karthika deepam 31 march 2022 full episode
Karthika Deepam 31 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 1314 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమను దగ్గర్లోని ఓ టిఫిన్ బండి దగ్గరికి తీసుకెళ్తుంది శౌర్య. తనను మంచిగా చూసుకోవడంతో హిమ షాక్ అవుతుంది. చేతులు కడుక్కో అని నీళ్లు ఇస్తుంది. తన చేతులు కడుగుతుంది. తూడ్చుకో అని కర్చీఫ్ ఇస్తుంది. మరోవైపు సౌందర్య కారులో గుడికి వస్తుంది. అప్పుడప్పుడు శౌర్య ఈ గుడికి వస్తుందేమో.. ఇక్కడున్న వాళ్లకు తనేమైనా తెలుసేమో కనుక్కుందామని వస్తుంది సౌందర్య. గుడిలో అందరికీ శౌర్య ఫోటోను చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారా అని అడుగుతుంది. కానీ.. ఎవ్వరూ చూడలేదు అని అంటారు.
karthika deepam 31 march 2022 full episode
దీంతో సౌందర్యకు ఏం చేయాలో అర్థం కాదు. భగవంతుడా.. ఇప్పుడు ఏం చేసేది. పెద్దదయిన శౌర్య ఎలా ఉందో ఏంటో అని అనుకుంటుంది. కట్ చేస్తే.. ఆ కుర్రాడికి రవ్వ ఇడ్లీ అని ఎందుకు పెట్టావు అంటుంది హిమ. మీరు పేర్లు భలే పెడతారండి అంటుంది హిమ.సరే.. ఒకసారి పిలువు అంటుంది. వద్దు అంటుంది. దీంతో పిలువు అని గట్టిగా దబాయిస్తుంది. దీంతో రవ్వ ఇడ్లీ అంటుంది. దీంతో ఆ కుర్రాడు అక్కడికి వస్తాడు. తను ఎవరో తెలుసా.. డాక్టర్ అని శౌర్య చెబుతుంది. దీంతో చాలా సంతోషిస్తాడు రవ్వ ఇడ్లీ.
వీడికి డాక్టర్ అవ్వాలని కోరిక అని చెబుతుంది శౌర్య. దీంతో నువ్వు చాలా కష్టపడి చదవాలి.. ఖచ్చితంగా డాక్టర్ అవుతావు అంటుంది హిమ. తర్వాత టీ తీసుకొచ్చి ఇస్తాడు రవ్వ ఇడ్లీ. దీంతో థ్యాంక్స్ అంటుంది. దీంతో అందరూ నవ్వుతారు.
మరోవైపు ఫోన్ లో.. హిమ ఫోటోను చూస్తూ ఉంటాడు ప్రేమ్. ఇంతలో స్వప్న వస్తుంది. నువ్వు ఇక్కడే నా దగ్గరే ఉండాలి అంటుంది. దీంతో ఎప్పుడూ చెప్పేదే కదా.. కొత్తగా ఏదైనా చెప్పు అంటాడు ప్రేమ్. నేను నీ దగ్గరికి వస్తే మరి డాడీని ఎవరు చూసుకుంటారు అంటాడు ప్రేమ్.
మరోవైపు కారు దిగి.. శౌర్య గురించే ఆలోచిస్తుంటుంది సౌందర్య. ఏంటి శౌర్య.. ఎందుకు ఇలా చేస్తున్నావు. ఎక్కడున్నావు.. అనుకుంటుంది. ఆటో నడుపుతూ హిమను లోపల కూర్చోబెట్టుకొని వెళ్తుంటుంది శౌర్య. దీంతో ఏమండి.. కాస్త నెమ్మదిగా నడపండి అంటుంది హిమ.
ఆటోలో కూర్చున్న హిమకు కళ్లు తిరిగి స్పృహ కోల్పోతుంది. దీంతో వామ్మో.. ఇదేంది బాబోయ్ ఇలా కళ్లు తిరిగి పడిపోయింది అని అనుకుంటుంది శౌర్య. ఇంతలో శౌర్య ఫోటోను పట్టుకొని సౌందర్య వాళ్లనూ వీళ్లనూ అడుగుతూ ఉంటుంది.
ఇంతలో అక్కడే ఉన్న శౌర్య ఆటోను వదిలేసి ముందుకు వెళ్తుంది సౌందర్య. తర్వాత తన ముఖం మీద నీళ్లు కొట్టి అక్కడి నుంచి హిమను తీసుకెళ్తుంది శౌర్య. మరోవైపు హిమ పెళ్లి చేద్దాం అని సౌందర్యతో అంటాడు. తర్వాత హిమ ఇంటికి వెళ్లి.. ఆమె హిమే అని తెలుసుకొని శౌర్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.