Karthika Deepam 29 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 29 అక్టోబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 1183 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమ, శౌర్య.. ఇద్దరూ నవ్వుతూ సంతోషంగా కనిపిస్తారు. దీంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఆనంద రావు, ఆదిత్య ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ మీరు ఇలా నవ్వుతూ ఉండండి అంటాడు ఆదిత్య. హిమకు నాన్న మీద కోపం పోయింది అంటుంది శౌర్య. దీపు గాడు కూడా ఉంటే బాగుండు అని చెప్పి అంటుండగానే సౌందర్య, కార్తీక్ ఇద్దరూ అప్పుడే ఇంట్లోకి వస్తారు. వాళ్లను చూసిన శౌర్య నాన్న అంటూ దగ్గరికి వెళ్తుంది. ఈరోజు హిమ నాతో నవ్వుతూ ఆడుతోంది తెలుసా? అని అంటుంది శౌర్య. వెంటనే హిమ కూడా వెళ్లి కార్తీక్ ను హత్తుకుంటుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు.
ఏంటి సౌందర్య ఎక్కడికి వెళ్లారు? అని ఆనంద రావు అడుగుతాడు. పెద్దోడు, నేను కలిసి గుడికి వెళ్లివస్తున్నాం అంటుంది సౌందర్య. సడెన్ గా ఈ గుడి ఏంటి అని ఆదిత్య అడగగానే.. గుడికి వెళ్లాలంటే భక్తి ఉంటే చాలు కదా ఆదిత్యా.. సమయం, సందర్భం అవసరమా చెప్పు అని దీప అంటుంది. ఎందుకెళ్లారని అడక్కండి మామయ్య గారు.. ఏదో మొక్కు చెల్లించుకునేది ఉండిపోయిందట అందుకే వెళ్లారట.. కదా డాక్టర్ బాబు అని అడుగుతుంది దీప. దీంతో అవును దీప అంటాడు కార్తీక్.
నాన్నా నానమ్మలు గుడికి వెళ్లివచ్చారు ప్రసాదం కూడా తెచ్చారు.. తీసుకోండి అని పిల్లలకు చెబుతుంది దీప. ఆదిత్యను కూడా ప్రసాదం తీసుకో అని చెబుతుంది దీప. దర్శనం బాగా జరిగిందా అత్తయ్య. బాగానే జరిగి ఉంటుంది లెండి.. అని అన్న తర్వాత సౌందర్య, కార్తీక్ పైకి వెళ్లబోతారు. ఇంతలో దీప.. అత్తయ్య అని పిలుస్తుంది. నేనేం పాపం చేశాను అత్తయ్య. నన్ను వదిలేసి గుడికి వెళ్లారు.. అని అడుగుతుంది దీప. ఇంకోసారి గుడికి వెళ్లినప్పుడైనా నన్ను పిలవండి అత్తయ్య అని అంటుంది దీప. కానీ.. తనలో తానే ఏడుస్తూ ఉంటుంది దీప.
కట్ చేస్తే తన కొడుకును చూస్తూ చాలా సంతోషంగా ఉంటుంది మోనిత. ఏంటి మోనిత ఇంత మొండితనమా అంటుంది భారతి. కాస్త అయితే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో తెలుసా? చావు అంచుల దాకా వెళ్లివచ్చావు. అయినా అంత పెద్ద నిజాన్ని దాచడం ఏంటి మోనిత అంటుంది భారతి. దాచాల్సి వచ్చింది. నిజం చెబితే నా క్యారెక్టర్ కు రకరకాల పేర్లు పెట్టేవారు.. అనగానే అయితే ఇఫ్పుడు మాత్రం నిన్ను కార్తీక్ పట్టించుకుంటాడా? అంటుంది భారతి. నా భర్తగా కార్తీక్ నాకు సంతకం పెట్టాడు. ఇప్పుడు ఇది చాలు నాకు అంటుంది మోనిత. వీడే నా భవిష్యత్తుకు దిక్సూచి లాంటి వాడు. వీడే నాకు దారి చూపిస్తారు. ముందు వీడికి బారసాల చేయాలి.. దాని గురించే ఆలోచిస్తున్నాను అని అంటుంది మోనిత.
మరోవైపు కార్తీక్ దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు. దీపకు ఆ నిజం దాచిపెట్టి ఎంతోకాలం ఉండలేం.. అబద్ధం చెబుతూ ఎంతోకాలం మోసం చేయలేం అని కార్తీక్ అనుకుంటాడు. ఇంతలో పిల్లలు వచ్చి డాడీ ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు అంటాడు కార్తీక్. కానీ.. తన మనసులో ఆ మోనిత గురించే ఆలోచనలు తిరుగుతుంటాయి. తన మనసు ఏమాత్రం బాగుండదు.
ఆనంద రావు దగ్గరికి వచ్చి ట్యాబ్లెట్లు వేసుకున్నారా? అని అడుగుతుంది సౌందర్య. ఏంటి పొద్దున నుంచి నువ్వు సరిగ్గా నాతో మాట్లాడటం లేదు అంటాడు ఆనందరావు. నేను పిల్లల దగ్గర పడుకుంటాను. నాకు నిద్ర వస్తోంది అని వెళ్లబోతుంటే.. సౌందర్య ఆగు.. ఏమైంది.. నువ్వు ఎందుకు అలా ఉన్నావు. వాడు అమెరికా ట్రిప్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎన్నడూ లేనిది ఎందుకు ఇద్దరూ గుడికి వెళ్లారు.. నీకు ఇష్టం లేకపోతే ఇవేమీ చెప్పకు వెళ్లు అంటాడు ఆనంద రావు. ఇంతలో డోర్ పెట్టి వచ్చి ఆనంద రావుకు అసలు నిజం చెబుతుంది. తప్పు జరిగిపోయిందండి.. పెద్ద తప్పు జరిగింది.. అని అంటుంది.
ఏమైంది సౌందర్య అంటే మన ప్రమేయం లేకుండానే ఇంకో తప్పు జరిగింది అంటుంది సౌందర్య. తప్పు కన్నా కూడా ఘోరం పాపం అనడం కరెక్టేమో. పెద్దోడు నేను గుడికి వెళ్లలేదు. హాస్పిటల్ కు వెళ్లాం అంటుంది సౌందర్య. మోనితను చేర్పించిన హాస్పిటల్ కు వెళ్లాం.. అని చెప్పి మోనితకు బిడ్డ పుట్టిన విషయాలు అన్నీ చెబుతుంది సౌందర్య. దీంతో ఆనంద రావు షాక్ అవుతాడు.
దీంతో వెంటనే ఆనంద రావు కుప్పకూలిపోతాడు. వెంటనే సౌందర్య నీళ్లు తాగిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటాడు ఆనంద రావు. కోడలుకు ఏం సమాధానం చెబుతాం సౌందర్య. కోడలుకు ఇప్పటి దాకా చేసిన అన్యాయం చాలదా సౌందర్య. దీపకు ఈ విషయం తెలిస్తే మనం తన కళ్లలోకి చూడగలమా? తలెత్తుకొని తిరగగలమా? పిల్లలకు ఏమని చెబుతాం. సమాజానికి ఏం చెబుతాం. మాట్లాడవేంటి సౌందర్య.. అంటే ఏం మాట్లాడాలి. నాకు కాళ్లు చేతులు ఆడటం లేదు అంటుంది సౌందర్య.
వాడేం మనిషి సౌందర్య. ఛీ.. ఛీ.. దౌర్భాగ్యుడు. ఆ దరిద్రుడికి ఏం పట్టిందని ఇలా చేశాడు. ఇలాంటివి అన్నీ చూడటానికేనా నేను బతికి ఉంది. అప్పుడే పోయినా బాగుండేది అని అంటాడు ఆనంద రావు.
కట్ చేస్తే దీప.. దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అన్ని విషయాలు గుర్తు తెచ్చుకుంటుంది. పల్లవి నిజం చెబుతుందా? అబద్ధం చెబుతుందా? గుడికి అని వెళ్లి ఎందుకు అబద్ధం చెబుతున్నారు. అమెరికా ఎందుకు వద్దనుకున్నారు. హాస్పిటల్ కు వెళ్లి వచ్చిన విషయం కూడా నా దగ్గర ఎందుకు దాచారు.. అని దీప అనుకుంటుండగా అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏంటి దీప ఒక్కదానివే ఇక్కడున్నావు అని అడుగుతాడు కార్తీక్. దీంతో ఎక్కడున్నా ఒంటరిదాన్నే కదా డాక్టర్ బాబు. అమెరికా ఎందుకు వద్దనుకున్నారు.. ఆ మోనిత అని ఏదో అనబోయే సరికి.. మోనిత గురించి కాకుండా ఇక్కడ మాట్లాడుకోవడానికి ఇంకేం టాపిక్స్ లేవా? అంటాడు కార్తీక్. మనిద్దరి మధ్య కూడా దాని టాపిక్ ఎందుకు. మన జీవితం.. మన పిల్లలు.. మన భవిష్యత్తు ఇలాంటివేం లేవా? అంటూ సీరియస్ అవుతాడు కార్తీక్.
దీంతో రాత్రి పూట ఇల్లు వదిలి వెళ్లిపోతుంది దీప. ఉదయం లేవగానే అమ్మ కనిపించడం లేదని పిల్లలు వచ్చి చెబుతారు. దీంతో ఫోన్ చేద్దాం అని కార్తీక్ ఫోన్ తీస్తాడు. కానీ.. ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది అంటారు పిల్లలు. దీంతో కార్తీక్, సౌందర్య ఇద్దరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.