Karthika Deepam 29 July Today Episode : శోభ, స్వప్న ఏం ప్లాన్ చేస్తారు.. సౌర్యకు ఏమవుతుంది.?

Advertisement
Advertisement

Karthika Deepam 29 July Today Episode : కార్తిక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదల అయింది. 29 శుక్రవారం ఎపిసోడ్ 1417 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. సౌర్య, స్వప్న అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. బాగా తలనొప్పిగా ఉంది అంటుంది. అప్పుడు హిమ అది చూసి.. జండుబాం తీసుకొని వచ్చి తనకి మసాజ్ చేస్తుంది.. శౌర్య ఏంటి నానమ్మ నీతో సేవలు చేయించుకోవాల్సి వస్తుందా. నాయనమ్మ అని అంటుంది. తనకు జండుబాం పెట్టేది వాళ్ళ నాయనమ్మ అని అనుకుంటుంది. వద్దులే నాయనమ్మ అని తన చెయ్యి పట్టుకోగానే తను హిమ అని తెలిసి.. ఏంటి నువ్వు నాకు జండుబాం పెడుతున్నావు.. అని అని తిడుతుంది శౌర్య, హిమను నేను పెట్టకపోతే డాక్టర్ సాబ్ ని పంపించిన.. అని అంటుంది. శౌర్య తనని ఇకనుంచి వెళ్లవే అని బయటికి నెట్టేస్తుంది. హిమ గురించి ఆలోచిస్తూ ఉంది ఎప్పుడు ఏడుపు మొహంతో ఉండేది. ఈరోజు తెగ సంతోషం పడిపోతుంది ఏంటి.? అని ఆలోచిస్తూ మళ్లీ ఏదైనా కొత్త ప్లాన్ వేస్తుందా అని అనుకుంటుంది. కట్ చేస్తే ఆనందరావు సౌర్య ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు..

Advertisement

ఇంత చిన్న వయసులో నీకు ఇన్ని తెలివితేటలు ఏంటి వేదాంతం మాట్లాడుతున్నావ్.. అని అంటాడు ఆనందరావు. సౌర్యను సరదాగా జాగింగ్ వెళ్ళొద్దాం పదమ్మ అని అంటాడు. కానీ నేను రాను తాతయ్య అది తిన్నది అరక్క పొట్ట కరగక చేసే చేస్తారు.. నేను రాను అని అంటుంది. అది కాదమ్మా అలా జాగింగ్ చేస్తే ఆరోగ్యానికి మనసుకి చాలా మంచిదమ్మా అని అంటాడు ఆనందరావు, అప్పుడు సౌందర్య వెళ్ళవే అంతగా అడుగుతుంటే అని అంటుంది. నేను వెళ్ళను అంటే మధ్యలో నీ రికమండేషన్ ఏంటి నాయనమ్మ అని అంటుంది శౌర్య… అదే నా కొడుకు అయితే రమ్మనగానే వచ్చేవాడు. ఇన్ని రోజులు తను లేకున్నా.. నా పక్కనే ఉన్నాడు. అనుకుంటున్నాను.. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటాను. అనగానే.. సర్లే తాతయ్య వస్తాను. ఉండు అని అంటూ ఇద్దరు జాగింగ్ కి వెళ్ళిపోతారు. పార్కులో జాగింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటమ్మా చేయలేకపోతున్నావా.. అని అంటాడు. ఆనంద్ రావు, జాగింగ్ అనేది జీవితం లాగే అమ్మ.. ఎంత కష్టపడితే అంత సుఖం ఉంటుంది. కాకరకాయ ఆరోగ్యానికి మంచిది కానీ చేదుగా ఉంటుంది అని కొన్ని జీవిత సత్యాలు తనకు చెప్తాడు.

Advertisement

karthika deepam 29 july 2022 full episode

ఏంటి తాతయ్య పొద్దున్నే నాకు జీవిత సత్యాలు చెబుతున్నావు.. నాకు ఇలాంటివన్నీ బుర్రకక్కవ్ నేను ఏది అనుకుంటే అది చేస్తాను తాతయ్య అని అంటుంది. శౌర్య, కట్ చేస్తే నిరూపం ఒక కాఫీ ఇవ్వు అమ్మమ్మ అని సౌందర్యను అడుగుతాడు. అవును మీ డాక్టర్ మనవరాలు ఎక్కడైనా అమ్మమ్మ.. తను ఇంకా బయటికి రాలేదు రా అని అంటుంది. అమ్మమ్మ మీ మనవరాలు చిన్నప్పుడు కూడా ఇలాగే గొడవ పడే వాళ్ళ.. లేదురా చిన్నప్పుడు హేమ చాలా సాఫ్ట్ గా సౌర్య చాలా దుడుసుగా రౌడిగా ఉండేది. అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మీ మనవరాలు మాత్రం ఇలా ఎందుకు ఉంటున్నారని అమ్మమ్మ.. సౌందర్య వాళ్ళిద్దరూ నీ కలపడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం రా.. అని అంటుంది. కట్ చేస్తే స్వప్న శోభ తన పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నా టైం బాగలేదు ఆంటీ అంత నాకు నెగిటివ్గా జరుగుతుంది. అని అంటుంది. స్వప్న శోభపెళ్లి ఎలాగైనా నిరూపంతో జరిపించాలి అని అంటుంది. కట్ చేస్తే హిమ రూమ్లో హిమ శౌర్యాని నిరూపముని ఎలాగైనా కలపాలి.

అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ నిరుపం తనతో ఎలాగైనా సరదాగా గడపాలి. అని ఆలోచిస్తూ హేమను తీసుకొని పార్క్ కి జాగింగ్ కు వెళ్తారు. కట్ చేస్తే నావల్ల కాదు తాతయ్య ఇంటికి వెళ్లి పోదామా అని అంటుంది. శౌర్య, సరే వెళ్దాం పద అని ఆనందరావు ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. కట్ చేస్తే సౌందర్య పూజ చేస్తూ వాళ్ళిద్దరిని ఎలాగైనా కలుపు అని దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తారు. అమ్మమ్మ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతాడు. అందరూ జాగింగ్ కి వెళ్ళిపోయారు రా అని సౌందర్య అంటుంది. మీ దేవుడికి నా కోరిక నెరవేరాలని రికమెండ్ చెయ్ అమ్మ అని చెప్తాడు. ప్రేమ్ ఏమని పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే పార్కులో హిమ, నిరుపం జాగింగ్ చేస్తూ ఉండగా సౌర్య కళ్ళు తిరిగి కిందపడిపోయి అక్కడ ఉంటుంది. అప్పుడు నిరూపం హిమ శౌర్య దగ్గరికి వెళ్తారు. అయ్యో సౌర్యలే అని హిమ లేపుతూ ఉంటుంది. కానీ సౌర్య లేవదు..

బావ ఏదైనా వెహికల్ తీసుకురా తనని ఇంటికి తీసుకెళ్దాం అని అంటుంది. హిమ, కానీ నిరూపం అవసరం లేదు నేను ఎత్తుకొని తీసుకొస్తాను. అని తనని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఇద్దరినీ చూసి హిమ తెగ సంతోష పడుతూ ఉంటుంది. ఇప్పుడు తనని ఎత్తుకోవడం సౌర్య చూస్తే ఎంతో సంతోష పడిపోతుంది. అని గట్టిగా ఆటో ఆటో అని అనగానే శౌర్య లేస్తుంది. అప్పుడు శౌర్య తనని నిరూపం ఎత్తుకోవడం చూసి సంతోష పడిపోతుంది. నాకు బరువు అవుతుంది. మెలకువ వచ్చింది కదా దిగొచ్చు కదా అని అంటాడు. ఆహా నేను దిగను.. నాకు ఓపిక లేదు.. ఆరోజు నీకు మందు ఎక్కువైతే నేను నిన్ను పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాను… దానికి దీనికి చెల్లు అని అంటుంది శౌర్య, సరే అని తనని మోస్తూ తీసుకెళ్తూ ఉంటాడు..తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

Recent Posts

Viral News : నీ నీతి, నిజాయితీకి లాల్ సలాం.. చెత్తలో దొరికిన ₹45 లక్షల విలువైన బ్యాగ్‌ను పోలీసులకు అప్ప‌గింత‌..!

Viral News :  తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…

60 minutes ago

Pomegranate Juice : గుండె ఆరోగ్యానికి దానిమ్మ రసంతో ఎన్ని లాభాలో తెలుసా..?

Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…

2 hours ago

Zodiac Signs : జ‌న‌వ‌రి 20 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…

3 hours ago

Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..!

Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖమ్మం బహిరంగ…

11 hours ago

Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే త‌ల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!

Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…

12 hours ago

Renu Desai : రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు : వీధి కుక్కల హత్యలపై ఘాటుగా స్పందించిన రేణు దేశాయ్

Renu Desai  : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…

13 hours ago

Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..!

Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన‌ కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…

14 hours ago

ED Notice to Midhun Reddy : మిదున్ రెడ్డి కి బిగుసుకుంటున్న ఉచ్చు..లిక్కర్ కేసులో నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…

15 hours ago