Karthika Deepam 3 May Today Episode : హిమను ప్రేమిస్తున్నానని జ్వాలతో నిరుపమ్ చెబుతాడా? దీంతో జ్వాల ఏం చేస్తుంది? హిమ మీద ఇంకా పగ పెంచుకుంటుందా?

Advertisement
Advertisement

Karthika Deepam 3 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 1342 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సడెన్ గా మరిచిపోయిన మీ మనవరాలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో తెలుసుకోవచ్చా అని సౌందర్యను అడుగుతుంది జ్వాల. నీకెందుకు చెప్పు.. ఇక్కడికి వచ్చిన పనేంటో చూసుకొని వెళ్లిపో అంటుంది సౌందర్య. నేనే శౌర్యను అని తెలిశాక నువ్వేం చేస్తావు. నన్ను ఇంటికి తీసుకెళ్లి హిమను కలిపించి తన మీద ఉన్న కోపాన్ని తగ్గించుకోమని అంటావా అని అనుకుంటుంది జ్వాల. మరోవైపు సౌందర్య కారులో వెళ్తుండగా… ఇంతలో జ్వాలకు ఫోన్ వస్తుంది. తనను అర్జెంట్ గా రావాలని ఎవరో పిలుస్తారు. దీంతో ఏం చేయాలో తెలియదు జ్వాలకు.

Advertisement

karthika deepam 3 may 2022 full episode

నానమ్మ నీకు నాకు ఏదో టైమింగ్ లో తేడా వస్తోంది. నువ్వు నా బొమ్మ గీయించావు కదా. నా బొమ్మ చూడటానికి వెళ్తే ఇంకేమైనా ఉందా అమ్మో అని అనుకొని జ్వాల ఆటో తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సౌందర్య కూడా శౌర్య బొమ్మ తీసుకోవడం కోసం గీత ఆఫీసుకు వెళ్లాలనుకుంటుంది. ఇద్దరూ ఒకేసారి ఆఫీసుకు వస్తారు. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది సౌందర్య. నీకెందుకు అని అడుగుతుంది. ఆ తర్వాత నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతుంది జ్వాల. దీంతో నేను బొమ్మ కోసం వచ్చాను అంటుంది సౌందర్య. లోపలికి వెళ్లి గీత కోసం వాకబు చేస్తుంది సౌందర్య. దీంతో తను లేదు.. ఎవరో చనిపోతే ఆఫీసు ఖాళీ చేసి వెళ్లిపోయింది అని చెబుతారు.

Advertisement

దీంతో సౌందర్యకు ఏం చేయాలో అర్థం కాదు. మీ మనవరాలి మీద అంత ప్రేమా అంటుంది. బొమ్మ నా చేతికి వస్తే చాలా పనులు అవుతాయి అనుకున్నాను అంటుంది సౌందర్య. దీంతో మనవరాలి బొమ్మ కన్నా మనవరాలి బొమ్మతోనే నీకు ఎక్కువగా పని ఉన్నట్టుంది అంటుంది జ్వాల.

వచ్చిన పని అవ్వలేదని నేను బాధపడుతుంటే నీ గోల ఏంటి వెళ్లు అంటుంది. నేను వాకింగ్ చేసుకోవాలి వెళ్లు అంటుంది. దీంతో వాకింగ్ కు వెళ్తావు కానీ.. ఇంటికి వెళ్లవా అని అడుగుతుంది. దీంతో వెళ్లను అని అంటుంది. నేను ఎక్కడికైనా వెళ్తాను నీకెందుకు అంటుంది సౌందర్య.

Karthika Deepam 3 May Today Episode : జ్వాల ఇంటికి వెళ్లిన హిమ

మరోవైపు హిమ జ్వాల ఇంటికి వెళ్తుంది. డాక్టరమ్మ నువ్వే పేషెంట్ లా కనిపిస్తున్నావేంటి ఏమైంది అని అడుగుతుంది. దీంతో ఏం లేదు అని అంటుంది హిమ.  నేను బాగానే ఉన్నాను జ్వాల కోసం చూస్తున్నాను అంటుంది హిమ. మాకు చాలా  ఏళ్ల క్రితం చికమగళూరులో ఒక పాప దొరికింది. ఆ తర్వాత ఆ పాప తప్పిపోయింది అని అంటుంది. నిన్ను చూస్తుంటే అచ్చం ఆ పాపను చూసినట్టే అనిపిస్తోంది అంటుంది చంద్రమ్మ.

ఇంతలో జ్వాల వస్తుంది. తనకు నిజం తెలిసిపోయిందేమో అని అనుకుంటుంది హిమ. ఏమైంది జ్వాల అంటుంది. బొమ్మ గీశారా అని అడుగుతుంది. నువ్వు చూశావా అని అంటుంది. గీసింది కానీ.. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందట. ఆ బొమ్మను చెత్త వాళ్లకు అమ్మేశారట అంటుంది.

నిజమా అంటుంది. నేను వదులుతానా.. ఎలాగోలా అటూ ఇటూ తిరిగి చెత్త పేపర్లు ఏరుకునే వాడిని పట్టుకొని బొమ్మను చూశాను అంటుంది జ్వాల. ఆ బొమ్మలో ఎవరున్నారు అని అడుగుతుంది హిమ. దీంతో అది నువ్వే కదా అని అంటుంది. దీంతో అది నేను అంటూ టెన్షన్ పడుతుంది హిమ.

ఏంటి తింగరి.. అది నేను అంటావు. ఆ బొమ్మ దొరకలేదు. ఊరికే జోక్ చేశాను అంటుంది జ్వాల. దీంతో హిమ ఊపిరి పీల్చుకుంటుంది. కట్ చేస్తే నిరుపమ్ కు హిమనే గుర్తొస్తూ ఉంటుంది. ఇంతలో జ్వాలకు ఫోన్ చేసి నీతో పని ఉంది. పర్సనల్ గా మాట్లాడాలి అంటాడు.

నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని నీతో చెప్పాలి. అర్జెంట్ గా మనం కలవాలి. నువ్వు ఎక్కడున్నావో చెప్పు. నేనే వస్తాను అంటాడు నిరుపమ్. అర్జెంట్ గా నా మనసులో ఉన్న మాటను నీతో పంచుకోవాలి అంటాడు నిరుపమ్. దీంతో తను ఎక్కడుందో ఆ అడ్రస్ చెబుతుంది.

డాక్టర్ సాబ్.. మీరు రమ్మనడం.. నేను మిస్ చేయడమా.. వస్తున్నాను అంటుంది. ఆటోలో వెళ్తుండగా.. తన ఆటో ఆగిపోతుంది. దీంతో ఏం చేయాలో తనకు అర్థం కాదు. ఇంతలో సౌందర్య కారు వస్తుంది. తను లిఫ్ట్ కావాలంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Pensioners : కొత్తగా పించను తీసుకునే వారికి శుభవార.. కావాల్సిన అర్హతలు, పత్రాలు ఇవే.. !

Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…

12 mins ago

Ginger Tea : చలికాలంలో ప్రతిరోజు అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు…?

Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…

1 hour ago

Vastu Tips : ఇంట్లో ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఎలాంటి దోషాలు దరి చేరవు…!

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…

2 hours ago

Telangana Pharma Jobs : తెలంగాణలో ఫార్మా కంపెనీల 5,260 కోట్ల పెట్టుబడులు, 12,490 ఉద్యోగాల కల్పన

Telangana Pharma Jobs : హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్‌మెంట్‌లు…

3 hours ago

Zodiac Signs : శనీశ్వరుని అనుగ్రహంతో 2025లో ఈ రాశుల వారికి రాజయోగం… పట్టిందల్లా బంగారం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…

4 hours ago

Saffron : ఇంటిని మినీ క‌శ్మీర్‌గా మార్చి ‘కుంకుమపువ్వు’ పండిస్తున్న దంప‌తులు

Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంప‌తులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…

13 hours ago

Hyundai Kia EV Cars : హ్యుందాయ్, కియా 2 లక్షలకు పైగా EV కార్ల‌ రీకాల్…!

Hyundai Kia EV Cars : ప‌వ‌ర్ డ్రైవ్ స‌మ‌స్య కార‌ణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…

14 hours ago

Pushpa 2 Rashmika Mandanna : పుష్ప 2 రష్మిక ఫ్యాన్స్ కి పండగే పండగ.. అల్లు అర్జున్ ఓపెన్ అయిపోయాడంటే..?

Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…

15 hours ago

This website uses cookies.