజం. నా మీద ఒట్టు. నేను ఇష్టపడే నీమీద ఒట్టు. పుట్టబోయే మన బాబు మీద ఒట్టు.. అంటుంది మోనిత. కార్తీక్.. పురిటినొప్పులను భరించడమే సాధ్యం కాదు కానీ.. ఈ నిజం నీకు చెప్పాలని నొప్పులను ఆపుకున్నాను. ఈ నిజం నీకు తెలియకపోతే.. నా బిడ్డ అనాథలా ఉంటుందని ఈ నిజం చెబుతున్నాను కార్తీక్ అంటుంది మోనిత.

ఆంటి దయచేసి నా మాట వినండి. సాటి స్త్రీగా నా ఆవేదన అర్థం చేసుకోండి. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు అంటుంది. పురిటినొప్పులను ఆపుకుంటూ కార్తీక్ కు నిజం చెప్పి చావాలని చూస్తున్నాను. ఆంటి చచ్చిపోయేముందు ఎవరైనా అబద్ధాలు చెబుతారా? కావాలంటే కార్తీక్ శాంపిల్ ఇచ్చిన ల్యాబ్ కు వెళ్లి తెలుసుకోండి. అక్కడికి నేను వెళ్లనేలేదు.. అని అంటుంది మోనిత. మరి ఇన్నాళ్లు ఆర్టిఫిషియల్ ఇన్ సెమ్యులేషన్ అని ఎందుకు చెప్పావు అని కార్తీక్ అడిగితే.. అది నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి అని చెబుతుంది. పెళ్లి కాకుండా నీ వల్ల గర్భం వచ్చిందంటే నువ్వు కాదంటే సమాజం దృష్టిలో నేను పతితలా మారుతాను కార్తీక్. నన్నందరూ చెడిపోయింది అంటారు. నాకు పుట్టిన వాళ్లను రకరకాల పేర్లతో పిలుస్తారు. అన్ని బాగున్న దీపను అనుమానించి 11 ఏళ్లు దూరం పెట్టావు. ఇక నన్ను చేరదీయడానికి ఇంక ఎన్ని సంవత్సరాలు పడుతుందన్న భయంతోనే ఇన్నాళ్లు దాచాను కార్తీక్ అంటుంది మోనిత.

karthika deepam 27 october 2021 full episode

ఒకరోజు నువ్వు బాగా తాగి ఉన్నావు.. అనుకోకుండా అలా జరిగిపోయింది కార్తీక్ అంటుంది. షట్ అప్ మోనిత.. అని చెప్పి మమ్మీ ఏంటి ఈ దరిద్రం వెళ్దాం పదా అంటాడు కార్తీక్. పాపం చచ్చిపోతుంది కార్తీక్ అంటుంది భారతి. చావనీ నాకేంటి.. రోజుకు ఎందరో చస్తుంటారు.. అందులో ఇది ఒకతి అనుకుంటాను అంటాడు కార్తీక్.

నువ్వు ఎన్ని టెస్టులు అయినా చేయించుకో. ఈ బిడ్డ మన బిడ్డ. సహజంగా పుట్టబోయే బిడ్డ అంటుంది మోనిత. తను ఎక్కువ సేపు బతకదు అని చెప్పినా కూడా నాకు ఏ అవసరం లేదు భారతి అంటాడు కార్తీక్. నేను చస్తేనే నువ్వు నిజం నమ్ముతావు అంటే నేను చచ్చిపోతాను కానీ.. నా బిడ్డను మాత్రం అనాథగా వదిలేయకు.. నా మాట నమ్ము కార్తీక్. ఇది సహజమైన గర్భం. నా ప్రేమ మీద ఒట్టు అని చెప్పి మోనిత స్పృహ కోల్పోతుంది.

దీంతో వెంటనే పేపర్స్ మీద కార్తీక్ సైన్ చేస్తాడు. వెంటనే ఆపరేషన్ చేస్తారు. మోనితకు పండంటి కొడుకు పుడతాడు. ఈ విషయం తెలుసుకున్న దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

 

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

4 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

4 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

6 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

7 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

8 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

9 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

10 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

10 hours ago