
karthika deepam 30 may 2022 full episode
Karthika Deepam 30 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 మే 2022, సోమవారం ఎపిసోడ్ 1365 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మేము చూసే పెళ్లి సంబంధం అయినా నీకు ఇష్టమా లేదా అని ఆనంద రావు ప్రశ్నిస్తాడు. దీంతో ఏం చెప్పాలో హిమకు అర్థం కాదు. ఎందుకు అడుగుతారండి. అడిగి మీ పెద్దరికాన్ని ఎందుకు తగ్గించుకుంటారు. చిన్నప్పటి నుంచి బావ బావ అని వాడి వెనుక తిరిగి.. వాడినే పెళ్లి చేసుకుంటా అని చెప్పి చివరి నిమిషంలో పెళ్లి చేసుకోనని చెప్పింది. ఇప్పుడు వేరే సంబంధం చూస్తున్నాము. పెళ్లి చేసుకో అంటే చేసుకుంటుందా.. మనల్ని సాధించడానికే పూనుకుంది. మనల్ని ఇబ్బంది పెట్టడానికే ఉంది అంటుంది సౌందర్య. ఏమ్మా.. పెళ్లి చేసుకుంటావా అని మళ్లీ అడుగుతాడు ఆనంద రావు. దీంతో నేను పెళ్లి చేసుకుంటాను నానమ్మ అంటుంది హిమ. దీంతో సౌందర్య, ఆనంద రావు షాక్ అవుతారు.
karthika deepam 30 may 2022 full episode
బావ మనసులో నుంచి నేను వెళ్లిపోవాలంటే.. బావకు నా మనసు విరిగిపోవాలంటే నేను ఏదో ఒక పెళ్లికి ఒప్పుకోక తప్పదు.. అని మనసులో అనుకుంటుంది హిమ. స్వప్న.. నిరుపమ్ కు శోభతో పెళ్లి చేస్తా అంటోంది. ఇప్పుడు వేరే పెళ్లికి ఓకే అంటున్నావు.. అంటుంది. నీకు అక్కర్లేనప్పుడు వాడి జీవితాన్ని నువ్వెందుక నాశనం చేస్తావు. కనీసం నువ్వయినా వాడిని పెళ్లి చేసుకోమని ఒప్పించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌందర్య. నువ్వు ఒక డాక్టర్ వి. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి అంటాడు ఆనంద రావు. నానమ్మ, తాతయ్య.. మీకు నిజం చెప్పలేను. అలాగని అబద్ధమూ చెప్పలేను. అందుకని మాట్లాడుకుండా ఉండాల్సి వస్తోంది. ఈ విషయంలో మీరు నన్ను క్షమించండి అని అనుకుంటుంది హిమ.
మరోవైపు స్వప్నను టార్గెట్ చేస్తారు ఇంద్రుడు, చంద్రమ్మ. తన కూతురు ఆటో కాల్చేసినందుకు.. తన కారు డోర్ ఓపెన్ కాకుండా లాక్ చేస్తారు. తన కారు కీతో ఓపెన్ చేసినా కూడా తనకు ఓపెన్ కాదు. దీంతో అంతలోనే అక్కడి నుంచి వెళ్తున్న ఇంద్రుడు, చంద్రమ్మను చూసి ఆగండి.. అని అడుగుతుంది.
కారు లాక్ రావడం లేదు అంటుంది. ముందు పని చూడండి అంటుంది. మరి డబ్బులు అంటే సరే ఇస్తానులే.. చస్తానా అంటుంది. అవును.. నాకు రెండు డౌట్లు.. నా కారు చెడిపోయినప్పుడే మీరు వస్తున్నారా.. అంటుంది. మీరిద్దరూ కలిసిపోయారా అంటుంది.
దీంతో మా మనోభావాలను దెబ్బతినేలా చేశారు. మేము పని చేయం అంటారు. మా మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే.. మీరు ఎక్కువ రేట్ ఇవ్వాలి అంటుంది. సరే.. 10 వేలు ఇస్తాను. కానివ్వండి అంటుంది స్వప్న. మరోవైపు నిరుపమ్.. సత్యం దగ్గరికి వస్తాడు.
అసలు హిమకు ఎందుకు పెళ్లి అంటే ఇష్టం లేదో జ్వాలతో అడిగించు. అలాగైనా అసలు నిజం తెలుస్తుంది కదా అంటాడు సత్యం. దీంతో సరే అంటాడు నిరుపమ్. మరోవైపు డాక్టర్ సాబ్ కు లంచ్ తీసుకెళ్తూ ఉంటుంది జ్వాల. మరోవైపు సౌందర్య రోడ్డు మీద కారులో ఆగి ఉంటుంది.
ఏమైంది అని అనుకుంటుంది. ఆటో ఆపుతుంది. ఏంటే నీ సంగతి. నీ నాటకాలన్నీ నాకు తెలిసిపోయాయి అంటుంది సౌందర్య. ఎక్కడికెళ్లావు. నీకోసం ఎక్కడని వెతకను.. అంటుంది. ఈరోజు ఏమైంది.. ఎక్కడికెళ్లినా దొరకట్లేదు అంటుంది సౌందర్య.
నాకేంటో అప్పుడప్పుడు నిన్ను చూడాలని.. నీతో మాట్లాడాలని అనిపిస్తోంది అంటుంది సౌందర్య. తెలియకుండా మనిషికి మనిషికి అనుబంధం అనేది ఒకటి ఉంటుంది కదా అంటుంది సౌందర్య. నీ మాటలకు, ధైర్యానికి, దూకుడును నిన్ను చేసుకునేవాడు అయిపోతాడు అంటుంది సౌందర్య.
నువ్వు వంటలక్కలా వంటలు తీసుకెళ్లడం ఏంటి.. అయినా ఆటో నడుపుతావు కదా అంటుంది. వంటలక్క అనేసరికి జ్వాలకు కోపం వస్తుంది. మరోవైపు శౌర్య చిన్నప్పటి ఫోటో చూపించి.. తను ఎక్కడైనా కనిపిస్తే చెప్పు అంటుంది సౌందర్య.
మరోవైపు బాక్స్ తీసుకొని సత్యం ఇంటికి వస్తుంది జ్వాల. హలో ఎక్స్ ట్రా అన్నా కూడా ప్రేమ్ పలకరించడు. దీంతో అతడిని ఏమైంది అంటుంది. దీంతో ఇదిగో తిక్క నువ్వు నాతో మాట్లాడకు.. నేను నీతో మాట్లాడను అంటాడు ప్రేమ్. ఏమైంది అని జ్వాల షాక్ అవుతుంది.
నిరుపమ్ వద్దు అన్నా కూడా ప్రేమ్ వినడు. నీకు, నాకు ఎలాంటి ఫ్రెండ్ షిప్ లేదు. వచ్చావా.. భోజనం తెచ్చావా.. డబ్బులు తీసుకున్నావా.. వెళ్లిపోయావా అంతే అంటాడు ప్రేమ్. కేవలం డబ్బు కోసమే భోజనం తెస్తున్నానా అంటుంది జ్వాల.
దీంతో అంతే కదా.. లేకపోతే నువ్వు ఏమైనా నా బంధువువా అంటాడు ప్రేమ్. ఏమైందిరా.. అంత కోపం ఎందుకు తనపైన అంటాడు నిరుపమ్. తన మూలంగానే హిమకు నా ప్రేమ విషయం చెప్పలేకపోయాను అని అనుకుంటాడు ప్రేమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.