Karthika Deepam 28 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 జనవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 1261 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రుద్రాణిని ఎవరో చెంపదెబ్బ కొట్టారని చెప్పాను కదా.. ఆరోజే నేను కూడా అత్తయ్య మామయ్యను చూశాను. వాళ్లను చూశాక నోట మాట రాలేదు. గుండె ఆగిపోయినంత పని అయింది. వెళ్లలేను.. ఉండలేను.. మీకు చెప్పలేను.. నిజం దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేస్తున్నానేమో అని నేను బాధపడ్డాను. చెప్తే మీరు బాధపడతారేమోనని నేను ఆగాను.. అంటుంది దీప. నువ్వు కూడా నాలాగే ఆలోచించావా దీప.. అయితే నేను చేసింది తప్పు కాదన్న మాట. నా మనసు ఇప్పుడు శాంతించింది. నువ్వు దాచడంలో న్యాయం ఉందంటే.. నేను చేసింది తప్పు కాదని కొంచెం మనసు శాంతించింది. దీప.. మమ్మీ డాడీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటావు. డాడీకి ఏమైంది. ఎందరికో ట్రీట్ మెంట్ చేసిన నేను.. డాడీకి హెల్త్ బాగోలేకపోతే ఏం చేయలేకపోతున్నాను చూడు అంటాడు కార్తీక్.
ప్రస్తుతం వాళ్లు క్షేమంగా ఉండాలని కోరుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేం కదండి అంటుంది దీప. రుద్రాణి అప్పు తీర్చకుండా మనం ఏం చేయలేం. ఈ ఊరు వదిలి వెళ్లలేం. మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నా మనం ఏం చేయలేం అంటాడు కార్తీక్. మరోవైపు డాక్టర్ బాబు అని పిలవడం స్టార్ట్ చేస్తుంది దీప. ఉదయం లేవగానే పిల్లలు స్కిప్పింగ్ ఏదైనా ఆట ఆడుకుందాం అనుకుంటారు. ఈరోజు స్కూల్ లేదు కదా.. అందుకే స్కిప్పింగ్ ఆడుదామని చెప్పి శౌర్య చెబుతుంది. కానీ.. స్కిప్పింగ్ కోసం ఎలా తాడు లేదు కదా అని అనుకుంటారు. తాడు కోసం వెతుకుతుంటారు. ఇంతలో కార్తీక్ వచ్చి ఏమైంది అని అడుగుతాడు. దీంతో స్కిప్పింగ్ కోసం తాడు దొరకడం లేదు అంటారు.
దీంతో లోపలికి వెళ్లి ఒక తాడు తీసుకొచ్చి స్కిప్పింగ్ రోప్ లా సెట్ చేసి వాళ్లకు ఇస్తాడు కార్తీక్. దీంతో ఆ తాడుతో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. శౌర్య.. వేగంగా స్కిప్పింగ్ చేస్తూ ఉంటుంది. తనకు శ్వాస ఆడదు. అయినా కూడా తను అలాగే స్కిప్పింగ్ చేస్తూ ఉంటుంది. హిమకు భయం అవుతూ ఉంటుంది.
ఇంతలో శౌర్య.. స్కిప్పింగ్ చేస్తూ కుప్పకూలిపోతుంది. శౌర్య.. ఏమైంది అని అడుగుతుంది హిమ. డాడీ అని పిలుస్తుంది హిమ. ఇంతలో కార్తీక్, దీప ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి రౌడీని ఇంట్లోకి తీసుకొస్తారు. శ్వాస తీసుకోవడంలో శౌర్యకు చాలా ఇబ్బంది అవుతుంటుంది.
దీంతో తన గుండె మీద నొక్కుతుంటాడు కార్తీక్. తనకు శ్వాస అందిస్తూ ఉంటాడు. దీంతో తనకు తిరిగి శ్వాస వస్తుంది. శౌర్యకు చిన్నప్పుడు గుండెకు హోల్ ఉంటే ఆపరేషన్ చేస్తాడు కార్తీక్. ఇప్పుడు అది తిరగబడిందా అని అనుకుంటాడు కార్తీక్.
వెంటనే శౌర్యను క్లీనిక్ కు తీసుకెళ్లాలి అంటాడు కార్తీక్. ఇంతలో దీప తన దగ్గర ఉన్న 50 రూపాయలను తీసుకొస్తుంది. రౌడీకి గాలి బాగా ఆడేలా చూడండి. నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కార్తీక్ బయటికి వెళ్తాడు. పాత గుండె జబ్బు మళ్లీ అత్తమ్మకు తిరగబెట్టిందా అని అనుకుంటుంది దీప.
కట్ చేస్తే రేయ్ పిల్లిగడ్డం.. దస్తావేజుల మీద సంతకం పెట్టించుకోగానే సరిపోదురా.. అప్పు తీర్చుకునే తెలివి కూడా ఉండాలి. వాళ్లు అప్పు ఎలాగూ తీర్చరు.. కనీసం వడ్డీ అయినా కడతారా అని ఇబ్బంది పెడుదామనుకుంటే.. వడ్డీ కూడా ఇచ్చారు అని అంటుంది.
వాళ్లు అప్పు తీర్చకూడదు. వెళ్లి ఆ సార్ ను పట్టుకురండి.. అని అంటుంది రుద్రాణి. మరోవైపు కార్తీక్.. వేగంగా సైకిల్ తొక్కుతూ వెళ్తుంటాడు. నేను డాక్టర్ ను.. డాక్టర్ కార్తీక్ ను.. నా రౌడీని నేను రక్షించుకుంటాను అని అనుకుంటూ సైకిల్ మీద వెళ్తుంటాడు కార్తీక్.
నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కదా.. ఇప్పుడెలా.. ఆశ్రమం వెళ్తా. మమ్మీని అడుగుతాను అని ఆశ్రమం వైపు వెళ్లబోతాడు కార్తీక్. ఆశ్రమానికి వెళ్తాడు. ఇంతలో అక్కడి వాళ్లు ఆపుతారు. ఆగండి అంటారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్దవాళ్లను కలవాలండి అంటాడు.
నేను వాళ్ల అబ్బాయిని అంటాడు. కానీ.. ఆశ్రమం నిర్వాహకుడు మాత్రం అవేమీ నమ్మడు. వెళ్లండి ఇక్కడి నుంచి. మీ కట్టుకథలు వినేవాళ్లు ఎవరూ లేరిక్కడ అని అంటాడు. దీంతో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. వాళ్లు ఇక్కడ లేరు.. ఎక్కడికో వెళ్లిపోయారు అని చెబుతాడు.
మరోవైపు శౌర్యకు స్పృహ వస్తుంది. నాన్న ఏరమ్మా.. నాన్నను రమ్మను అమ్మ. నాన్న డాక్టరే కదా అమ్మ. ఎక్కడికి వెళ్లారు అంటుంది. అత్తమ్మ నాన్న వచ్చేస్తారు. నీకేం కాదు.. అంటుంది దీప. చిన్న సమస్యే అంటుంది దీప. కానీ.. చిన్నది కాదు.. పెద్ద సమస్యే అంటుంది శౌర్య.
నేను మళ్లీ లేచి నడుస్తానా అమ్మ. తమ్ముడితో ఆడుకుంటానా అంటుంది శౌర్య. అత్తమ్మ నీకు ఏం కాదు. నీకు నేనున్నాను కదా అంటుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.