Home » Entertainment » Karthika Deepam 30 December 2021 Full Episode
Entertainment

Karthika Deepam 30 Dec Today Episode : రుద్రాణి అరెస్ట్.. బాబును తిరిగి తెచ్చుకున్న శ్రీవల్లి.. కానీ రోడ్డు ప్రమాదం చేయించి కోటేశ్, శ్రీవల్లిని చంపించిన రుద్రాణి

Authored By
Varun G
The Telugu News | Published on: December 30, 2021, 9:00 am
Advertisement

Karthika Deepam 30 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 డిసెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 1236 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రుద్రాణి బాబును తీసుకెళ్లడంతో ఏం చేయాలా అని కార్తీక్, దీప టెన్షన్ పడతారు. రుద్రాణి దగ్గరికి వెళ్లి బాబును తీసుకొని వద్దాం అంటాడు కార్తీక్. కార్తీక్ బాబు ఏం మాట్లాడుతున్నారు.. అక్కడికి వెళ్తే చాలా ప్రమాదం అంటుంది దీప. తోటి వారికి కష్టం వస్తే అలాగే చూస్తూ ఊరుకుంటామా అంటాడు కార్తీక్. దీప రిస్క్ అయినా పర్వాలేదు.. నేను పోలీస్ స్టేషన్ కు వెళ్తాను. కోటేశ్, శ్రీవల్లికి అండగా ఉంటాను అంటాడు కార్తీక్. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి చేసేది ఏముంటుంది చెప్పండి అంటుంది దీప. సాయం చేసే విషయంలో నువ్వు నాకన్నా ముందుంటావు కానీ.. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు కదా అంటాడు కార్తీక్.

Advertisement

karthika deepam 30 december 2021 full episode

వాళ్లను అలా వదిలేయడం కరెక్ట్ కాదు దీప.. నేను వెళ్తాను అంటే.. వద్దు కార్తీక్ బాబు అని అడ్డుకుంటుంది. పిల్లలు కూడా నువ్వు ఎక్కడికీ వెళ్లకు నాన్న అంటారు. దీంతో సరేనమ్మా అంటాడు కార్తీక్. మరోవైపు పిల్లాడిని చూసి రుద్రాణి మురిసిపోతుంది. పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు. ఒరేయ్ అబ్బులు నీకు జోలపాట వచ్చా అని అడుగుతుంది. ఎవరైనా జోలపాట పాడండి అంటుంది. ఎవ్వరూ రావు అంటారు. బాబు పడుకోడు. దీంతో తనకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో పోలీసులు రుద్రాణి ఇంటికి వస్తారు. అక్కా పోలీసులు వస్తున్నారని అబ్బులు చెబుతాడు. పోలీస్ జీపు నుంచి కోటేశ్, శ్రీవల్లి దిగుతారు. దీంతో రుద్రాణికి ఏం చేయాలో అర్థం కాదు. రుద్రాణి ఇంటికి పోలీసులు రావడం ఏంది అని అనుకుంటుంది రుద్రాణి. ఇంతలో పోలీసులు ఇంట్లోకి వస్తారు.

Advertisement

నా ఇంట్లోకే వస్తావా మాధురి అంటుంది రుద్రాణి. వస్తాను.. ఇప్పటి వరకు ఎవ్వరూ కంప్లయింట్ ఇవ్వలేదు. ఈసారి ఇచ్చారు.. ఇక ఆగేదే లేదు.. అంటుంది మాధురి. రుద్రాణి రెండు చెంపలు చెళ్లుమనిపిస్తుంది. దీంతో బాబును తిరిగి ఇచ్చేస్తుంది శ్రీవల్లికి.

నేను ట్రాన్స్ ఫర్ అయ్యే లోపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అన్నీ ఇచ్చి మరీ వెళ్తాను అంటుంది ఎస్ఐ మాధురి. బిడ్డను తీసుకొని కోటేశ్, శ్రీవల్లి ఇంటికి వెళ్తారు. అందరినీ బయటికి పంపిస్తుంది ఎస్ఐ. ఆ తర్వాత లోపల ఏం జరుగుతుందో తెలియదు. రుద్రాణి కాస్త ఇబ్బందిగా బయటికి వస్తుంది.

Advertisement

Karthika Deepam 30 Dec Today Episode : రుద్రాణిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన ఎస్ఐ మాధురి

శ్రీవల్లి.. నా మీదే పోలీస్ కంప్లయింట్ చేస్తావా? నువ్వు జీవితంలో పెద్ద తప్పు చేశావే అని అనుకుంటుంది. రుద్రాణి అక్కయ్యకు పోలీస్ జీపు ఎక్కడానికి ఎవరైనా హెల్ప్ చేయండి అని అంటుంది ఎస్ఐ. మరోవైపు కార్తీక్ ఫోన్ ను దొంగిలించిన మహేశ్ ను రత్నసీత.. సౌందర్య ఇంటికి తీసుకొస్తుంది.

నమస్తే మేడమ్ అంటుంది. వీడి పేరు మహేశ్ మేడమ్. కార్తీక్ సార్ ఫోన్ అమ్ముతుండగా పట్టుకున్నాను అంటుంది. కార్తీక్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింద. వాళ్లను ఎక్కడ చూశావు అని అడుగుతుంది సౌందర్య. దీంతో అన్ని విషయాలు చెబుతాడు. కార్తీక్ ఫోన్ పడేసి వెళ్లినట్టు చెబుతాడు.

ఆ తర్వాత వాళ్లు బస్సు ఎక్కి వెళ్లారని చెబుతాడు మహేశ్. నీకు డబ్బు ఇస్తాను.. వాళ్లు ఎక్కడ బస్సు దిగారో.. కాస్త కనిపెట్టు.. అంటుంది సౌందర్య. నీకు బోలెడంత డబ్బు ఇస్తాను కానీ… నేను చెప్పినట్టు చేయి ప్లీజ్ అంటుంది సౌందర్య. మరోవైపు కార్తీక్, దీప.. కోటేశ్, శ్రీవల్లి కోసం వెయిట్ చేస్తుంటారు.

నాన్నా.. ఆ ఆంటి.. తమ్ముడిని ఎందుకు తీసుకెళ్లింది అని శౌర్య అడుగుతుంది. మీకెందుకు ఇవన్నీ.. అంటుంది దీప. తమ్ముడికి నామకరణం అన్నారు కదా.. పంతులు గారు కూడా వెళ్లిపోయారు కదా అంటుంది శౌర్య. వాళ్లు వస్తారులే.. మీరు కాసేపు మాట్లాడకుండా కూర్చొండి.. అని దీప అనగానే బాబును తీసుకొని కోటేశ్, శ్రీవల్లి వస్తారు.

Advertisement

దీంతో అందరూ సంతోషిస్తారు. సాయంత్రం కాగానే దీప కొన్ని పిండి వంటలు చేసి కార్తీక్ కు తెచ్చి ఇస్తుంది. మరోవైపు రుద్రాణికి మంచిగా జరిగింది అని అంటుంది దీప. కానీ.. రుద్రాణి రాత్రే ఇంటికి వచ్చేసింది అని చెబుతాడు కార్తీక్. రుద్రాణి పగబడితే అస్సలు వదలదు అని ఊళ్లో వాళ్లు అనుకుంటున్నాను అని చెబుతాడు కార్తీక్.

ఇంతలో స్కూటీ మీద కోటేశ్, శ్రీవల్లి వెళ్తుండగా.. అబ్బులు టిప్పర్ తో స్కూటీని గుద్దిస్తాడు. దీంతో రోడ్డు పక్కన పడతారు కోటేశ్, శ్రీవల్లి. వాళ్లకు తీవ్రంగా గాయాలు అవుతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి