Home » Entertainment » Karthika Deepam 28 May 2022 Full Episode
Entertainment

Karthika Deepam 28 May Today Episode : నిరుపమ్, జ్వాలను విడదీసేందుకు శోభ ప్లాన్.. ఈ విషయం హిమకు తెలిసి షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Updated on: May 28, 2022, 10:42 am
Advertisement

Karthika Deepam 28 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 మే 2022, శనివారం ఎపిసోడ్ 1364 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు ఎంగేజ్ మెంట్ ఎందుకు వద్దనుకున్నావో ఇప్పటికైనా చెబుతావా అని అడుగుతాడు ప్రేమ్. దీంతో బావ.. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అంటుంది హిమ. అసలు నీ మనసులో ఏముంది. ఎందుకు వద్దంటున్నావు అని అడుగుతాడు. దీంతో తనకు దండం పెడుతుంది. ఇకపై ఈ విషయం గురించి నన్నేమీ అడగొద్దు అంటుంది హిమ. దీంతో ఇదేమన్నా చిన్న విషయమా అంటాడు ప్రేమ్. ఎంగేజ్ మెంట్ వరకు వచ్చి కాదన్నావు అంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా అని అంటాడు ప్రేమ్. దీంతో ఇది నువ్వే అడుగుతున్నావా.. లేక నానమ్మ అడిగిస్తోందా.. ఎవరు అడిగినా నేను ఇదే సమాధానం చెబుతాను. నన్నేమీ అడగొద్దు. ఈ విషయంలో నేను ఇంకేమీ మాట్లాడలేను అని చెప్పి హిమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

karthika deepam 28 may 2022 full episode

మరోవైపు శాంతాబాయిని ఇల్లు ఖాళీ చేసి ఒక ఏరియాకు పంపిస్తుంది శోభ. నువ్వు అక్కడే ఉంటావు. ఏం చేయాలని మాత్రం నన్ను అడగకు. ఏం చేయాలో నేను చెబుతాను. నువ్వు వెళ్లు. మిగిలిన వివరాలు తర్వాత చెబుతా అని కొన్ని డబ్బులు ఇచ్చి పంపిస్తుంది శోభ. మై డియర్ ఆటో జ్వాల. ఇప్పుడు నేను వేసే అడుగు నువ్వు నువ్వు ఊహించలేవు. నిరుపమ్, నీ మధ్య పెద్ద అడ్డుగోడ కడతాను అంటుంది శోభ. తర్వాత నిరుపమ్, జ్వాల ఇద్దరూ కేఫ్ లో ఉంటారు. హిమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో హిమ అక్కడికి వచ్చి.. వాళ్లను చూసి షాక్ అవుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా నేను ఎందుక మధ్యలో అనుకుంటుంది కానీ.. ఇద్దరిని ఎలాగైనా కలపాలి అని అనుకుంటుంది హిమ.

Advertisement

Karthika Deepam 28 May Today Episode : కావాలని జ్వాలతో కోపంగా మాట్లాడిన హిమ

నిరుపమ్, జ్వాల మాట్లాడుతుండగా.. కావాలని వాళ్లతో రాష్ గా మాట్లాడుతుంది హిమ. మరోవైపు ప్రేమ్ కు ఏం చేయాలో అర్థం కాదు. హిమ.. ఏం సమాధానం చెప్పడం లేదని బాధపడతాడు. తన ఫోటో చూస్తూ బాధపడతాడు. తర్వాత కేఫ్ లో నిరుపమ్, జ్వాల, హిమ ముగ్గురూ తింటూ ఉంటారు. హిమ మాత్రం ఏం మాట్లాడదు.

దీంతో ఇంకా రెచ్చిపోయిన నిరుపమ్.. జ్వాలను ఇంకా మెచ్చుకుంటాడు. దీంతో హిమకు అర్థం అవుతుంది. నన్ను ఏడిపించాలని.. శౌర్యను పొగుడుతున్నావు కదా అని అనుకుంటుంది. నువ్వు నీ మనసులో ఏం ఉన్నా చెబుతావు.. కానీ కొందరు మాత్రం మనసులో ఏం ఉందో అది బయటికి చెప్పరు అంటూ హిమను ఉద్దేశించి జ్వాలతో చెబుతాడు నిరుపమ్.

Advertisement

నిరుపమ్.. తన మీద కోపం చూపిస్తున్నాడని అర్థం చేసుకుంటుంది హిమ. కానీ.. దీన్ని నేను నిజం చేస్తాను అని అనుకుంటుంది హిమ. అయితే.. డాక్టర్ సాబ్ కు తన మీద ఉన్న ప్రేమను చెబుతానంటే వద్దు అంటూ వారిస్తుంది. అదే విషయం హిమకు చెబుతుంది జ్వాల.

అప్పుడే వాష్ రూమ్ వెళ్లి వచ్చిన నిరుపమ్ వాళ్ల మాటలను వింటాడు కానీ.. సరిగ్గా తనకు వినపడదు. మరోవైపు ఆనందరావు, సౌందర్య.. ఇద్దరూ హిమ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. మన ఆనందాలను హిమ దూరం చేసింది అని అనుకుంటారు.

ఇంతలో హిమ వస్తుంది. తనకు వేరే సంబంధం చూస్తామని.. శౌర్య వచ్చినా రాకున్నా నీకు ఈ పెళ్లి చేస్తామని సౌందర్య చెబుతుంది. దీంతో హిమకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి