Karthika deepam 29 december 2021 full episode
Karthika Deepam 29 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 డిసెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 1235 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియో చూపించి మోనితకు అసలు నిజం తెలిసేలా చేస్తుంది సౌందర్య. నీ బిడ్డను ఎవరు ఎత్తుకెళ్లారో చూడు.. అని వీడియో చూపించే సరికి. షాక్ అవుతుంది మోనిత. ఇంకో సారి నా గడప తొక్కకు అంటూ సీరియస్ అవుతుంది సౌందర్య. నా కొడుకు కిడ్నాప్ విషయంలో మీ తప్పు లేదని తెలిసింది. నానమ్మ హోదాలో వాడిని ఎవరు ఎత్తుకెళ్లారో మీరు కనిపెట్టడం బాగుంది.. అంటుంది మోనిత. కానీ.. ఇంట్లో అడుగు పెట్టొద్దు అనడమే బాగోలేదు. ఎలాగైనా నా కొడుకును, కార్తీక్ ను వెతికి పట్టుకొని ఈ ఇంట్లో అడుగు పెడతా అని నర్సమ్మతో పాటు ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది మోనిత.
Karthika deepam 29 december 2021 full episode
మరోవైపు శ్రీవల్లి కొడుకు నామకరణం జరుగుతూ ఉంటుంది. అబ్బాయి పేరు ఏం పెట్టాలనుకుంటున్నారు అంటూ అడుగుతాడు పంతులు. దీంతో ఆనంద్ అని కోటేశ్ అనే లోపే రంగరాజు అని అంటుంది రుద్రాణి. అప్పుడే అక్కడికి రుద్రాణి వస్తుంది. ఈ బిడ్డకు పేరు నేనే పెడుతా… అలాగే దత్తత కూడా తీసుకుంటున్నాను అని శ్రీవల్లి దగ్గర్నుంచి బిడ్డను లాక్కుంటుంది రుద్రాణి. దీంతో ఏంటి నువ్వు చేస్తున్న పని అని కార్తీక్, దీప తనపై సీరియస్ అవుతారు. అవును.. నేను ఆ బిడ్డను దత్తత తీసుకుంటున్నాను. ఇక నుంచి బిడ్డ నాదగ్గర పెరుగుతాడు.. అంటుంది. నీ అప్పు తీరుస్తా అని సంతకం పెట్టా కదా మళ్లీ ఇదంతా ఏంటి అని అడుగుతాడు కార్తీక్. కార్తీక్ దగ్గరికి వెళ్లి ఒప్పందం ప్రకారం నీ కూతురును తీసుకెళ్లాలి.. మరి తీసుకెళ్లనా అంటుంది రుద్రాణి. దీంతో కార్తీక్ సైలెంట్ అయిపోతాడు. మీ అప్పు కూడా రద్దు చేస్తున్నాను. ఇక నుంచి వీడు నా బిడ్డ అని చెప్పి బిడ్డను అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది రుద్రాణి. శ్రీవల్లి, కోటేశ్ తన కాళ్లు పట్టుకున్నా రుద్రాణి వినదు.
కట్ చేస్తే సౌందర్య కాస్త రిలీఫ్ గా ఉంటుంది. మోనిత బిడ్డ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది కదా. అందుకే ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉంది అంటుంది. రత్నసీత చాలా సాయం చేసింది అంటుంది సౌందర్య. ఇదే రత్నసీత సాయంతో అన్నయ్యను కూడా కనిపెట్టాలి అంటాడు ఆదిత్య.
శ్రీవల్లి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా వినదు. ఎన్నో కాన్పులు పోతుంటే దేవుడు ఇచ్చిన బిడ్డ అక్క వాడు. వాడిని కూడా తీసుకెళ్తే ఇక నేను ఏం చేయాలి.. అని అంటుంది శ్రీవల్లి. నా ఇల్లు లాక్కున్నా నేను బాధపడలేదు అక్క. కానీ.. నా ప్రేమను, నా కలలను తీసుకెళ్లింది. నేను ఏం చేయాలి ఇప్పుడు అంటుంది శ్రీవల్లి.
పదండి పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిందంతా చెప్పేద్దాం.. అంటుంది శ్రీవల్లి. దీంతో ఏం మాట్లాడుతున్నావు శ్రీవల్లి. మనం ఇస్తే వాళ్లు తీసుకుంటారా? తనతో పోటీ పడగలమా అంటాడు కోటేశ్. ఎవరు అడ్డు వచ్చినా ఈరోజు వదిలేది లేదు అంటుంది శ్రీవల్లి. దీప చెప్పినా కూడా వినదు.
దీంతో మనం కూడా శ్రీవల్లితో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్దాం పదండి అంటుంది దీప కార్తీక్ తో. దీంతో అక్కా మీరు వద్దు లేండి.. మీరు పోలీస్ స్టేషన్ కు రాకండి అంటుంది దీప. నేను వెళ్తున్నాను.. నీకు ఓపిక ఉంటే రా.. లేకపోతే రాకు. నేను మాత్రం వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది శ్రీవల్లి.
అవును.. ఇందాక రుద్రాణి ఏంటి మీతో ఏదో మాట్లాడుతోంది అని అడుగుతుంది దీప. దీంతో ఏం లేదు.. కొంచెం తలనొప్పిగా ఉంది.. కాఫీ ఇస్తావా అని అడుగుతాడు కార్తీక్. మరోవైపు మోనిత.. కోటేశ్ ఫోటో చూసి.. వీడెవడు నా బాబును ఎత్తుకెళ్లాడు. వీడు ఎక్కడ దొరుకుతాడు. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ ఫోటోను పంపించాను.. అని అనుకుంటుంది మోనిత.
మరోవైపు వారణాసికి జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళ్తున్నా అని బస్తీ జనంతో అంటాడు. ఇక్కడే చూపించుకోవచ్చు కదా అంటాడు. దీంతో ఇక్కడా.. ఈ ఆసుపత్రిలోనా నేను అస్సలు చూపించుకోనుపో అంటాడు. ఏంటి మేడమ్ ఎవ్వరూ ఈ ఆసుపత్రికి రావడం లేదు అంటుంది నర్సమ్మ. నీకు ఎలుకా, బోను సంగతి తెలుసు కదా. ఎలుక ఎలా.. బోనులో పడుతుందో.. మన ఆసుపత్రికి వాళ్లు కూడా ఖచ్చితంగా వస్తారు అంటుంది మోనిత.
తర్వాత రుద్రాణి మనుషులను అనవసరంగా కొట్టాను అని కార్తీక్ బాధపడతాడు. దీపతో అదే విషయం చెబుతాడు. అలా అంటే.. నేను రుద్రాణినే కొట్టాను కదా. ఆ క్షణంలో అది అలా జరిగిపోయింది. అవన్నీ వదిలేయండి స్వామీ అంటుంది దీప.
రుద్రాణి దగ్గరికి ఒకసారి వెళ్లి వస్తాను అంటాడు కార్తీక్. దీంతో దీప షాక్ అవుతుంది. రిస్క్ అయినా పర్వాలేదు నేను పోలీస్ స్టేషన్ కు వెళ్తాను. కోటేశ్, శ్రీవల్లిక అండగా ఉంటాను.. అని చెప్పి కార్తీక్ పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. ఇంతలో రత్నసీత.. కార్తీక్ ఫోన్ తీసుకున్న మహేశ్ ను సౌందర్య దగ్గరికి తీసుకొస్తుంది.. మహేశ్ జరిగిన విషయం మొత్తం చెబుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.