Karthika Deepam 30 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ 30 సెప్టెంబర్ 2021, తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1158 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమ, శౌర్య.. డబ్బుల కోసం పరుపు కింద వెతుకుతారు. దాని కిందే వాళ్లకు మోనిత.. ఇచ్చిన ఇంటర్వ్యూ పేపర్ వాళ్లకు కనిపిస్తుంది. కానీ.. వాళ్లు దాన్ని గమనించరు. డబ్బులను చూసి.. వాటినే లెక్కపెడతారు.
కట్ చేస్తే.. మోనిత సెల్ లో కూర్చొని టెన్షన్ పడుతుంటుంది. నేను ఇంటర్వ్యూ ఇచ్చిన పేపర్ కార్తీక్ ఇంటికి చేరిందా లేదా.. అని చూస్తుంది. కొంప కొల్లేరు అయిందా.. ఏం జరుగుతోంది ఇంట్లో.. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అయితే ఏం అర్థం కావడం లేదు.. చాలా సంతోషంగా ఉంది. కార్తీక్ మీద ఉన్న ప్రేమ నన్ను కార్తీక్ దగ్గరికి తీసుకెళ్తుంది.. అంటూ ఫుల్ ఖుషీ అవుతుంది మోనిత. కార్తీక్.. నిన్ను చూడకుండా ఇన్ని రోజులు ఎలా ఉండగలిగాను. అయినా నువ్వు ఎక్కడికి వెళ్లావు. ఇక్కడేగా ఉన్నది. కార్తీక్ నన్ను చూడగానే మొదటి మాట ఏం మాట్లాడుతాడు. కోపంగా చూస్తాడా? షాక్ అవుతాడా? ఛీ కొడతాడా? జాలి పడతాడా? నా కార్తీకే కదా. ఏం చేసినా నాకిష్టమే.. అని అనుకుంటుంది మోనిత.
ఇంతలో తమ దగ్గర ఉన్న డబ్బులను లెక్కబెట్టి.. వీటిని తీసుకెళ్లి నాన్నా బయటికి తీసుకెళ్లు అని చెబుదాం అంటుంది శౌర్య. చెప్పకుండా షర్ట్ కొని.. సర్ ప్రైజ్ చేద్దాం నాన్నను. చెప్పకుండా ఎందుకు కొన్నారు.. అంటే నీతో ఇన్ని రోజులు మాట్లాడలేదు కదా.. అందుకే అని చెప్పి సర్ ప్రైజ్ చేద్దాం అని చెప్పి.. కింద పేపర్ లో మోనిత ఫోటో పైన ఉన్న 50 రూపాయల నోటును తీసుకుంటారు. మోనిత ఫోటోను చూసి షాక్ అవుతారు. ఇదేంటి.. మోనిత ఆంటి ఫోటో పేపర్ లో పడింది అని టెన్షన్ పడతారు. ఇది ఈరోజు పేపరే కదా.. అని చూసి అది చదివి తెగ ఏడుస్తారు. మోనిత ఆంటి ఏంటి.. డాడీ మంచోడు కాదంటోంది అంటుంది హిమ. మోనిత ఆంటి.. అబద్ధాలు చెబుతుందేమో హిమ.. అంటుంది శౌర్య.
కట్ చేస్తే.. సౌందర్య బిడ్డ పిల్లలు వెళ్లబోతుంటారు. ఈ ఒక్క రోజు ఉండిపోవచ్చు కదరా.. అంటుంది. మీరు అలా వచ్చి వెళ్లిపోతున్నారు. మీరేమీ దూరపు చుట్టాలు కాదురా.. దూరమైన ఆత్మీయులు అంటుంది. సారీ.. టైమ్ ఈజ్ టైమ్.. అంటారు. పక్కనే కదా.. అప్పుడప్పుడు వస్తుంటాం అంటారు పిల్లలు. అక్కడెక్కడో అమెరికాలో ఉన్నారు. ఇక్కడికి వచ్చి కూడా వెళ్తామంటున్నారు. ఎన్ని రోజులు వీళ్లతో ఆడిపాడితే మన తనువు తీరుతుందో కదా.. అని అంటాడు ఆనంద రావు.
ఈ సందర్భంలో తన బిడ్డతో ఉన్న అనుబంధాన్ని సౌందర్య గుర్తు తెచ్చుకుంటుంది. ఇల్లు దగ్గరే కదా.. వెళ్లి పిల్లలను దిగబెట్టి వద్దాం పదా.. అని చెబుతాడు ఆనందరావు. పదండి.. మా ఇంటికి వెళ్దాం అని పిల్లలు కూడా అంటారు. ప్రవహిస్తుంటేనే నీళ్లు స్వచ్ఛంగా మారుతాయి. మాట్లాడుకుంటేనే బంధాలు బలపడతాయి సౌందర్య.. అంటాడు ఆనంద రావు. దీంతో పెద్దోడా.. ఒకసారి స్వప్న ఇంటికి వెళ్లొస్తాను అని కార్తీక్ ను అడుగుతుంది సౌందర్య. వెళ్లిరా మమ్మీ అని చెబుతాడు కార్తీక్. వెళ్లేముందు.. హిమ, శౌర్యకు కూడా బైబై చెప్పి వెళ్తారు పిల్లలు.
ముందు ఆ న్యూస్ పేపర్ తగులబెట్టేయాలి అని హడావుడిగా దీప బెడ్ రూమ్ లోకి వెళ్లి చూస్తుంది కానీ.. తనకు న్యూస్ పేపర్ కనిపించదు. ఎంత వెతికినా దొరకదు. ఏమైంది.. అని ఆలోచిస్తుంటుంది. ఇక్కడే పెట్టాను కదా. ఏమైంది.. ఎవరు తీసి ఉంటారు అని టెన్షన్ పడుతుంది. ఇంతలో తనకు 50 రూపాయల నోటు కనిపిస్తుంది. ఒకవేళ పిల్లలు ఏమైనా తీశారా.. అని టెన్షన్ పడుతుంది. భగవంతుడా.. పిల్లలు చూస్తే ఇంకేమైనా ఉందా.. అని అనుకుంటుంది. తనకు చెమటలు పడతాయి.
పిల్లలు ఏడుస్తూ ఉండటం చూసి కార్తీక్.. ఇటు రండి.. ఏంటి అలా కూర్చున్నారు అని అడుగుతాడు. ఇలా రండమ్మా అంటాడు. అయినా కూడా పిల్లలు రారు. అసలు తనవైపు కూడా చూడరు. సరే.. నేనే మీ దగ్గరికి వస్తా.. అని చెప్పి.. వాళ్ల దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు కార్తీక్. దీంతో వాళ్లు అక్కడి నుంచి లేస్తారు. ఏమైంది మీకు.. క్షణానికి ఒక రకంగా మారుతున్నారు.. అన్నా కూడా వినరు. పదా శౌర్య వెళ్దాం అని అంటుంది హిమ. అసలు.. ఏమైంది చెప్పండి అని అంటాడు కార్తీక్. బయటికి వెళ్దాం అన్నారు కదా.. పదండి వెళ్దాం అంటాడు కార్తీక్. వెళ్లి ఐస్ క్రీమ్ తిందాం.. షాపింగ్ కు వెళ్దాం.. అని అంటాడు కార్తీక్. ఈరోజు అంతా మీ ఇష్టం. అన్ లిమిటెడ్ ఫన్.. సరేనా అన్నా కూడా పిల్లలు అస్సలు మాట్లాడరు. ఇంతలో దీప అక్కడికి వస్తుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారు.
పిల్లలకు ఏమైంది.. పలకరిస్తే మాట్లాడటం లేదు అంటాడు కార్తీక్. ఏదోలా కనిపిస్తున్నారు.. అంటాడు. స్కూల్ లో ఎవరో ఏదో అన్నారని అలిగారు. ఇప్పుడు మాత్రం ఏమైందో అర్థం కావడం లేదు. ఇందాక సారీ అన్నారు. నన్ను బాధపెట్టా అన్నారు. ఇప్పుడేమో మాట్లాడకుండా వెళ్లారు అంటాడు కార్తీక్. అంతలోనే ఏమైందో తెలియట్లేదు అంటాడు.. దీపకు కూడా ఏం అర్థం కాదు. పిల్లలు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాదు. ఏంటి దీప నాకు ఈ శిక్ష అంటాడు కార్తీక్. పిల్లలు మళ్లీ అలిగారంటే ఆ పేపర్ కొంపదీసి వాళ్లే తీశారా.. అని అనుకుంటుంది దీప. ఈ విషయం డాక్టర్ బాబుకు చెబితే ఇంకా బాధపడతారు కావచ్చు.. అని భయపడుతుంది దీప. ఏం చేయాలి.. అని అనుకుంటుంది.
కట్ చేస్తే.. మోనిత దగ్గరికి దీప వెళ్తుంది. తన సెల్ కు వెళ్లి.. నువ్వు ఏం ఘనకార్యం సాధించావని పేపర్ లో నీ ఇంటర్వ్యూలు ఇస్తున్నావు. ఇవన్నీ ఆపేయ్ అని అడుగుతుంది. ఆపేస్తాను.. కార్తీక్ తో నా మెడలో తాళి కట్టించు.. డీల్ ఓకేనా అని అంటుంది మోనిత. డీల్ నచ్చకపోయినా హ్యాపీనే. ఎందుకంటే నేను చేసేది నేను చేస్తా అంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.