
karthika deepam 27 september 2022 full episode
Karthika Deepam 27 Sep Today Episode : కార్తీక దీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1468 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత కార్ డిక్కీలో ద శౌర్య దాక్కుంటుంది, మోనిత కారు ఆపి దిగి వెళ్ళిపోతూ ఉండగా.. కారు డిక్కీ లోంచి సౌర్య బయటకు వస్తుంది. అప్పుడు సౌర్యని చూసిన మౌనిత ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు సౌర్యను ఏంటమ్మా నువ్వు ఇక్కడ కార్ డిక్కీలో ఎందుకు దాక్కున్నావ్ అని అడుగుతుంది. అప్పుడు శౌర్య మీ కారు అనే తెలియదు ఆంటీ. అయినా మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు మౌనిత బాధపడుతూ మీ అమ్మానాన్న జ్ఞాపకాలను వదలేక ఇక్కడే ఉన్నాను అని చెప్తుంది. అప్పుడు సౌర్య నేను కూడా వాళ్ళని వదలేక వాళ్ళు బ్రతికే ఉన్నారని నేను వాళ్ళని వెతుకుతూ ఉన్నాను ఆంటీ అని చెప్తుంది. అప్పుడు మౌనిత వాళ్లు లేరమ్మ నా చేతుల మీదగా వాళ్ళని దహన సంస్కారాలు చేయించాను అని చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సౌర్య లేదంటే వాళ్ళు బ్రతికే ఉన్నారు అని ఒక్కసారిగా కుప్ప కూలీ పోయి ఏడుస్తూ ఉంటుంది.
అప్పుడు మౌనిత శౌర్యకి సర్ది చెప్పి మీ నాయనమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అంటుంది. అప్పుడు శౌర్య తను చెప్పిన మాటలు నమ్ముతుంది. ఇక దాంతో మౌనిత శౌర్యని తీసుకొని వెళుతుంది. కట్ చేస్తే కార్తీక్ డ్రామా కోసం ఎదురు చూస్తూ ఉండగా… కార్తీకదీపం టైటిల్ గురించి మాట్లాడుతూ ఇది ఒక్క నిజమైన భార్యాభర్తల కథ అంట అని అంటూ ఉండగా.. ఒక్కసారిగా కార్తీక్ లేచి వంటలక్క దగ్గరికి వెళ్లి ఆ టైటిల్ ఏంటి నేను కార్తీక్.. నువ్వు దీప.. మనిద్దరం భార్యాభర్తలమా అని తెలియజేస్తున్నావా. అని తనపై కోప్పడుతూ ఉండగా.. డాక్టర్ ఆగండి సార్ తన భర్త పేరు కూడా కార్తికే అందుకే కార్తీకదీపం అనే టైటిల్ పెట్టింది. అయిన కాసేపు ఆగితే మీకే అర్థమవుతుంది. ఆవిడ భర్త ఎవరు అని అంటూ ఉంటాడు. అప్పుడు సరే అని కార్తీక్ వెళ్లి అక్కడ కూర్చుంటాడు. కట్ చేస్తే సౌందర్య ఆనందరావు, హిమను తీసుకుని వస్తూ.. హిమ ముందు రెస్టారెంట్ ఉంది అక్కడ ఆపుతాను ఏం కావాలో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు హిమ శౌర్య ఇక రాదు అని నాకు అర్థమైంది అని అంటూ ఉంటుంది.
karthika deepam 27 september 2022 full episode
అప్పుడు సౌందర్య సౌర్యని తీసుకొచ్చే బాధ్యత నాది నువ్వు దాని గురించి మర్చిపో అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే దీప నాటకం మొదలవుతుంది. తన జీవితం ఎక్కడ మొదలైందో అక్కడినుంచి మొదలు పెడుతుంది. ఇక కార్తీక్ పెళ్లి చేసుకుంటాడు. వాళ్లు హనీమూన్ కి వెళ్తారు. అక్కడ రచయిత పరిచయం అవుతాడు. అలా రచయిత గురించి మౌనిత లేనిపోనివి అన్ని చెప్పి తన ప్రెగ్నెంట్ కి కారణం రచయితే అని నమ్మేలా చేస్తుంది. అప్పుడు కార్తీక్ కూడా నమ్మి తన ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని గట్టిగా చెప్తూ ఉంటాడు. అప్పుడు తన కూడా కార్తీక్ ని చీ కొట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో దీప వెళ్ళిపోతూ ఉండగా.. ఒక్కసారిగా కార్తీకి గతమంతా గుర్తుకొస్తుంది. అప్పుడు ఆగు దీప అని ఒక్కసారిగా లేచి స్టేజ్ దగ్గరికి వెళ్లి కళ్ళు తిరిగి కిందపడిపోతాడు. తర్వాత కార్తీక్ ని ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా… అక్కడికి మౌనిత కూడా వస్తుంది. ఇక కార్తీక్ స్పృహలో నుంచి బయటికి వచ్చి దీప అని అంటూ ఉంటాడు. అప్పుడు దీప సంతోష పడిపోతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.