
karthika deepam 3 december 2021 full episode
Karthika Deepam 3 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 డిసెంబర్, 2021 శుక్రవారం ఎపిసోడ్ 1213 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ పరిస్థితి చూసి నాకు చాలా బాధేస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. అంటూ బాధపడుతుంది సౌందర్య. దీంతో మోనిత పొగరును నేను అణచివేస్తాను అత్తయ్య. మీరేం టెన్షన్ పడకండి అంటుంది దీప. 11 ఏళ్లు మీరు దూరం అయ్యారు. 11 ఏళ్ల ఎడబాటు తర్వాత ఇదిగో ఈ మోనిత. పాపం.. వాడు ప్రశాంతంగా ఎప్పుడు ఉన్నాడే.. అంటూ సౌందర్య బాధపడుతుంది. ఎన్ని టెన్షన్లు ఉన్నా.. నువ్వు మాత్రం నీ ధర్మాన్ని మరిచిపోవు. నువ్వు చాలా గ్రేట్ దీప.. అంటుంది సౌందర్య. ఇంతకు ముందు నీకు చెప్పకుండా ఒకటి రెండు పనులు చేయాల్సి వచ్చింది. అప్పుడున్న పరిస్థితులే కారణం తప్ప మరొకటి లేదు దీప.. అంటుంది సౌందర్య.
karthika deepam 3 december 2021 full episode
వీళైతే నన్ను క్షమించవే అంటుంది సౌందర్య. ఏంటి అత్తయ్య మీరు.. మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి అంటుంది. కట్ చేస్తే ఇల్లు అంతా గందరగోళంగా ఉండటం చూసి మోనిత షాక్ అవుతుంది. ప్రియమణి ఏమైంది.. వస్తువులన్నింటినీ చిందరవందరగా పడేశావు అంటుంది. నాకు చాలా బాధేస్తుంది అమ్మ. మిమ్మల్ని చీపుర్లు పట్టుకొని కొట్టబోయినా.. మీరు ఏం చేయలేకపోతున్నారు. అదే నాకు బాధేస్తోంది. అక్కడికెళ్లి ఏదో గొడవ పెడుతున్నారు కానీ మీకు ఏదైనా లాభం చేకూరిందా. మీరు ఏదో ఒకటి చేయాల్సిందే. లేదంటే నేను మీ ఇంట్లో పనిచేయను. నచ్చలేదు. నాకు నచ్చలేదు అమ్మ. మీరు ఏదైనా అనుకోండి అంటుంది ప్రియమణి. దీంతో నా బంగారు కొండ. నీకు నా మీద ఇంత అభిమానం ఉందని తెలియదు. మోనిత మారిపోయింది. మోనితలో పౌరుషం తగ్గిపోయింది అనుకుంటున్నావా? ప్రతిదానికి సరైన సమాధానం చెప్పి తీరుతాను ప్రియమణి అంటుంది మోనిత.
డాక్టర్ బాబే నా మొగుడు అని తిరుగుతున్న దీపకు మోనిత ఏంటో చూపిస్తా. దీపే నా సర్వశ్వం అన్న కార్తీక్ సంగతి కూడా చెబుతా. కార్తీక్ నా దగ్గరికి వచ్చి మోనిత నువ్వే కావాలి.. అని నా చుట్టూ ప్రదక్షణలు చేయించుకునేలా చేస్తాను.. అంటుంది మోనిత. దీపను వదిలేది లేదు. కార్తీక్ ను విడిచిపెట్టేది లేదు. నిజం ప్రియమణి.. నన్ను నమ్ము అంటుంది మోనిత.
మరోవైపు కార్తీక్ ఆసుపత్రికి వస్తాడు. ఆపరేషన్ చేసేందుకు సిద్ధం అవుతాడు. అనారోగ్యం అయిన వ్యక్తి భార్యాపిల్లలు వచ్చి ఎలాగైనా తన భర్తను కాపాడాలని కార్తీక్ ను కోరుతుంది. దీంతో ఏం కాదు.. నేను ఆపరేషన్ చేస్తా కదా. ఏం కాదు.. మీ ఆయన బతుకుతాడు.. అని ధైర్యం చెబుతాడు కార్తీక్.
మరోవైపు కార్తీక్ సాయంత్రం అయినా ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ పడుతుంది సౌందర్య. మళ్లీ మోనిత ఏమైనా ఇబ్బంది పెట్టిందా.. అని అనుకుంటుంది. ఇంతలో శ్రావ్య వస్తుంది. కానీ.. శ్రావ్య చెప్పే మాటలను సౌందర్య అస్సలు పట్టించుకోదు. దీంతో శ్రావ్యకు కోపం వస్తుంది.
మరోవైపు కార్తీక్ ఆపరేషన్ చేస్తుంటాడు. కానీ.. తనకు కళ్లు తిరుగుతుంటాయి. కొంచెం అస్వస్థతగా ఉంటుంది. బ్లేడ్ తీసుకొని ఆఫరేషన్ చేయబోతుంటాడు కానీ.. తన చేతులు వణుకుతుంటాయి. కార్తీక్ ఆపరేషన్ చేయలేకపోతాడు. దీంతో రవి ఏమైంది అని అడుగుతాడు. కానీ.. కార్తీక్ కు మత్తుగా ఉంటుంది.
దీంతో కార్తీక్ ఆపరేషన్ వద్దు క్యాన్సిల్ చేద్దాం అంటాడు రవి. కానీ.. వద్దు అని ఆపరేషన్ చేస్తాడు కార్తీక్. కానీ.. ఆపరేషన్ సరిగ్గా చేయడు. తప్పు చేస్తుంటాడు. దీంతో రవి వద్దు అంటాడు. అక్కడ కాదు.. ఏం చేస్తున్నావు నువ్వు. తప్పు చేస్తున్నావు అంటాడు. పేషెంట్ ను చంపేశావు అంటాడు రవి. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.