Home » Entertainment » Karthika Deepam 29 June 2022 Full Episode
Entertainment

Karthika Deepam 29 June Today Episode : సౌందర్య, ఆనందరావు, తింగరిని ఇంట్లో నుంచి గెంటేసిన జ్వాల.. తింగరే హిమ అని జ్వాలకు తెలుస్తుందా?

Authored By
Varun G
The Telugu News | Updated on: June 29, 2022, 10:32 am
Advertisement

Karthika Deepam 29 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 1391 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బయట ఆటో చూసి.. ఇంట్లో జ్వాల ఉందేమో అనుకుంటుంది శోభ. కానీ.. నిరుపమ్ ఇంట్లో జ్వాల ఉండదు. ఆంటి.. బయట ఆటో ఉంది. అది జ్వాల ఆటో కదా అని అడుగుతుంది. దీంతో ఇందాక అది వచ్చింది. దానికి ఎంత పొగరో తెలుసా శోభ. అప్పుడెప్పుడో నిరుపమ్ తనకు కొనిచ్చాడని.. ఇప్పుడు ఆటోను తెచ్చి ఇంటి ముందు పెట్టి వెళ్లిపోయింది అని చెబుతుంది స్వప్న. అవును.. నువ్వు కొనిచ్చిన ఆటో తిరిగి ఇవ్వడం ఏంటి అని నిరుపమ్ ను అడుగుతుంది శోభ. దీంతో అదేం లేదు శోభ.. తనేదో నా మీద లేనిపోనివి ఊహించుకుంది. అదేం లేదు.. నేను హిమనే పెళ్లి చేసుకుంటున్నా అని ఖరాఖండిగా చెప్పేశాను అని చెప్పా. దీంతో ఆటో తెచ్చి ఇచ్చి వెళ్లింది అంటాడు నిరుపమ్.

Advertisement

karthika deepam 29 june 2022 full episode

అంటే.. పోటీ నుంచి జ్వాల తప్పుకుందన్నమాట. ఇక.. హిమతో నిరుపమ్ పెళ్లి కాకుండా ఎలా ఆపాలి అని మనసులో అనుకుంటుంది శోభ. నేనేం చేయలేనా.. అసలు ఈ పెళ్లిని ఆపలేనా అని అనుకుంటుంది. కట్ చేస్తే జ్వాల.. ఇంకా నిరుపమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. డాక్టర్ సాబ్ నా జీవితం అనుకున్నా. ఆయనే నా లోకం అనుకున్నా. డాక్టర్ సాబ్ ను మిస్ అయిపోతున్నాను. దీనంతటికీ కారణం.. ఆ తింగరి. నమ్మించి మోసం చేసింది అని అనుకుంటుంది జ్వాల. ఇంతలో తన డోర్ ఎవరో కొట్టిన సౌండ్ అవుతుంది. డోర్ తీసి చూస్తే.. ఆనంద రావు, సౌందర్య.. ఇద్దరూ వస్తారు. నమస్తే యంగ్ మాన్ అంటుంది జ్వాల. ఏంటి సీసీ.. అన్నట్టుగానే యంగ్ మాన్ ను తీసుకొచ్చావా అంటుంది జ్వాల.

Advertisement

ఎలా ఉన్నావు అమ్మా అని అడుగుతాడు ఆనంద రావు. సంతోషంగా ఉందామంటే కొందరు నన్ను ఉండనీయడం లేదు అంటుంది జ్వాల. నీ గురించి మీ సీసీ చెప్పింది. మరీ ఇంత సున్నితం అయితే ఎలా చెప్పు అని అంటాడు ఆనంద రావు. దీంతో సున్నితం ఏంటి యంగ్ మాన్.. మనం ప్రేమించిన వాళ్లను, మనం కావాలనుకున్నవాళ్లను వేరే వాళ్లు మన కళ్ల ముందు నుంచి లాక్కెళ్లిపోతే ఎలా ఊరుకుంటాం అంటుంది జ్వాల.

ఏమైంది సీసీ టెన్షన్ గా కనిపిస్తున్నావు అంటుంది జ్వాల. దీంతో నీ పర్మిషన్ లేకుండా ఒక పని చేశాం అంటుంది సీసీ. దీంతో ఏంటి సీసీ నువ్వు ఏదీ నాన్చకూడదు. కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాలి అంటుంది జ్వాల. నువ్వు మళ్లీ కొప్పడకూడదు అని అంటుంది సౌందర్య.

Advertisement

Karthika Deepam 29 June Today Episode : ఆనంద రావు, సౌందర్య చెప్పినా వినని జ్వాల

నా కోపం అంతా నా శత్రువు మీద.. ఆ తింగరి మీదే. వీళ్లిద్దరి మీదే తప్ప ఇంకెవరి మీద కోపం లేదు అంటుంది జ్వాల. నీ హీరో డాక్టర్ సాబ్ నాకు తెలుసు అని చెప్పా కదా అంటుంది సౌందర్య. నీకు ద్రోహం చేసిందని నువ్వు అనుకుంటున్న తింగరి అంటుంది సౌందర్య.

దీంతో అనుకోవడం ఏంటి సీసీ.. మోసం చేసిందే అది అంటుంది జ్వాల. ఆ తింగరి అడ్రస్ వెతికి పట్టుకొని తీసుకొచ్చాను అంటుంది సౌందర్య. దీంతో జ్వాల షాక్ అవుతుంది. ఎవరిని తీసుకొచ్చావు అని మళ్లీ అడుగుతుంది జ్వాల. దీంతో నీ తింగరినే తీసుకొచ్చాను అంటుంది.

అది ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో నాకు చెప్పింది. నీకు కూడా చెప్తా అన్నది. ఒక్కసారి వినవే ప్లీజ్ అంటుంది సౌందర్య. తింగరిని చూసి కోపం కట్టలు తెంచుకుంటుంది జ్వాలకు. తన దగ్గరికి వెళ్లి.. నడవవే.. బయటికి నడవవే. నా కళ్ల ముందు కనిపించొద్దు.

అసలు నువ్వు ఏం చేశావో తెలుసా.. అంటుంది. నా కళ్ల ముందు కనిపించకు అంటుంది. నీ మాయ మాటలు ఇంకా నేను నమ్మను. నడువు బయటికి అంటుంది. నేను చెప్పేది విను అని సౌందర్య.. జ్వాలను ఆపుతుంది. దీంతో సీసీ.. నువ్వు మధ్యలో అడ్డు రాకు అంటుంది జ్వాల.

Advertisement

ఎవ్వరు చెప్పినా వినదు జ్వాల. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోండి. తింగరితో పాటు మీరు కూడా వెళ్లిపోండి. మీకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకోసారి నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు. మీరు ఇలాంటి రాయబారాలు చేయాలనుకుంటే ఇంకోసారి నా దగ్గరికి రాకండి. నా బతుకు ఏదో నన్ను బతకనివ్వండి అని లోపలికి వెళ్లిపోతుంది జ్వాల.

దీంతో సౌందర్య, ఆనంద రావు, హిమ ముగ్గురు ఇంటికి వెళ్లిపోతారు. శౌర్య బలవంతంగా తన ప్రేమను చంపుకుంది అంటుంది హిమ. బలవంతంగా వాడికి శౌర్యను ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం తప్పు కదా అంటుంది సౌందర్య. ఒక వైపు నా మనవడు.. శౌర్య నా మనవరాలే. మధ్యలో నువ్వు వాళ్ల పెళ్లి చేద్దామంటున్నావు.

శుభలేఖలు కూడా అచ్చు అయ్యాయి. నిన్ను చూసి జాలి పడాలో.. బాధ పడాలో అర్థం కావడం లేదు. ఒకసారి ఆలోచించు అంటాడు ఆనంద రావు. దీంతో నేను అమ్మానాన్నలకు మాటిచ్చాను అంటుంది హిమ. ఏదో ఒకటి ఆలోచించండి. ఈ పెళ్లి జరగాల్సిందే అంటుంది హిమ.

మరోవైపు ఆటోను కిరాయికి తీసుకొని నడుపుతూ ఉంటుంది జ్వాల. కస్టమర్ ను తీసుకొని గుడికి వెళ్తుంటుంది. మరోవైపు గుడిలో నిరుపమ్, హిమ ఇద్దరూ మాట్లాడుతూ ఉంటారు. ఆ జ్వాల విషయాన్ని ఇంకా మరిచిపోవా అని అడుగుతాడు నిరుపమ్. గుడిలో వాళ్లిద్దరిని చూస్తుంది జ్వాల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి