Karthika Deepam 3 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఫిబ్రవరి 3, 2022 గురువారం ఎపిసోడ్ 1266 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాపకు ఆపరేషన్ చేయడం నా వల్ల కాదు అంటాడు డాక్టర్ ధనుంజయ్. పాపకు ఇప్పటికే ఆపరేషన్ జరిగింది. భవిష్యత్తులో ఏవైనా కాంప్లికేషన్స్ వస్తే ప్రాబ్లమ్ అవుతుంది. డాక్టర్ కార్తీక్ కే నా కన్నా ఎక్కువగా అవగాహన ఉంటుంది. అందుకే ఈ ఆపరేషన్ డాక్టర్ కార్తీక్ అయితేనే చేయగలరు. సారీ అంజలీ నేను ఈ ఆపరేషన్ చేయలేను అంటాడు ధనుంజయ్. దీంతో ఆయన అపాయింట్ మెంట్ ఎలా దొరుకుతుంది అని డాక్టర్లు అంటుండగా.. నేను పిలిపించుకుంటాను అంటుంది దీప. మీరు ఏమనుకుంటున్నారు.. ఆయన గ్రేట్ కార్డియాలజిస్ట్ అంటారు డాక్టర్లు.
మీరు ఇప్పుడు రమ్మంటే ఆయన ఎలా వస్తారు. ఈరోజు ఆపరేషన్ చేయాలంటే తను ఎలా వస్తారు అని అంటుంది డాక్టర్ అంజలి. నేను రప్పించుకుంటాను అంటుంది దీప. ఎలా వస్తారు చెప్పండి అంటుంది అంజలి. నేను ఆయన కాళ్లు పట్టుకొని బతిమిలాడుకుంటాను అంటుంది దీప. మీరు ఏర్పాట్లు చేయండి సార్.. నేను కార్తీక్ సార్ ను పిలిపించుకుంటాను అంటుంది. నా కూతురు ప్రాణాలు కాపాడమని వేడుకుంటాను అంటుంది దీప. అక్కడి నుంచి దీప వెళ్లిపోతుంది. దీంతో కార్తీక్ కూడా వెళ్లి.. ఏంటి దీపా నువ్వు నేను ఎలా ఆపరేషన్ చేస్తాను అంటాడు కార్తీక్. నా కళ్లలోకి చూసి మాట్లాడండి.. అంటుంది దీప. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో శౌర్యకు ఆపరేషన్ చేయలేను అంటాడు కార్తీక్.
మీ మనసులో అన్ని సందేహాలు తీసేయండి. వాళ్ల ఆసుపత్రిలో ఆపరేషన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. డాక్టర్ కార్తీకే ఆపరేషన్ చేయాలన్నారు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు.. అంటుంది దీప. ఆలోచించకండి.. మీకు దండం పెడతాను.. ఇంత కష్టపడింది.. పిల్లల కోసం.. వాళ్ల భవిష్యత్తు కోసం కదండి.. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో.. తన ఆరోగ్యం ఏంటో మాకన్నా మీకే ఎక్కువ తెలుసు కదా.
చూస్తూ చూస్తూ అమ్మాయిని దూరం చేసుకుంటామా. తన ప్రాణాలు పోతే అని దీప అనబోతుంది. దీంతో వద్దు అంటాడు.. అలాంటి మాటలు మాట్లాడకు అంటాడు. కాదనకండి డాక్టర్ బాబు. కార్తీక్ ను పెళ్లి చేసుకున్న దీపలా కాకుండా.. శౌర్య తల్లిలా అడుగుతున్నారు. డాక్టర్ కార్తీక్ గారు.. నా కూతురుకు ప్రాణబబిక్ష పెట్టండి.. మీ కాళ్లు పట్టుకుంటాను అంటుంది దీప.
దీంతో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు తన బాబును ఎత్తుకెళ్లిన కోటేశ్ వీడియో చూస్తూ ఆనంద రావు గారు ఎక్కడున్నారండి.. అమ్మను వదిలేసి ఎలా ఉంటున్నారు. ఎంత ఏడుస్తున్నారో ఏంటో.. ఎవడ్రా నువ్వు నా ఆనందరావును తీసుకెళ్లావేంట్రా అని అనుకుంటుంది మోనిత. కార్తీక్ ఎక్కడున్నావు కార్తీక్. మన బిడ్డ మనకు దూరం అయ్యాడు కార్తీక్.. అనుకుంటుంది మోనిత.
ఇంతలో మోనిత దగ్గరికి డాక్టర్ భారతి వస్తుంది. ఆవేశంలో నేను ఒక పని చేశాను భారతి అంటుంది మోనిత. ఆదిత్య వాళ్లతో చాలెంజ్ చేశాను. పది రోజుల్లో కార్తీక్, బాబును తీసుకొచ్చి ఆ ఇంట్లో కాలు పెడతాను అని చెప్పాను భారతి అంటుంది మోనిత. అది ఎలా సాధ్యం అవుతుంది మోనిత అంటుంది భారతి.
నన్ను ఎంకరేజ్ చేయి భారతి. కార్తీక్ దగ్గర ఇప్పుడు కనీసం ఫోన్ కూడా లేదు. అందుకే కార్తీక్ ను పట్టుకోవడం కష్టంగా మారింది. కార్తీక్ దొరుకుతాడు భారతి. ఎక్కడికీ పోడు. కార్తీక్ మీద ఉన్న నా ప్రేమే అతడిని నా దగ్గరికి రప్పిస్తుంది అని చెబుతుంది మోనిత.
నేను ఊరెళ్తున్నాను నువ్వు వస్తావా మోనిత అంటుంది. ఎక్కడికి అని అడుగుతుంది. మా ఫ్రెండ్ అంజలి ఫోన్ చేసింది. తన కూతురు బర్త్ డేకు రమ్మని చెప్పంది. నేను వెళ్తున్నాను.. నువ్వు కూడా వస్తావా అంటుంది. దీంతో ముందు నేను రాను అంటుంది మోనిత. తర్వాత నేను వస్తాను అంటుంది.
మరోవైపు కార్తీక్.. శౌర్యకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్ లా రెడీ అవుతాడు. అమ్మ.. శౌర్యకు ఏం కాదు కదా అంటుంది హిమ. తనకు ఏం కాదు.. నువ్వు కాసేపు ఏం మాట్లాడకు అమ్మ. అమ్మ టెన్షన్ లో ఉంది అంటాడు అప్పారావు. ఇంతలో కార్తీక్.. డాక్టర్ డ్రెస్ వేసుకొని ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లబోతాడు.
ఒకసారి దీపను చూసి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తాడు కార్తీక్. కార్తీక్ ను చూసి డాక్టర్లు షాక్ అవుతారు. డాక్టర్ అంజలిని పిలిపించమంటారా అంటాడు డాక్టర్ ధనుంజయ్. దీంతో పిలిపించు అంటాడు. శౌర్య రిపోర్టులు చూస్తాడు. ఇంతలో అంజలిని పిలిపిస్తారు.
డాక్టర్ కార్తీక్ ను చూసి అంజలి కూడా షాక్ అవుతుంది. మీరు మా హాస్పిటల్ కు రావడం చాలా సంతోషంగా ఉంది అంటుంది అంజలి. శౌర్యకు ఆపరేషన్ చేయడం ప్రారంభిస్తాడు కార్తీక్. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఆపరేషన్ సక్సెస్ అయిందని చెబుతాడు కార్తీక్. దీంతో చాలా సంతోషిస్తుంది దీప.
కంగ్రాట్స్ అండి ఆపరేషన్ సక్సెస్ అయింది.. అని డాక్టర్ అంజలి, ధనుంజయ్ చెబుతారు. అవును.. మీ ఆయన ఎక్కడ అని అడుగుతుంది డాక్టర్ అంజలి. ఆ తర్వాత తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.