
Karthika Deepam 27 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 అక్టోబర్ 2022, గురువారం ఎపిసోడ్ 1494 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలాగైనా శౌర్యను పట్టుకోవాలని వాళ్లు ఇదివరకు బొమ్మలు అమ్మిన ప్లేస్ కు వస్తాడు కార్తీక్. దీప కూడా అక్కడికే వస్తుంది. అయితే.. జ్వాల కోసం వస్తువులు తీసుకురావాలి ఎలా అని అనుకొని ఒకరి దగ్గర పర్సును కొట్టేయబోతుండగా దీప చూసి ఆపుతుంది. నీ కోసమే నేను వెతుకుతున్నా అంటుంది. నాకోసం ఎందుకు అంటాడు ఇంద్రుడు. ఒకసారి ఇతడి ఆటోలో వెళ్తూనే పాపను చూస్తున్నాను అంటుంది దీప. ఇప్పుడు పాప ఎక్కడుంది అని అడుగుతుంది దీప. దీంతో పెద్దమనిషి అయింది. రేపు స్నానం చేయిస్తున్నాం అంటాడు ఇంద్రుడు. నేను ఆటో తోలుకుంటే వచ్చేది కేవలం బతకడానికే సరిపోతుంది. రేపు పాపకు ఫంక్షన్ చేయాలంటే డబ్బులు లేవు. అందుకే నేను ఈ దొంగతనం చేయాలనుకున్నాను అంటాడు ఇంద్రుడు.
karthika deepam 27 october 2022 full episode
ఏంటి డాక్టర్ బాబు ఈ పరిస్థితి. పాప పెద్దమనిషి అయిందని సంతోషించాలా.. లేక ఈ పరిస్థితి గురించి బాధపడాలా అంటుంది దీప. నా గురించి ఎందుకండి బాధపడటం అంటాడు ఇంద్రుడు. దీంతో నీ గురించి కాదు.. పాప గురించి అంటాడు కార్తీక్. తనతో పాటు తీసుకెళ్తాడు కార్తీక్. మరోవైపు కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. అసలు కార్తీక్ కు నిజంగానే ప్రియమణి కలిసిందా? ప్రియమణి ఎందుకు కార్తీక్ కు కలిసింది. నా గురించి మాత్రమే చెప్పి.. దీప గురించి కూడా చెప్పేసరికి వెళ్లిపోవాల్సి వచ్చిందా అని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి వీణ వస్తుంది. నువ్వా.. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటుంది మోనిత. నువ్వు తొందరగా ఏదో ఒకటి చేయి.. వెళ్లు. ఆ దుర్గా గాడు చూసినా నాకు ప్రాబ్లమే.. అంటుంది వీణ. ఇందాక రోడ్డు మీద పోలీసులను చూసి దాక్కున్నాడు. పోలీసులకు ఒక్క ఫోన్ చేస్తే వాడు అరెస్ట్ అవుతాడు కదా. ఎందుకు ఆ పని చేయడం లేదు అంటుంది వీణ. ఆ పని కూడా అయిపోయింది అని అంటుంది.
కట్ చేస్తే పాపను చూడటానికి మేము కూడా వస్తామని ఇంద్రుడుకు కార్తీక్, దీప చెబుతారు. అలాగే.. జ్వాల కోసం బట్టలు, నగలు కూడా కొంటారు కార్తీక్, దీప. కానీ.. వాళ్లను ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరిస్తాడు ఇంద్రుడు. ఎంత చెప్పనా అస్సలూ వద్దంటాడు. చివరకు ఫోటోలు చూపించమన్నా చూపించడు.
ఫోన్ లోని ఫోటోలు కూడా డిలీట్ చేస్తాడు ఇంద్రుడు. పాప కోసం బట్టలు, నగలు కొన్నారు కానీ.. ఈరోజు మాత్రం రాకండి. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. ఈరోజు వద్దు. రేపు రండి అంటాడు ఇంద్రుడు. ఆ పాప నిన్ను చూడాలని ఈరోజులు కోరింది. ఇన్ని రోజులు కుదర్లేదు. ఈ ఒక్క రోజు ఆగు రేపు చూద్దువు గానీ అంటాడు కార్తీక్.
రేపు పొద్దున్నే ఇక్కడికి వస్తాం. నువ్వు వచ్చి తీసుకెళ్లు అంటుంది దీప. దీంతో సరే అంటాడు ఇంద్రుడు. మరోవైపు శౌర్య తన అమ్మానాన్నను గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. నీ కిష్టం అని అన్నీ బాబాయి తెచ్చాడు తిను అంటుంది చంద్రమ్మ. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే కూర్చోవాలి అంటుంది శౌర్య.
త్వరగా బయటికి వెళ్లాలి పిన్ని. అమ్మానాన్నలను వెతకాలి అంటుంది శౌర్య. అమ్మ గుర్తుకొస్తుంది పిన్ని. ఇప్పుడు అమ్మ నా పక్కనే ఉంటే ఎంత బాగుండు అనిపిస్తోంది అంటుంది శౌర్య. ఏడవద్దు. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి అంటుంది చంద్రమ్మ.
అమ్మ ఎక్కడున్నా నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ దీవెనలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి అంటుంది చంద్రమ్మ. ఈ పసిబిడ్డకు ఎంత కష్టం ఇచ్చావు తండ్రి అని భగవంతుడిని అంటుంది చంద్రమ్మ. రేపు నీకు స్నానం చేయించి 10 మందిని పిలిచి భోజనాలు పెట్టిస్తాం. ఉన్నంతలో బాగానే చేస్తాం. సరేనా తల్లి అంటుంది చంద్రమ్మ.
నాకు కావాల్సింది వేడుక కాదు.. మా అమ్మ. నన్ను ఇలా చూసి అమ్మ సంతోషిస్తుంది కదా. ఆ సంతోషం చూడాలి నేను అనుకుంటుంది శౌర్య. మరోవైపు ఇంద్రుడు బాధపడుతూనే ఇంటికి వస్తాడు. మరోవైపు రేపు ఉదయం కల్లా దీప, దుర్గ ఇద్దరినీ చంపేయాలని వాణితో చెబుతుంది మోనిత.
దీంతో సరే మేడమ్ అని చెప్పి దీప, దుర్గ పడుకున్నాక వాళ్లు ఉంటున్న ఇంటికి నిప్పు అంటిస్తుంది వాణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.